STOCKS

News


2025 కల్లా ప్రతి ఐదు లావాదేవీల్లో నాలుగు డిజిటలే!!

Tuesday 13th March 2018
news_main1520961008.png-14641

  • ఏసీఐ వరల్డ్‌వైడ్‌, ఏజీఎస్‌ ట్రాన్స్‌యాక్ట్‌ నివేదికలో వెల్లడి 

న్యూఢిల్లీ: భారత్‌లో డిజిటల్‌ ట్రాన్సాక‌్షన్ల విలువ 2025 కల్లా ఏడాదికి లక్ష కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. పెద్ద నోట్ల రద్దు, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం వంటి అంశాలు దీనికి కారణంగా నిలుస్తాయని ఏసీఐ వరల్డ్‌వైడ్‌, ఏజీఎస్‌ ట్రాన్స్‌యాక్ట్‌ టెక్నాలజీస్‌ సంయుక్త నివేదిక పేర్కొంది. ప్రతి ఐదు లావాదేవీల్లో నాలుగు డిజిటల్‌ రూపంలో ఉంటాయని తెలిపింది. ప్రసుత్తం ఇండియాలో డిజిటల్‌ ట్రాన్సాక‌్షన్లు నిర్వహించే యూజర్ల సంఖ్య 9 కోట్లకు దగ్గరిగా ఉందని, ఇది 2020 కల్లా 30 కోట్లకు చేరొచ్చని పేర్కొంది. ‘డిజిటల్‌ ట్రాన్సాక‌్షన్లు జోరు మీదున్నాయి. బలమైన వృద్ధి గణాంకాలు నమోదవుతున్నాయి. భవిష్యత్‌లోనూ ఇదే ట్రెండ్‌ కొనసాగాలంటే సౌకర్యవంతమైన, నమ్మదగిన టెక్నాలజీ అవసరం’ అని ఏసీఐ వరల్డ్‌వైడ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మనీశ్‌ పటేల్‌ పేర్కొన్నారు. డిజిటల్‌ లావాదేవీలు పెరిగేకొద్ది కంపెనీలకు సైబర్‌ సెక్యూరిటీ వ్యయాలు కూడా పెరగుతాయని నివేదిక పేర్కొంది. భారత్‌లో సైబర్‌ దాడుల వ్యయాలు 2025 కల్లా వార్షికంగా 20 బిలియన్‌ డాలర్లకు చేరొచ్చని తెలిపింది. ఇక స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల సంఖ్య 2020 నాటికి రెట్టింపుతో 50 కోట్లకు చేరొచ్చని అంచనా వేసింది. 



You may be interested

2018లో రేటు పెరుగుదల లేనట్లే!

Tuesday 13th March 2018

 విశ్లేషకుల అభిప్రాయం ముంబై: ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ, 2018లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణ రేటు- రెపో (ప్రస్తుతం 6 శాతం)ను తగ్గించే అవకాశాలు కనిపించడం లేదని పలువురు విశ్లేషిస్తున్నారు.  ♦ బడ్జెట్‌లో ఆహార ధాన్యాలకు కనీస మద్దతు ధర పెంపు (ఎంఎస్‌పీ)- ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే 2018-19 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీసే అవకాశం ఉందని జపాన్‌ బ్రోకరేజ్‌ సంస్థ- నొమురా అభిప్రాయపడింది.  ♦ పారిశ్రామిక వృద్ధి రేటు

ఎస్‌బీఐ కనీస బ్యాలెన్స్ చార్జీల తగ్గింపు

Tuesday 13th March 2018

 75 శాతం మేర తగ్గుదల  ఇకపై నగరాల్లో నెలకు రూ. 15, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 10  ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి ముంబై: ఖాతాదారులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కనీస బ్యాలెన్స్ పెనాల్టీ చార్జీలను 75 శాతం మేర తగ్గించింది. దీంతో ఇకపై నగరాల్లో నెలకు సగటు బ్యాలెన్స్ పరిమితులను పాటించని పక్షంలో రూ. 15 (పన్నులు అదనం), సెమీ అర్బన్‌

Most from this category