STOCKS

News


రెండు రోజుల్లో పీసీ జ్యువెలర్‌ 45 శాతం క్రాష్‌

Wednesday 2nd May 2018
Markets_main1525257503.png-16085

ముంబై:- పీసీ జ్యువెలర్‌  షేరు పతనం వరుసగా ఎనిమిదో రోజూ కొనసాగింది. తెలియని కారణాలతో గత వరుస ట్రేడింగ్‌ల్లో నష్టపోతున్న పీసీ జ్యువెలర్‌  షేరు బుధవారం బీఎస్‌ఈలో మరో 23 శాతం నష్టపోయింది. ఇంట్రాడేలో ఏకంగా 28శాతం నష్టపోయి రూ.103.40లకు చేరుకుంది. తెలియని కారణాలతో గత వరుస ట్రేడింగ్‌ల్లో నష్టపోతున్న షేరు పతనాన్ని అడ్డుకోవడానికి ఏప్రిల్‌ 29(ఆదివారం)న కంపెనీ అధికారులు బైబ్యాక్‌ ప్రతిపాదనను తెరమీదకు తెచ్చారు. ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదన,  క్యూ4 ఫలితాల ప్రకటలనతో పాటు, వాటాదారులకు డివిడెండ్‌ చెల్లించే అంశాలపై మే 25న బోర్డు సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో గత సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో రూ. 200 స్థాయికి షేరు పెరిగినప్పటికీ, అదేరోజు మార్కెట్‌ ముగిసే సమయానికి 18శాతం నష్టపోయి రూ.145ల వద్ద ముగిసింది. గత ట్రేడింగ్‌ నష్టాన్ని కొనసాగిస్తూ నేటి ట్రేడింగ్‌లో 23 శాతం నష్టపోయి రూ.111.56ల వద్ద ముగిసింది. అంటే కేవలం రెండు రోజుల్లో (సోమ, బుధ) గరిష్టస్థాయి నుంచి 45 శాతంపైగా పతనమయ్యింది. పీసీ జువెలరీ షేరు జనవరి 16న రూ.600.65ల వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. నాటి నుంచి నేటి వరకూ షేరు 81శాతం నష్టపోయింది.



You may be interested

ఎంఎస్‌సీఐ ఇండెక్స్‌లో తగ్గనున్న ఇండియా వెయిటేజి

Wednesday 2nd May 2018

–540 మిలియన్‌ డాలర్లు దేశం నుంచి తరలివెళ్లే అవకాశం –మోర్గాన్‌స్టాన్లీ అంచనా ఎంఎస్‌సీఐ ఎమర్జింగ్‌ మార్కెట్‌ ఇండెక్స్‌లో చైనా–ఏ గ్రూప్‌ షేర్లను చేర్చనున్నందున ఆ ఇండెక్స్‌లో భారత్‌ వెయిటేజీ 20 బేసిస్‌ పాయింట్లు తగ్గవచ్చని, ఫలితంగా ఇక్కడ్నుంచి 520 మిలియన్‌ డాలర్ల విదేశీ ఈక్విటీ నిధులు తరలివెళ్లవచ్చని అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ మోర్గాన్‌స్టాన్లీ అంచనావేసింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు...వారి పెట్టుబడులకు ఎంఎస్‌సీఐ ఇండెక్స్‌ను అధికంగా ట్రాక్‌ చేస్తుంటారు. ఆ ఇండెక్స్‌లో వున్న వివిధ

మే సిరీస్‌లో 5 ఆకర్షణీయమైన షేర్లు..!

Wednesday 2nd May 2018

నిఫ్టీకి తక్షణ రెసిస్టెన్స్‌ (నిరోధస్థాయి) 10,850 పాయింట్ల వద్ద ఉండగా.. మద్దతు స్థాయి 10,690 వద్ద ఉన్నట్లు సాన్‌క్టమ్‌ వెల్త్ మేనేజ్‌మెంట్‌ హెడ్ టెక్నికల్ అండ్ డెరివేటివ్స్ ఆశిష్ చతుర్‌మోథా అంచనావేశారు. ఈస్థాయి కంటే కిందకు పడిపోతే సూచీ 10,614 స్థాయిని పరీక్షించవచ్చని అన్నారు. అయితే, వీక్లీ ఎమ్‌ఏసీడీ పాజిటివ్‌గా ఉందని, మార్కెట్‌ ఇక్కడ నిలవడితే నిఫ్టీ 10,910-10,940 స్థాయికి చేరుకునే అవకాశం సైతం ఉందని విశ్లేషించారు. స్వల్పకాలంలో 19

Most from this category