STOCKS

News


సన్‌ టీవీ కొనొచ్చు- సెంట్రమ్‌

Tuesday 15th May 2018
Markets_main1526371942.png-16467

కంపెనీ: సన్ టీవీ నెట్‌వర్క్ లిమిటెడ్
సిఫార్సు: సెంట్రమ్‌ బ్రోకింగ్‌ 
ప్రస్తుత ధర: రూ.969 (మే 15, 2018న)
టార్గెట్‌ ధర: రూ.1,170
రెకమండేషన్‌: కొనొచ్చు
52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ. 1097 /652

గతేడాది చివరి త్రైమాసికం (2017–18, క్యూ4)లో కంపెనీ ప్రకటించిన ఫలితాలు ఆశించిన స్థాయి కంటే మరింత ఆకర్షణీయంగా ఉన్నాయని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ వివరించింది. ఆదాయం 5.2 శాతం వృద్ధి చెందేందుకు అవకాశం ఉందని అంచనావేయగా.. ఏకంగా 23.1 శాతం వృద్ధి చెందినట్లు వెల్లడించింది. ప్రకటనలు, ప్రసార ఫీజుల ఆదాయాలు గణనీయంగా పెరిగినందున ఇది సాధ్యపడిందని విశ్లేషించింది. సబ్‌స్క్రిప్షన్‌ ఆదాయం 47 శాతం పురోగతి సాధించగా.. డీటీహెచ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 20 శాతం పెరిగినట్లు వివరించింది. తమిళనాడు మార్కెట్‌లో డిజిటలైజేషన్ ఆధారంగా సబ్‌స్క్రిప్షన్‌ ఆదాయం మరింత పెరుగుతుందని అంచనావేస్తోంది. ఏఆర్‌ఏఎస్‌యూ కేబుల్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం కూడా ఆరోగ్యకర ఆదాయ వృద్ధికి దోహదపడనుందని భావిస్తోంది. 2020 ఆర్థిక సంవత్సరంలో అంచనా ఈపీఎస్‌ 28 రెట్లు ఉండవచ్చనే విశ్లేషణ ఆధారంగా షేరు టార్గెట్‌ ధరను రూ.1170 వద్ద నిర్ణయించినట్లు వెల్లడించింది. 
 

సెంట్రమ్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ రూపొందించిన రీసెర్చ్‌ రిపోర్ట్‌ను కింద ఉన్న పీడీఎఫ్‌ అటాచ్‌మెంట్‌లో పరిశీలించగలరు.

View Pdf One (1526371946Sun TV- Q4FY18 Result Update - Centrum 14052018.pdf)

You may be interested

ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్ కొనొచ్చు- సెంట్రమ్‌

Tuesday 15th May 2018

కంపెనీ: ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌ సిఫార్సు: సెంట్రమ్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ ప్రస్తుత ధర: రూ.400 (మే 15, 2018న) టార్గెట్‌ ధర: రూ.430 రెకమండేషన్‌: కొనొచ్చు 52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ. 434 /285 గతేడాది చివరి త్రైమాసికం (2017–18, క్యూ4)లో కంపెనీ ప్రకటించిన ఫలితాలు ఆకర్షణీయంగా ఉన్నాయని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ వివరించింది. అంతకుముందు త్రైమాసికంతో పోల్చితే షేరు ధర 34 శాతం పెరిగిందని.. రుణ మంజూరీ పెరగడం ఇందుకు ప్రధాన కారణమని వివరించింది.

హెచ్‌యూఎల్‌కు ఫలితాల జోష్‌..!

Tuesday 15th May 2018

ఏడాది గరిష్టాన్ని తాకిన షేరు ముంబై:- గత ఆర్థిక సంవత్సరపు చివరి త్రైమాసికం(క్యూ4)లో అంచనాలను మించి ఫలితాలను సాధించడంతో హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్‌) షేరు ధర మంగళవారం కొత్త రికార్డు గరిష్టస్థాయిని తాకింది. నేడు హెచ్‌యూఎల్‌ షేరు రూ.1526.25 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం ప్రకటించిన క్యూ4 ఫలితాలు విశ్లేషకుల అంచనాలను మించి ఉండటంతో ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే ఇన్వెస్టర్లు, ట్రేడర్లు షేరు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా

Most from this category