STOCKS

News


మణప్పురం ఫైనాన్స్‌ కొనొచ్చు-హెచ్‌డీఎఫ్‌సీ

Wednesday 10th January 2018
Markets_main1515577002.png-13007

కంపెనీ: మణప్పురం ఫైనాన్స్‌ లిమిటెడ్
సిఫార్సు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
ప్రస్తుత ధర: రూ.120 (10 జనవరి, 2018)
టార్గెట్‌ ధర: రూ.137.5 & రూ.158
రెకమండేషన్‌: కొనొచ్చు
52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ.125.4 /69.2

మణప్పురం ఫైనాన్స్‌ లిమిటెడ్ షేరుకు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ బై రేటింగ్‌ ఇచ్చింది. ప్రస్తుత ధర వద్ద షేరును కొనుగోలు చేయవచ్చని సూచిస్తోన్న హెచ్‌డీఎఫ్‌సీ.. రూ.107-109 స్థాయి వరకు పడిపోయినప్పడల్లా మరిన్ని షేర్లను కొనుగోలు చేసే వ్యూహంతో షేరును తీసుకోవచ్చని, వచ్చే 3-4 త్రైమాసికాలలో షేరు ధర రూ.158 స్థాయికి వెళ్లే అవకాశం ఉందని అంచనావేస్తోంది. బంగారంపై రుణాలతో పాటు ఇతర లోన్‌ విభాగంలో కూడా మార్కెట్‌ వాటాను పెంచుకుంటున్న మణప్పురం ఫైనాన్స్‌ ఈ విభాగంలో 3.1 శాతం నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2 నాటికి 21.6 శాతానికి పెరిగిందని, రానున్నకాలంలో ఈ సంస్థ గోల్డ్‌ లోన్‌ మాంజూరీ కూడా పెరగనుందనే అంశాల ఆధారంగా బై రేటింగ్‌ ఇచ్చినట్లు ప్రకటించింది.
 
హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రూపొందించిన రీసెర్చ్‌ రిపోర్ట్‌ను కింద ఉన్న పీడీఎఫ్‌ అటాచ్‌మెంట్‌లో పరిశీలించగలరు.

View Pdf One (1515577012Mannapuram Finance - Pick of the Week - 080118.pdf)

You may be interested

హరిత సీటింగ్‌ సిస్టమ్స్‌ కొనొచ్చు- హెచ్‌డీఎఫ్‌సీ

Wednesday 10th January 2018

కంపెనీ: హరిత సీటింగ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్ సిఫార్సు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ప్రస్తుత ధర: రూ.1,079 (10 జనవరి, 2018) టార్గెట్‌ ధర: రూ.1150-1288 రెకమండేషన్‌: కొనొచ్చు 52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ.1054 /651 హరిత సీటింగ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ బై రేటింగ్‌ ఇచ్చింది. ప్రస్తుత ధర వద్ద షేరును కొనుగోలు చేయవచ్చని సూచిస్తోన్న హెచ్‌డీఎఫ్‌సీ.. రూ.920-1011 స్థాయి వరకు పడిపోయినప్పడల్లా మరిన్ని షేర్లను కొనుగోలు చేసే వ్యూహంతో షేరును తీసుకోవచ్చని, వచ్చే 4-6

చమురు వేడితో అబాన్‌ ఆఫ్‌షోర్‌ పరుగులు

Wednesday 10th January 2018

ముంబై:- ఆఫ్‌షోర్‌ డ్రిల్లింగ్‌ రిగ్గుల కంపెనీ అబాన్‌ ఆఫ్‌షోర్‌ షేరు బుధవారం 17శాతానికి పైగా ర్యాలీ చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు 3 ఏళ్ల గరిష్టస్థాయికి చేరడం అబాన్‌ ఆఫ్‌షోర్‌ షేరు షేరు ర్యాలీకి కారణమైంది. నేడు అబాన్‌ ఆఫ్‌షోర్‌ షేరు రూ.221ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 17శాతం పైగా ర్యాలీ చేసి రూ.256.25ల స్థాయిని తాకింది. ట్రేడింగ్‌ సమయంలో మొత్తం 38 లక్షల షేర్లు చేతులు

Most from this category