STOCKS

News


ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేరు కొనొచ్చు-హెచ్‌డీఎఫ్‌సీ

Saturday 13th January 2018
Markets_main1515833229.png-13110

కంపెనీ: ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ లిమిటెడ్
సిఫార్సు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
ప్రస్తుత ధర: రూ.1,701 (13 జనవరి, 2018)
టార్గెట్‌ ధర: రూ.1,889
రెకమండేషన్‌: కొనొచ్చు
52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ.1,185/1,185

 

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ లిమిటెడ్ షేరుకు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ బై రేటింగ్‌ ఇచ్చింది. ప్రస్తుత ధర వద్ద షేరును కొనుగోలు చేయవచ్చని సూచిస్తోన్న హెచ్‌డీఎఫ్‌సీ.. రూ.1,889 వద్ద టార్గెట్‌ ధరను నిర్ణయించినట్లు ప్రకటించింది. ఈ ఆర్థిక సంత్సరం మూడో త్రైమాసికం(క్యూ3)లో బ్యాంక్‌ ప్రకటించిన ఫలితాలను ఒకసారి పరిశీలిస్తే.. రూ.936.25 కోట్ల నికరలాభాన్ని బ్యాంక్‌ ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో సాధించిన రూ.750 కోట్ల కంటే ఈ క్యూ3 నికరలాభం 24.73 అధికం. మొత్తం ఆదాయం రూ.5,473.54 కోట్లగా నమోదయ్యింది. ఎన్‌పీఏలు ఈ క్యూ3లో 1.16శాతం పెరిగాయి. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) ఈ త్రైమాసికంలో 20శాతం వృద్ధి చెంది రూ.1,895 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలానికి  రూ.1,578 కోట్లను సాధించింది. ఈ అంశాల ఆధారంగా హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ టార్గెట్‌ ధరను నిర్ణయించినట్లు ప్రకటించింది.

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రూపొందించిన రీసెర్చ్‌ రిపోర్ట్‌ను కింద ఉన్న పీడీఎఫ్‌ అటాచ్‌మెంట్‌లో పరిశీలించగలరు.

View Pdf One (1515833591IndusInd_Bank_-_3QFY18_-_HDFC_sec.pdf)

You may be interested

కన్‌స్ట్రక్షన్‌ కంపెనీల క్యూ3పై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనాలు..!

Saturday 13th January 2018

ముంబై: నిర్మాణరంగ కంపెనీల ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసిక (2017–18, క్యూ3) ఫలితాలు మిశ్రమంగా ఉండేందుకే అవకాశం ఉందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనావేస్తోంది. అశోకా బిల్డ్‌కాన్‌, దిలీప్‌ బిల్డ్‌కాన్‌, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌, ఐటీడీ సిమెంటేషన్‌, అహ్లువాలియా కాంట్రాక్ట్స్, జే కుమార్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ కంపెనీల ఫలితాలు బాగుండే అవకాశం ఉండగా.. పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌, ఎన్‌సీసీ ఫలితాలు నిరాశపరిచే అకాశం ఉందని విశ్లేషిస్తోంది. సద్భవ్ ఇంజినీరింగ్, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా ఫలితాలు పరవాలేదు

ఫార్మా క్యూ3పై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనా..!

Saturday 13th January 2018

ముంబై: ఫార్మా రంగ ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసిక (2017–18, క్యూ3) ఫలితాలు మిశ్రమంగా ఉండేందుకే అవకాశం ఉందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనావేస్తోంది. అమెరికాలో నూతన ఉత్పత్తులను తక్కువ పోటీ వాతావరణంలో ప్రవేశపెడుతున్న సిప్లా, క్యాడిలా హెల్త్‌కేర్‌ ఫలితాలు బాగుండే అవకాశం ఉండగా.. అరబిందో ఫార్మా, అల్‌కెమ్‌ ల్యాబ్స్ ఫలితాలు బాగున్నాయి అనేలా ఉండనున్నాయని విశ్లేషిస్తోంది. సన్‌ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, దివీస్‌ ల్యాబ్‌ కంపెనీల ఫలితాలు పరవాలేదు అనేలా

Most from this category