STOCKS

News


హిందుస్తాన్ యూనిలీవర్‌ కొనొచ్చు- హెచ్‌డీఎఫ్‌సీ

Wednesday 16th May 2018
Markets_main1526461246.png-16506

కంపెనీ: హిందుస్తాన్ యూనిలీవర్‌ (హెచ్‌యూఎల్‌)
సిఫార్సు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
ప్రస్తుత ధర: రూ.1,575 (మే 16, 2018)
టార్గెట్‌ ధర: రూ.1,615
రెకమండేషన్‌: కొనొచ్చు
52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ.1,575/974

హెచ్‌యూఎల్‌ షేరుకు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ బై రేటింగ్‌ ఇచ్చింది. గతేడాది చివరి త్రైమాసికం (2017–18, క్యూ4)లో స్టాండ్‌అలోన్‌ ప్రాతిపదికన రూ.1,351 కోట్ల నికర లాభాన్ని కంపెనీ ప్రకటించింది. హోమ్‌ కేర్‌ బిజినెస్‌ అమ్మకాలు జోరుగా ఉండటంతో ఈ స్థాయి నికర లాభం సాధించామని హెచ్‌యూఎల్‌ వివరించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలోని ఇదే త్రైమాసికంలో వచ్చిన నికర లాభం రూ.1,183 కోట్లతో పోలిస్తే 14 శాతం వృద్ధి సాధించినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌లో తెలియజేసింది. నికర అమ్మకాలు రూ.8,773 కోట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ.9,003 కోట్లకు, ఇబిటా 24 శాతం వృద్ధితో రూ.2,048 కోట్లకు పెరిగింది. మరోవైపు మొత్తం వ్యయాలు రూ.7,349 కోట్ల నుంచి 2 శాతం తగ్గి రూ.7,181 కోట్లుగా నమోదయ్యాయి. తాజా క్యూ4లో దేశీయ వృద్ధి 16 శాతంగా ఉందని, అమ్మకాలు 11 శాతం పెరిగాయని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. ఇబిటా మార్జిన్‌ 1.6 శాతం వృద్ధితో 22.5 శాతానికి పెరిగింది. పటిష్టమైన పొదుపు చర్యల కారణంగా ఈ స్థాయి ఇబిటా సాధించినట్లు ప్రకటించింది. ఈ ఫలితాల ఆధారంగా షేరు టార్గెట్‌ ధరను రూ.1,615గా ప్రకటించినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ వెల్లడించింది. 

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రూపొందించిన రీసెర్చ్‌ రిపోర్ట్‌ను కింద ఉన్న పీడీఎఫ్‌ అటాచ్‌మెంట్‌లో పరిశీలించగలరు.

View Pdf One (1526461840Hindustan_Unilever_-_4QFY18_-_HDFC_sec.pdf)

You may be interested

ఇండియా ఈక్విటీలపై అండర్‌వెయిట్‌!

Wednesday 16th May 2018

క్రెడిట్‌ సూసీ రేటింగ్‌ ఆసియా పసిఫిక్‌ మార్కెట్లలో భారత ఈక్విటీలపై అండర్‌వెయిట్‌గా ఉన్నట్లు అంతర్జాతీయ బ్రోకింగ్‌ దిగ్గజం క్రెడిట్‌ సూసీ వెల్లడించింది. భారత ఈక్విటీ మార్కెట్ల ప్రీమియం గరిష్ఠస్థాయిలకు చేరిందని అభిప్రాయపడింది. ఇటీవల కాలంలో ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌ లాంటి దేశాల ఈక్విటీ సూచీలు భారీగా నష్టపోయాయి. అయితే ఈ సమయంలో ఎంఎస్‌సీఐ ఇండియా సూచీ మాత్రం పెద్దగా పతనం కాలేదని క్రెడిట్‌ సూసీ తెలిపింది. ఇతర సూచీలు దాదాపు 19 శాతం

మార్కెట్‌ వాల్యుయేషన్స్‌ మరీ అధికం: కొటక్‌ ఎమ్‌ఎఫ్‌

Wednesday 16th May 2018

ముంబై: రికార్డు స్థాయి నుంచి స్టాక్‌ సూచీలు 10 శాతం పడిపోయిన తరువాత మళ్లీ బౌన్స్‌బ్యాక్‌ అయ్యి కాస్త ఆకర్షణీయంగా కనిపిస్తున్నప్పటికీ.. వాల్యుయేషన్స్‌ పరంగా చూస్తే మాత్రం ఏమంత ఆకర్షణీయంగా లేవని కొటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌, ఈక్విటీ సీఐఓ హర్ష ఉపాధ్యాయ అన్నారు. ఇప్పుడు ఉన్న వాల్యూయేషన్స్‌ ఇంతకుముందు ఎన్నడూ లేనంత అధికంగా ఉన్నాయన్న ఆయన చరిత్రలో ఎప్పుడూ చోటుచేసుకోనంతటి మల్టిపుల్స్‌ వద్ద మార్కెట్‌ ట్రేడవుతుందని విశ్లేషించారు. ఇటువంటి పరిస్థితి

Most from this category