STOCKS

News


గ్రాఫైట్‌ ఇండియా కొనొచ్చు- సెంట్రమ్‌

Tuesday 15th May 2018
Markets_main1526373819.png-16469

కంపెనీ: గ్రాఫైట్‌ ఇండియా లిమిటెడ్ (జీఐఎల్‌)
సిఫార్సు: సెంట్రమ్‌ బ్రోకింగ్‌ 
ప్రస్తుత ధర: రూ.752 (మే 15, 2018న)
టార్గెట్‌ ధర: రూ.825
రెకమండేషన్‌: కొనొచ్చు
52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ. 906 /102

గతేడాది చివరి త్రైమాసికం (2017–18, క్యూ4)లో కంపెనీ నూరు శాతం సామర్థ్య వినియోగం.. పూర్తి ఆర్థిక సంవత్సరానికి 85 శాతం వినియోగం ఆధారంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆర్థభాగంలో సైతం ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించవచ్చని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ అంచనావేస్తోంది. త్రైమాసికం ఆధారంగా ఎబిడిటా 29 శాతం వృద్ధి చెందగా.. ఎబిటిడా మార్జిన్లు 55.2 శాతం పెరిగినట్లు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ.17 డివిడెండ్‌గా ఇచ్చినట్లు తెలిపింది. ఇంతకుముందు రూ.750 వద్ద టార్గెట్‌ ధరను ప్రకటించిన ఈ సంస్థ తన టార్గెట్‌ను సవరించి రూ.825 వద్దకు పెంచినట్లు ప్రకటించింది. ఎలక్ట్రోడ్ పరిశ్రమ అప్‌ సైకిల్‌లోనే ఉన్నందున ఈ కంపెనీ షేరు ధర మరింత పెరగవచ్చని అంచనావేస్తున్నట్లు వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరాలలో కంపెనీ మార్జిన్లు మరింత మెరుగుపడేందుకు అవకాశం ఉందని భావిస్తోంది. 
 

సెంట్రమ్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ రూపొందించిన రీసెర్చ్‌ రిపోర్ట్‌ను కింద ఉన్న పీడీఎఫ్‌ అటాచ్‌మెంట్‌లో పరిశీలించగలరు.

View Pdf One (1526373844Graphite India - Q4FY18 Result Update - Centrum 14052018.pdf)

You may be interested

ఏడాది కాలానికి టాప్‌టెన్‌ రికమండేషన్లు

Tuesday 15th May 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ల సిఫార్సులు వచ్చే ఏడాది కాలంలో దాదాపు 44 శాతం వరకు రాబడినిచ్చే పది షేర్లను ప్రముఖ బ్రోకరేజ్‌లు సిఫార్సు చేస్తున్నాయి.  1. సన్‌ టీవీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1250. సీఎల్‌ఎస్‌ఏ సిఫార్సు. కంపెనీ ఇటీవలి త్రైమాసిక ఫలితాలు బాగున్నాయి. యాడ్‌ రెవెన్యూ బలమైన వృద్ధి సాధించింది. తమిళనాడులో డిజిటైజేషన్‌ కార్యక్రమం కంపెనీకి మరింత మంది సబ్‌స్క్రైబర్లు పెరిగేందుకు దోహదం చేసింది. వచ్చే మూడేళ్లలో ఎర్నింగ్స్‌ 17 శాతం చక్రీయ

ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్ కొనొచ్చు- సెంట్రమ్‌

Tuesday 15th May 2018

కంపెనీ: ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌ సిఫార్సు: సెంట్రమ్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ ప్రస్తుత ధర: రూ.400 (మే 15, 2018న) టార్గెట్‌ ధర: రూ.430 రెకమండేషన్‌: కొనొచ్చు 52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ. 434 /285 గతేడాది చివరి త్రైమాసికం (2017–18, క్యూ4)లో కంపెనీ ప్రకటించిన ఫలితాలు ఆకర్షణీయంగా ఉన్నాయని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ వివరించింది. అంతకుముందు త్రైమాసికంతో పోల్చితే షేరు ధర 34 శాతం పెరిగిందని.. రుణ మంజూరీ పెరగడం ఇందుకు ప్రధాన కారణమని వివరించింది.

Most from this category