News


కోల్‌ ఇండియా కొనొచ్చు- టార్గెట్‌ రూ.300

Saturday 26th August 2017
Markets_main1503908445.png-7563

కంపెనీ: కోల్‌ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్‌)
సిఫార్సు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
ప్రస్తుత ధర: రూ.241 (26 అగస్టు, 2017)
టార్గెట్‌ ధర: రూ.300
రెకమండేషన్‌: కొనొచ్చు
52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ. 339 /233
 
కోల్‌ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్‌) షేరుకు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ బై రేటింగ్‌ ఇచ్చింది. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసిక(2017-18, క్యూ1) ఆర్థిక ఫలితాల ఆధారంగా ఈ షేరును రెకమండ్‌ చేస్తున్నట్లు తెలియజేసింది. ఆక‌్షన్‌ ప్రీమియం తక్కువగా ఉండడం, కంపెనీ ఖర్చులు పెరగడం లాంటి ప్రతికూల అంశాల కారణంగా కోల్‌ ఇండియా క్యూ1 ఫలితాలు అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. వస్తు సేవల పన్ను అనుకూలంగా ఉన్న నేపథ్యంలో తగ్గనున్న పన్నుల భారం, సిమెంట్‌ కంపెనీల పనితీరు మెరుగుపడడం, ఈ-ఆక‌్షన్‌లో కోల్‌ ధర పెరగడం లాంటి సానుకూల అంశాలను బేరీజు వేసుకుని టార్గెట్‌ ధరను రూ.300గా నిర్ణయించినట్లు ప్రకటించింది. సిమెంట్‌ కంపెనీల అమ్మకాలు పెరుగుతున్న నేపథ్యంలో వీటికి ప్రధాన ముడిసరుకులలో బొగ్గు ఉండడం వల్ల కోల్‌ ఇండియాకు ఇది అనుకూల అంశమని భావిస్తోంది. ఈ-ఆక‌్షన్‌ కోల్‌ ధర టన్నుకు రూ.1,600 చేరుకుంది. ఇది ముడి బొగ్గు కంటే 25 శాతం అధికం. జూన్‌ క్వార్టర్‌లో కంపెనీ ఈ-ఆక‌్షన్‌ అమ్మకాలు 20 శాతం వృద్ధి చెందాయి. 2019 ఎబిటా ఆధారంగా కంపెనీ ఈవీ (ఎంటర్‌ప్రైస్‌ వాల్యూ) 5.9 శాతంగా ఉంది. 2010 అక్టోబరు నుంచి ఇప్పటి వరకు సగటున చూస్తే ఈవీ 7.5 శాతంగా ఉంది. వీటితోపాటు డివిడెండ్‌ ఈల్డ్‌ 6 శాతంగా ఉండడాన్ని బేరీజు వేసుకుని చూస్తే షేరుకు డౌన్‌సైడ్‌ రిస్క్‌ తక్కువుగా ఉందని అనలిస్టులు సైతం భావిస్తున్నారు. గడిచిన 2 త్రైమాసికాలుగా పేలవ పనితీరును కనబర్చిన ఈ కంపెనీ ఇక నుంచి టర్న్‌ అరౌండ్‌ అయ్యి అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ప్రధాన అంశం కారణంగా ఈ షేరును రెకమండ్‌ చేస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలియజేసింది.
 

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రూపొందించిన రీసెర్చ్‌ రిపోర్ట్‌ను కింద ఉన్న పీడీఎఫ్‌ అటాచ్‌మెంట్‌లో పరిశీలించగలరు. 

View Pdf One (1503726453Coal_India.pdf)





You may be interested

17 ఏళ్లలో 7,000 శాతం రాబడి ఇచ్చిన షేరు ఇది

Saturday 26th August 2017

ముంబై: ఏషియన్‌ పెయింట్స్‌ షేరు ధర దీర్ఘకాల ఇన్వెస్టర్ల పంటపండించింది. 17 ఏళ్లలో ఏకంగా 7,000 శాతం రిటర్న్స్‌ ఇచ్చిన షేరుగా నిలిచింది. అంటే, మీరు 2,000 సంవత్సరం జనవరి నెలలో రూ.10,000 ఈ షేరులో ఇన్వెస్ట్‌ చేసి ఉంటే.. ఇప్పుడు మీ సంపద రూ.7 లక్షలు ఉండేదన్న మాట. జనవరి 3, 2000 నాడు రూ.16.25 దగ్గర ఉన్న ఏషియన్‌ పెయింట్స్‌ ఇప్పుడు రూ.1,140 దగ్గర ట్రేడవుతోంది. ఆ

సద్భవ్ ఇంజినీరింగ్ కొనొచ్చు

Saturday 26th August 2017

కంపెనీ: సద్భవ్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (ఎస్‌ఈఎల్‌) సిఫార్సు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ప్రస్తుత ధర: రూ.267 (26 అగస్టు, 2017) టార్గెట్‌ ధర: రూ.360 రెకమండేషన్‌: కొనొచ్చు 52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ. 350 /237   సద్భవ్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (ఎస్‌ఈఎల్‌) షేరుకు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ బై రేటింగ్‌ ఇచ్చింది. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసిక(2017-18, క్యూ1) ఆర్థిక ఫలితాల ఆధారంగా ఈ షేరును రెకమండ్‌ చేస్తున్నట్లు తెలియజేసింది. రవాణా విభాగం నుంచి రెవెన్యూ

Most from this category