News


బజాజ్‌ కార్ప్‌కు బై రేటింగ్‌: టార్గెట్‌ ధర రూ.475

Saturday 15th July 2017
Markets_main1500104726.png-5448

కంపెనీ: బజాజ్‌ కార్ప్‌ లిమిటెడ్‌
సిఫార్సు: జేఎం ఫైనాన్షియల్‌
ప్రస్తుత ధర: రూ.406 (15 జులై, 2017)
టార్గెట్‌ ధర: రూ.475 (12 నెలల్లో)
రెకమండేషన్‌: కొనొచ్చు
52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ.436/325

ఎఫ్‌ఎంసీజీ విభాగంలోని బజాజ్‌ కార్ప్‌ లిమిటెడ్‌ షేరుకు జేఎం ఫైనాన్షియల్‌ బై రేటింగ్‌ ఇచ్చింది. ఇంతకుముందు రూ.485 టార్గెట్‌ ధరతో ఇచ్చిన బై రేటింగ్‌కు సవరణ చేసి, తాజాగా రూ.475 ధరతో అప్‌డేటెడ్‌ టార్గెట్‌ ధరతో బై రేటింగ్‌ ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2017–18, క్యూ1)లో ఆదాయం రూ.197 కోట్లు ఉండగా, నికర లాభం రూ.55 కోట్లుగా కంపెనీ ప్రకటించింది. ఇదే సమయంలో అమ్మకాలు 3.6 శాతం తగ్గినట్లు తెలియజేసిన  జేఎం ఫైనాన్షియల్‌.. జీఎస్‌టీ అమలు నేపథ్యంలో డీస్టాకింగ్‌ కారణంగా ఆల్‌మాండ్‌ డ్రాప్స్‌ అమ్మకాలు 6.6 శాతం తగ్గాయని ఈ కారణంగా అమ్మకాలు తగ్గినప్పటికీ, రిటైల్‌ వృద్ధి రేటు బాగున్న అంశాన్ని బేరీజు వేసుకుని  ఈ షేరును రెకమండ్‌ చేస్తున్నట్లు వెల్లడించింది.


జేఎం ఫైనాన్షియల్‌ రూపొందించిన రీసెర్చ్‌ రిపోర్ట్‌ను కింద ఉన్న పీడీఎఫ్‌ అటాచ్‌మెంట్‌లో పరిశీలించగలరు.

View Pdf One (1500104857Bajaj Corp - JM Financial.pdf)





You may be interested

ఈనెల 24నుంచి ఎఫ్‌అండ్‌ఒలో గ్లోబల్‌ స్టాక్స్‌

Saturday 15th July 2017

కొత్తగా 15 అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల షేర్లను ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ విభాగంలో పొందుపరుస్తున్నట్లు నేషనల్‌ స్టాక్‌ ఎక్చేంజ్‌ తెలిపింది. గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌ సహా 15 బడాకంపెనీల షేర్లలో  ఈ నెల 24 నుంచి ఫ్యూచర్స్‌, ఆప్షన్స్‌ కొనడం, అమ్మడం చేయవచ్చని తెలిపింది.  దీంతో పాటు కరెన్సీ విభాగంలో జపనీస్‌ యన్‌- యుఎస్‌ డాలర్‌, స్విట్జర్లాండ్‌ ఫ్రాంక్‌- యుఎస్‌డాలర్‌, ఆస్టే‍్రలియన్‌డాలర్‌- యుఎస్‌ డాలర్‌

మార్కెట్లో మేజర్‌ కరెక‌్షన్‌?!

Saturday 15th July 2017

జెఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అంచనా దేశీయ సూచీలు లైఫ్‌టైమ్‌ హై స్థాయిల్లో కదలాడుతున్న వేళ, అతిత్వరలో ఒక భారీ కరెక‌్షన్‌ తప్పకపోవచ్చని జెఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ హెచ్చరిస్తోంది. ఈ విషయమై కంపెనీ నివేదిక మీకోసం... నిఫ్టీ ఎట్టకేలకు 9,700 పాయింట్ల స్థాయిని దాటడంతో బుల్స్‌కు మరింత పట్టు పెరిగినట్లయింది. దేశీయ సూచీల్లోకి తాజా పెట్టుబడులు పెరిగాయి. ఇప్పటివరకు కొంచెం దూరంగా ఉన్న ఇన్వెస్టర్లు తాజా ర్యాలీలో చేరినట్లు తెలుస్తోంది. మార్కెట్‌ జోరును, మూలాలను

Most from this category