STOCKS

News


ఇన్ఫీ గైడెన్స్‌పై బ్రోకరేజ్‌ల పెదవి విరుపు

Saturday 14th April 2018
Markets_main1523699600.png-15519

తాజాగా ఫలితాలు ప్రకటించిన ఇన్ఫోసిస్‌ గైడెన్స్‌పై దిగ్గజ బ్రోకరేజ్‌ సంస్థలు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నాయి. ఫలితాలు అంతంతమాత్రంగా ఉన్నాయని, గైడెన్స్‌ నిరాశా జనకంగా ఉందని అభిప్రాయపడుతున్నాయి. 
ఇన్ఫీ ఫలితాలపై బ్రోకరేజ్‌ సంస్థల స్పందన ఇలా ఉంది...
- మోర్గాన్‌స్టాన్లీ: ఇన్ఫీ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. 2018-19 మార్జిన్‌ గైడెన్స్‌ నిరాశకు గురిచేసింది. తాజా అవుట్‌లుక్‌తో షేరు వెనుకంజ వేయవచ్చు. రెవెన్యూ గైడెన్స్‌ సైతం అంచనాలకన్నా తక్కువగా ఉంది. ఈ ప్రభావం మూలధన వ్యయ ప్రణాళికపై ఉండొచ్చు.
- మాక్కైరీ: పెట్టుబడులు పెరగడం సమీప భవిష్యత్‌లో రెవెన్యూ వృద్ధికి దారితీస్తుంది. ముఖ్యంగా డిజిటల్‌ విభాగంలో మేలుచేస్తుంది. కొత్త డీల్స్‌ గెలుచుకునేందుకు వీలుకలిగిస్తుంది. ఎబిటా మార్జిన్స్‌ 23.5 శాతం ఉండొచ్చు. బీమా, టెలికం, యుటిలిటి విభాగాలు రెవెన్యూ వృద్ధికి దోహదం చేస్తాయని అంచనా.
- నోమురా: ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నా మార్జిన్లు నిరాశపూరితంగా ఉన్నాయి. అయితే స్టాక్‌ ధర పడిపోకుండా షేర్‌ హోల్డర్లకు నగదును పంచే ఆలోచన ఆదుకోవచ్చు. బడా మార్కెట్లు, బీఎఫ్‌ఎస్‌ఐ రంగాల్లో వృద్ధి బలహీనపడడం నెగిటివ్‌ అంశం. 
- జేపీ మోర్గాన్‌: ఎబిటా మార్జిన్‌ గైడెన్స్‌ నిరుత్సాహపరిచింది. ఆదాయం అంచనాలకు తగ్గట్లే ఉంది. కొత్త ఆదాయార్జనసాధనాలను ఆవిష్కరించాల్సిన అవసరాన్ని ఫలితాలు ఎత్తి చూపుతున్నాయి. 
- ఫిలిప్‌కేపిటల్‌: మార్జిన్‌గైడెన్స్‌ పేలవంగా ఉండడం ఫలితాల మూడ్‌ను చెడగొట్టింది. పనయా, స్కావా సంస్థలను వదిలించుకునే నిర్ణయం అనూహ్యం. కరెన్సీ ఒడిదుడుకులు ఈ దఫా గైడెన్స్‌ను చేరుకునేందుకు సహకరించవచ్చు.
- యాంటిక్‌: రెవెన్యూ వృద్ధి కారణంగా మార్జిన్‌ గైడెన్స్‌ తగ్గింది. దీంతో ఈపీఎస్‌లో 2 శాతం వరకు క్షీణత ఉండొచ్చు. వ్యాపారం పుంజుకుంటున్నందున వాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉన్నాయనే భావించవచ్చు. You may be interested

ఐటీ, ఫార్మా షేర్లకు దూరం: షేర్‌ఖాన్‌

Saturday 14th April 2018

ముంబై: రిటైల్‌ ఫోకస్‌ ఎక్కువగా ఉన్న ప్రైవేటు బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)లు బలమైన వృద్ధిరేటును కనబర్చనున్నట్లు తాను భావిస్తున్నానని షేర్‌ఖాన్‌ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హేమాంగ్ జానీ అన్నారు. వీటి వృద్ధి 20-30 శాతం మధ్యలో ఉండేందుకు అవకాశం ఉందని విశ్లేషించారు. క్రెడిట్‌ గ్రోత్‌, మార్కెట్‌ వాటా అంశాలను బేరీజువేసుకుని ఈ అంచనాను వెల్లడించినట్లు తెలియజేశారు. ఇదే సమయంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ విభాగం మరింతగా

5:1 నిష్పత్తిలో షేర్ల విభజన

Saturday 14th April 2018

ప్రకటించిన యూనిటెడ్‌ స్పిరిట్‌ ముంబై:- లిక్కర్‌ దిగ్గజం యునైటెడ్‌ స్పిరిట్స్‌ షేర్లను 1:5 నిష్పత్తిలో విభజించనుంది. శుక్రవారం సమావేశమైన కంపెనీ బోర్డు ఈ షేర్ల విభజన ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. రూ.10లు ముఖ విలువ కలిగిన షేరు ఇక నుంచి రూ.2 ముఖవిలువతో లభించనున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లకు చౌకగా షేర్లను అందించడం, షేర్ల ట్రేడింగ్‌ వాల్యూమ్స్‌ పెంచడంతో పాటు మార్కెట్లలో నిధుల ప్రవాహాన్ని పెంపొందించడానికి  షేర్లను విభజిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు

Most from this category