STOCKS

News


మార్కెట్‌లోకి మరో మొబైల్‌ బ్రాండ్‌.. ‘ఐవో’

Tuesday 17th April 2018
auto-mobiles_main1523982596.png-15585

న్యూఢిల్లీ: బ్రిట్జో కమ్యూనికేషన్స్‌ తాజాగా తన ఫోన్‌ బ్రాండ్‌ ‘ఐవో’ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని కింద పలు ఉత్పత్తులను తీసుకువచ్చింది. బీట్జ్‌, ప్రైమో, సెల్ఫీ, టఫ్‌, వీవోఎల్‌టీ సిరీస్‌లలో 8 స్మార్ట్‌ 2జీ ఫీచర్‌ ఫోన్లను విడుదల చేసింది. అలాగే తన తొలి 4జీ ఫీచర్‌ ఫోన్‌ ‘స్కిపర్‌’ను కూడా ఆవిష్కరించింది. స్టోర్మ్‌ సిరీస్‌లో మరో రెండు ఆండ్రాయిడ్‌ గో 4జీ స్మార్ట్‌ఫోన్లను తీసుకువచ్చింది. ఈ ప్రొడక్టుల ధర రూ.649-రూ.5,999 శ్రేణిలో ఉంది. మొబైల్‌ ఫోన్‌, టీవీ విభాగాల నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.1,500 కోట్ల ఆదాయన్ని అంచనా వేస్తున్నామని బ్రిట్జో సీఈవో, సహ వ్యవస్థాపకుడు ప్రదిప్తో గంగూలీ తెలిపారు. 



You may be interested

వేదాంత చేతికి ఎలక్ట్రోస్టీల్‌..

Tuesday 17th April 2018

న్యూఢిల్లీ: భారీ రుణాలు పేరుకుపోయిన ఎలక్ట్రోస్టీల్‌ సంస్థ.. వేదాంత రిసోర్సెస్ చేతికి చేరడం ఇక లాంఛనమే కానుంది. ఎలక్ట్రోస్టీల్‌ బిడ్డింగ్‌కు సంబంధించి వేదాంత సమర్పించిన పరిష్కార ప్రణాళికకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్లు బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. ఇక కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నుంచి కూడా మరో 2-3 వారాల్లో రావొచ్చని అంచనా. వేదాంత పది రోజుల క్రితం సీసీఐ అనుమతుల

తెలంగాణలో ఏవో స్మిత్‌ వాటర్‌ప్యూరిఫయర్లు

Tuesday 17th April 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాటర్‌ ప్యూరిఫయర్ల తయారీ కంపెనీ ఏవో స్మిత్‌ ఇండియా.. తెలంగాణలో గ్రీన్‌ ఆర్‌వో వాటర్‌ ప్యూరిఫయర్లను ప్రవేశపెట్టింది. సిల్వర్‌ చార్జ్‌డ్‌ మెంబ్రేన్‌ టెక్నాలజీతో నీరు ఎనిమిది దశల్లో శుద్ధి చేస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ఈ వాటర్‌ ప్యూరిఫయర్‌లో అంతర్గతంగా మినరలైజేషన్‌ సాంకేతికత ఇమిడి ఉన్నందున ప్రకృతిసిద్దమైన కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలను తిరిగి నీటికి చేరుస్తుందని పేర్కొంది. దేశంలో వాటర్‌ ప్యూరిఫయర్ల

Most from this category