STOCKS

News


త్వరలో భారత్‌ డైనమిక్స్‌ ఐపీఓ

Friday 23rd February 2018
Markets_main1519324700.png-14132

  • వరుసలో ఐఆర్‌ఈడీఏ కూడా
  • ఈ రెండు కంపెనీల ఐపీఓలకు సెబీ ఆమోదం 

న్యూఢిల్లీ:  ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ డైనమిక్స్‌ త్వరలో ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు రానున్నది. ఈ కంపెనీతో పాటు మరో ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్‌ఈడీఏ(ఇండియన్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ) కూడా ఐపీఓకు రానున్నది. ఈ రెండు కంపెనీల ఐపీఓలకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఇటీవలనే ఆమోదం తెలిపింది. 

భారత్‌ డైనమిక్స్‌ ఐపీఓ @ రూ.1,000 కోట్లు 
1970లో ప్రారంభమైన భారత్‌ డైనమిక్స్‌ కంపెనీ క్షిపణులను , ఇతర రక్షణ సాధనాలను తయారు చేస్తోంది. ఐపీఓలో భాగంగా 13 శాతం వాటాకు సమానమైన 2.2 కోట్ల షేర్లను జారీ చేయనున్నది.  ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.1,000 కోట్లు సమీకరించే అవకాశాలున్నాయి. గత ఏడాది మార్చి నాటికి కంపెనీ నెట్‌వర్త్‌ రూ.2,212 కోట్లుగా ఉంది. ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌, ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ అండ్‌ సెక్యూరిటీస్‌, యెస్‌  సెక్యూరిటీస్‌ సంస్థలు ఈ ఐపీఓకు లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి. 
ఐఆర్‌ఈడీఏ సమీకరణ... రూ.900 కోట్లు 
ఇక ఐఆర్‌ఈడీఏ ఐపీఓలో భాగంగా 15 శాతం వాటాకు సమానమైన 13.90 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది. అర్హులైన ఉద్యోగులకు 6.95 లక్షల ఈక్విటీ షేర్లను రిజర్వ్‌ చేశారు. ఇష్యూ సైజ్‌ రూ.850-900 కోట్ల రేంజ్‌లో ఉండొచ్చన్న అంచనాలున్నాయి. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను భవిష్యత్తు మూలధన అవసరాలకు, సాధారణ వ్యాపార కార్యకలాపాలకు వినియోగించాలని ఈ కంపెనీ యోచిస్తోంది. లిస్టింగ్‌ తర్వాత ప్రస్తుతం రూ.784 కోట్లుగా ఉన్న ఈ కంపెనీ చెల్లించిన మూల ధనం రూ.923 కోట్లకు పెరుగుతుంది. ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థగా ఈ కంపెనీ 1987 మార్చి నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ ఐపీఓకు యస్‌  సెక్యూరిటీస్‌(ఇండియా), ఎలార క్యాపిటల్‌(ఇండియా), ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ అండ్‌ సెక్యరిటీస్‌, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌లు లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తాయి. 



You may be interested

జీడీపీలో 15 శాతానికి కుబేరుల సంపద

Friday 23rd February 2018

 మరింత పేదరికంలోకి బడుగువర్గాలు  భారత్‌లో మూడు దశాబ్దాల్లో పెరిగిన అసమానతలు  ఆక్స్‌ఫామ్ ఇండియా నివేదిక న్యూఢిల్లీ: ప్రభుత్వాల అసమగ్ర విధానాలతో భారత్‌లో గడిచిన మూడు దశాబ్దాల్లో అసమానతలు భారీగా పెరిగిపోయాయి. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) కేవలం కొద్ది మంది కుబేరుల వాటా పెరుగుతుండగా.. పేదల వాటా అంతకంతకూ తగ్గిపోతోంది. ఆక్స్‌ఫామ్ ఇండియా విడుదల చేసిన ఓ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం అయిదేళ్ల క్రితం జీడీపీలో పది శాతానికి పరిమితమైన కుబేరుల

ప్రభుత్వరంగ బ్యాంకులపై అంచనాలకు కోత

Friday 23rd February 2018

షేర్ల ధరల లక్ష్యాలూ తగ్గింపు గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ నిర్ణయం న్యూఢిల్లీ: గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ గ్రూపు భారత్‌కు చెందిన మూడు ప్రభుత్వరంగ బ్యాంకుల ఆదాయ అంచనాలను తగ్గించింది. ఆయా బ్యాంకుల షేర్ల ధరల అంచనాలకూ కోతేసింది. ప్రభుత్వరంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో భారీ స్కామ్‌ వెలుగు చూసిన నేపథ్యంలో ఈ మేరకు సవరణలు చేసింది. ఎస్‌బీఐ ఒక శాతం మేర, బ్యాంకు ఆఫ్‌ బరోడా 12 శాతం మేర, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు 30

Most from this category