STOCKS

News


స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌తో జాగ్రత్త!

Tuesday 5th February 2019
personal-finance_main1549390399.png-24031

త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల ప్రభావం మార్కెట్లపై ఎక్కువే ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో... స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌, ప్రభుత్వం వల్ల సులభంగా ప్రభావానికి లోనయ్యే వాటి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని మాథ్యూస్‌ ఇండియా ఫండ్‌ కో మేనేజర్‌ పీయూష్‌ మిట్టల్‌ సూచించారు. శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఈ ఫండ్‌ నడుస్తోంది. 

 

‘‘భారత మార్కెట్లో ప్రస్తుతం ఆకర్షణీయంగా ఉన్నవి లార్జ్‌క్యాప్‌ స్టాక్సే. వీటి వ్యాల్యూషన్లు చారిత్రక సగటు స్థాయిల్లోనే ఉన్నాయి. భవిష్యత్తు వృద్ధిని ఇవి చేరుకోగలన్న అంచనాలు ఉన్నాయి’’అని పీయూష్‌ మిట్టల్‌ తెలిపారు. మాథ్యూస్‌ ఇండియా ఫండ్‌ మధ్య స్థాయి, చిన్న స్థాయి మార్కెట్‌ క్యాప్‌ కంపెనీల్లో తన పెట్టుబడులను గత డిసెంబర్‌ నాటికి 62.6 శాతానికి తగ్గించుకుంది. 2016 డిసెంబర్‌ నాటికి ఇది 73.5 శాతంగా ఉండడం గమనార్హం. ఈ పథకం గత ఐదేళ్ల కాలంలో సగటున వార్షికంగా 15 శాతం రాబడులను ఇచ్చింది. కానీ, ఇదే కాలంలో ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ 100 సూచీ ఇచ్చిన రాబడులు 12 శాతంగానే ఉన్నాయి. ఎక్కువగా నియంత్రణలు, ప్రభుత్వ జోక్యంతో కూడిన రిస్క్‌ ఉన్న రంగాలకు దూరంగా ఉంది. 

 

స్థిరమైన ప్రభుత్వం
స్థిరమైన ప్రభుత్వం అవసరం ఉందని మిట్టల్‌ పేర్కొన్నారు. ‘‘ప్రభుత్వం ఎన్నో చిన్న పార్టీల మద్దతుపై ఆధారపడితే అస్థిరత నెలకొంటుంది. ఇది వ్యాపార సంస్థల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. దీంతో వృద్ధి, ఆవిష్కరణల కోసం చేసే భవిష్యత్తు పెట్టుబడులపై ప్రభావం పడుతుంది’’అని పీయూష్‌ మిట్టల్‌ తెలిపారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మళ్లీ ఏర్పాటు కావడంపై ఇన్వెస్టర్లలో సందేహాలు నెలకొన్న విషయం తెలిసిందే. గతంతో పోలిస్తే ఎన్‌డీయేకు మెజారిటీ తగ్గుతుందని కొన్ని సర్వేలు పేర్కొన్నాయి. రియల్‌ ఎస్టేట్‌, బంగారం పనితీరులో వెనుకబడ్డాయని, ఆర్థిక సాధనాల వైపు పెట్టుబడులు మళ్లడంలో పెద్ద మార్పు ఉన్నట్టు మిట్టల్‌ చెప్పారు. గత రెండు మూడేళ్ల కాలంలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో స్థిరమైన పెట్టుబడుల రాకను ఇందుకు నిదర్శంగా పేర్కొన్నారు. స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ ఇదే తీరులో ప్రతికూల పనితీరును కనబరిస్తే, ఈక్విటీలోకి పెట్టుబడులు కాస్తా, ఉపసంహరణలుగా మళ్లుతాయని, దీంతో స్టాక్‌ ధరల్లో వేగవంతమైన పతనం ఉంటుందని మిట్టల్‌ అంచనా వేశారు. 



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 61 పాయింట్లు అప్‌

Wednesday 6th February 2019

క్రితం రోజు యూరప్‌, అమెరికా సూచీలు ర్యాలీ సాగించడం, తాజాగా జపాన్‌ సూచీ పెరిగిన నేపథ్యంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 61 పాయింట్లు పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ మంగళవారం ఉదయం 8.45  గంటలకు 11,012  పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 10,951 పాయింట్ల వద్ద ముగిసింది. గత వారం  ఫెడ్‌ నిర్ణయం వెలువడిన తర్వాత క్రమేపీ ప్రపంచ మార్కెట్లు పెరుగుతున్న

ఎఫ్‌ఐఐలు వాటాలు పెంచుకున్న కౌంటర్లు...

Tuesday 5th February 2019

విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు స్టాక్‌ ధరల్ని గణనీయంగా ప్రభావితం చేస్తాయనడంతో సందేహం లేదు. గత డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసిక కాలంలో ఎఫ్‌ఐఐలు సుమారు 387 కంపెనీల్లో వాటాలను పెంచుకున్నారు. అదే సమయంలో సుమారు 568 కంపెనీల్లో వాటాలు కొంత మేర విక్రయించారు. 384 కంపెనీల్లో వీరి వాటాల్లో ఎటువంటి మార్పుల్లేవని గణాంకాలు తెలియజేస్తున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు డిసెంబర్‌ నెలలో నికరంగా రూ.17,000 కోట్ల అమ్మకాలు చేయగా, జనవరిలోనూ రూ.5,000 కోట్లకుపైగా

Most from this category