News


ఉచిత క్రెడిట్‌ రిపోర్ట్‌ల విషయంలో కాస్త జాగ్రత్త!

Tuesday 15th May 2018
personal-finance_main1526387675.png-16476

మీ క్రెడిట్‌ స్కోరు ఎంతో ఉచితంగా తెలుసుకోవచ్చు... అనే తరహా ప్రకటనలు చూసి ఆకర్షితులవువుతున్నారా? ఒక్క నిమిషం. ఉచిత రిపోర్టింగ్‌ కోసం మీ వ్యక్తిగత వివరాలన్నీ ఎవరికి పడితే వారికి ఇచ్చేసే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలి. క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరోల నుంచి ఏడాదికోసారి ఉచితంగా రిపోర్ట్‌ పొందడానికి అవకాశం ఉందన్న విషయం తెలిసిందే. ఏటా సీఐసీ- ట్రాన్స్‌యూనియన్‌, సిబిల్‌, ఈక్విఫాక్స్‌, ఎక్స్‌పీరియన్‌, హైమార్క్‌ సంస్థల నుంచి ఒక్కొక్కటి చొప్పున క్రెడిట్‌ రిపోర్ట్‌ను ఉచితంగా తీసుకోవచ్చు. థర్డ్‌పార్టీ ఫిన్‌టెక్‌ పోర్టళ్లు అయిన పైసాబజార్‌, బ్యాంకు బజార్‌, క్రెడిట్‌మంత్రి సంస్థలు ఏడాదిలో ఒకటికి మించి కూడా ఉచిత రిపోర్ట్‌లు పొందే అవకాశం కల్పిస్తున్నాయి.   

థర్డ్‌పార్టీ ప్రయోజనాలు

‘‘కొన్ని ఫైనాన్షియల్‌ సంస్థలు కస్టమర్లకు వారి క్రెడిట్‌ అర్హతపై అవగాహన కల్పించి, దాన్ని పెంచుకునే దిశగా మార్గదర్శనం చేస్తుంటాయి. కొన్ని సంస్థలు క్రెడిట్‌ స్కోరు ఆధారంగా మంచి క్రెడిట్‌కార్డు, రుణ ఆఫర్లను అందించడం చేస్తుంటాయి’’ అని ఈక్విఫాక్స్‌ బిజినెస్‌ హెడ్‌ మనుసెహ్‌గల్‌ తెలిపారు. ఈ సేవలను క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరోలు అందించవు. మరో విషయం థర్డ్‌పార్టీ పోర్టళ్లు ఎన్ని సార్లు అయినా క్రెడిట్‌ రిపోర్ట్‌ యాసెస్‌ చేసుకునే సదుపాయం కల్పిస్తాయి. దీంతో ఒకవేళ స్కోరు తక్కువగా ఉంటే, దిద్దుబాటు చర్యలు తీసుకుని పెంచుకునేందుకు వీలు కలుగుతుంది. ‘‘రికార్డుల్లో చిన్న వ్యత్యాసం ఉన్నా, ఈఎంఐ కట్టడంలో ఒక్కరోజు డిఫాల్ట్‌ అయినా అది క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం చూపుతుంది. అదే క్రెడిట్‌ రిపోర్టును సులభంగా పొందే అవకాశం ఉంటే వెంటనే చూసుకుని తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవచ్చు’’ అని బ్యాంకు బజార్‌ చీఫ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ నవీన్‌చందాని తెలిపారు. 

జాగ్రత్తలు అవసరం

క్రెడిట్‌ రిపోర్ట్‌ కోసం ముందుగా మీ వివరాలు ఇవ్వడం తప్పనిసరి. క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరోలు రిపోర్ట్‌ ఇచ్చే ముందు ఆయా వ్యక్తుల క్రెడిట్‌ హిస్టరీ వివరాలను థర్డ్‌ పార్టీకి ఇచ్చేందుకు అనుమతి తీసుకుంటున్నాయి. అయితే, తాము కస్టమర్లు అంగీకరిస్తేనే వారి క్రెడిట్‌ సమాచారాన్ని థర్డ్‌ పార్టీలకు ఇస్తున్నట్టు ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ సీవోవో హర్షలా చందోర్కర్‌ తెలిపారు. థర్డ్‌ పార్టీ పోర్టళ్లకు మీ వివరాలన్నీ తెలియజేయడం తప్పనిసరి. మరి ఒకసారి ఈ వివరాలను పంచుకున్న తర్వాత ఆయా థర్డ్‌ పార్టీల నుంచి సమాచారం లీక్‌ అయితే క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ సంస్థల బాధ్యత ఉండదు. ఆయా థర్డ్‌ పార్టీ సంస్తలు క్రెడిట్‌హిస్టరీ సమాచారాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అందుకే ఈ తరహా ఉచిత సేవలు పొందే ముందు టర్మ్స్‌, కండీషన్స్‌ను జాగ్రత్తగా చదవాలని సూచిస్తున్నారు. ఉచితంగా క్రెడిట్‌ రిపోర్ట్‌ అందించే థర్డ్‌పార్టీ సంస్థలు అందుకు తాము ఏ క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ సంస్థతో టైఅప్‌ అయిందీ తెలియజేయాలని, అన్‌సబ్‌స్క్రయిబ్‌తోపాటు కస్టమర్లు వారి వివరాలను డిలీట్‌ చేసుకునే అవకాశం ఇవ్వాలని పైసా బజార్‌ చీఫ్‌ ప్రొడక్ట్స్‌ ఆఫీసర్‌ రాధికా బినాని సూచించారు. You may be interested

92 శాతం తగ్గిన కర్ణాటక బ్యాంక్‌ లాభం

Tuesday 15th May 2018

 మూడు రెట్లు పెరిగిన ‘మొండి’ కేటాయింపులు   ఒక్కో షేర్‌కు రూ.3 డివిడెండ్‌ న్యూఢిల్లీ: కర్ణాటక బ్యాంక్‌ నికర లాభం నాలుగో క్వార్టర్‌లో 92 శాతం క్షీణించింది. 2016-17లో ఇదే కాలంలో రూ.138 కోట్లుగా ఉన్న నికర లాభం తాజా క్యూ4లో రూ.11 కోట్లకు తగ్గిందని బ్యాంక్‌ తెలిపింది. మొండి బకాయిల కేటాయింపులు భారీగా... దాదాపు మూడు రెట్లు పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని తెలియజేసింది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.160

డెరివేటివ్‌ ట్రేడింగ్‌ వేళలు పెంపు రిటైల్‌ ఇన్వెస్టర్లకు చేదే

Tuesday 15th May 2018

డెరివేటివ్‌ ట్రేడింగ్‌ వేళల్ని రాత్రి 11.55 గంటల వరకూ పొడిగిస్తూ సెబీ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం డెరివేటివ్‌ ట్రేడింగ్‌ వేళలు మధ్యాహ్నం 3.30తో ముగిసిపోతున్నాయి. కానీ, ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి కొత్త వేళలు అమల్లోకి వస్తాయి. అయితే, ఈ వేళలకు కచ్చితంగా మారిపోవాలనేమీ లేదు. స్టాక్‌ ఎక్సేంజ్‌లు తమకు ఇష్టమైతే అర్ధరాత్రి వరకు వేళలను పెంచుకోవచ్చు. ఇది స్టాక్‌ ఎక్సేంజ్‌లకు శుభవార్త కాగా, రిటైల్‌ ఇన్వెస్టర్లకు మంచిది

Most from this category