STOCKS

News


ఈ ఏడాది టాప్‌ గెయినర్‌ ఐపీఓ అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్‌

Saturday 30th December 2017
Markets_main1514631352.png-12660

మూడు నెలల్లోనే 400శాతం లాభాలు
ముంబై:- 2017లో పబ్లిక్‌ ఇష్యూలు అదరగొట్టాయి. ఈ ఏడాదిలో  మొత్తం 153 కంపెనీలు రూ.70 వేల కోట్లు సమీకరించాయి. ఐపీఓకు వచ్చిన ఈ కంపెనీల్లో అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్‌ కంపెనీ ఐపీఓ ఈ ఏడాది(2017) ఈ ఏడాది టాప్‌ గెయినర్‌ ఐపీఓగా నిలిచింది. మన రాష్ట్రానికే చెందిన ఈ రొయ్యల కంపెనీ షేరు ఇన్వెస్టర్లకు బారెడు లాభాలు పంచుతోంది. ఈ అపెక్స్‌ ఫుడ్స్‌ ఐపీఓ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం....
అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్‌ కంపెనీ వివరాలు:-
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆక్వా క‌ల్చర్ సంస్థ అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్‌ కంపెనీ కాకినాడ ప్రదాన కేంద్రంగా పనిచేస్తుంది. సీఫుడ్స్ పదార్థాల వ్యాపారాన్ని నిర్వహించే ఈ సంస్థ బే ఫ్రెష్‌, బే హార్వెస్ట్‌ తదితర బ్రాండ్లతో తెల్ల రొయ్యలను అమెరికా, యూరప్‌, బ్రిటన్‌ దేశాలకు ఎగుమతి చేస్తోంది. షెల్ప్‌ లైఫ్‌ను దృష్టిలో ఉంచుకొని క్వాలిటీ ఉత్పత్తులను తయారు చేస్తూ ఎగుమతుల మార్కెట్లో పట్టు సాధించింది. అమెరికా, యూకె, యూర్‌ప్‌లోని పలు సంస్థలు అపెక్స్‌ ఫ్రోజెన్‌ కస్టమర్లుగా ఉన్నాయి.
ఐపీఓ వివరాలు:-
అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ ఐపీఓ ఆగస్టు 22న ప్రారంభమైంది. ఒక్కో షేరు ధరను రూ.171-175గా నిర్ణయించారు. ఆగస్టు 24న ముగిసిన ఈ ఇష్యూ ద్వారా మొత్తం రూ.152 కోట్లను సమీకరించింది. ఐపీఓలో భాగంగా మొత్తం 62,10,000 షేర్లను కేటాయించగా, 1,76,07,680 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్‌ విభాగంలో 29,05,00 షేర్లు కేటాయించగా 87,90,640 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు 3.03 రెట్లు అధికంగా దరఖాస్తులు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో కొత్త యూనిట్‌కు ఏర్పాటు, ఇతర వ్యాపార కార్యకలాపాలకు నిమిత్తం ఐపీఓకు వచ్చినట్లు కంపెనీ అధికారులు ప్రకటించారు.
లిస్టింగ్‌ అదుర్స్‌:-
అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్‌ సంస్థ షేర్లు సెప్టెంబర్‌ 4న స్టాక్‌ ఎక్జ్సేంజ్‌లో లిస్ట్‌ అయ్యాయి. ఇష్యూ ధర రూ.175లు కాగా బీఎస్‌ఇలో 14.22 శాతం లాభంతో 199.90 రూపాయల వద్ద లిస్టింగ్‌ అయింది. లిస్టింగ్‌ రోజునే 19.19 శాతం లాభంతో రూ. 209.85ల వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి రికార్డు సృష్టించింది.
మూడు నెలల్లోనే 400 శాతం లాభాలు:-
లిస్టింగ్‌తోనే ఇన్వెస్టర్లకు లాభాలను పంచిన ఈ షేరు ఈ మూడు నెలల్లో అప్రతిహతంగా దూసుకుపోయింది. తాజాగా డిసెంబరు 5న షేరు ధర రూ.941ల వద్ద సరికొత్త ఏడాది గరిష్ట స్థాయిని నమోదు చేసింది. అంటే సుమారు 3 నెలల కాలంలోనే షేరు ధర ఆఫర్‌ ధరతో పోలిస్తే దాదాపు 431 శాతం లాభాలను ఇన్వెస్టర్లకు పంచింది. డిసెంబర్‌ 29 శుక్రవారం నాటి ముగింపు ధర రూ. 838.85ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే వృద్ధి 380శాతంగా ఉంది. తద్వారా 2017లో ఐపీఓల్లో అత్యధికంగా లాభాలు పంచిన ఐపీఓగా రికార్డుకెక్కింది.You may be interested

గ్యాస్‌ రంగానికి చెందిన ఈ షేర్లు కొనొచ్చు..!

Saturday 30th December 2017

ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ టార్గెట్‌ ధర రూ.421 ప్రస్తుత ధర రూ.329 (28, డిసెంబర్‌ 2017) మహానగర్ గ్యాస్ లిమిటెడ్ టార్గెట్‌ ధర రూ.1,211 ప్రస్తుత ధర రూ.1097 (28, డిసెంబర్‌ 2017) పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ టార్గెట్‌ ధర రూ.304 ప్రస్తుత ధర రూ.251 (28, డిసెంబర్‌ 2017) హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రూపొందించిన  రీసెర్చ్‌ రిపోర్ట్‌ కోసం ఈ దిగువన లింక్‌పై క్లిక్‌ చేయండి.  

బీమా కంపెనీల టార్గెట్‌ ధరలు ఇచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ

Saturday 30th December 2017

డీమానిటైజేషన్‌ తరువాత బీమా రంగంలోనికి పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. జీడీపీలో బీమా రంగ వాటా 2.7 శాతానికి వృద్ధి చెందింది. నూతన ప్రీమియంలు 2015-17 కాలంలో 24.4 శాతం చక్రగతి వృద్ధి రేటును సాధించాయి. ఈ రంగంపై రీసెర్చ్‌ రిపోర్ట్‌ను రూపొందించిన హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. వచ్చే 5 ఏళ్లలో 20 శాతం చక్రగతి వృద్ధి రేటును సాధించే అవకాశం ఉందని అంచనావేస్తోంది. ఈ అంచనా ఆధారంగా బీమా రంగానికి చెందిన

Most from this category