STOCKS

News


బేర్‌ పట్టు బిగుస్తోంది!

Tuesday 20th March 2018
Markets_main1521539337.png-14820

నెగిటివ్‌ జోన్‌లోకి జారుతున్న భారత మార్కెట్లు
కీలక మద్దతు స్థాయి కింద ట్రేడవుతున్న పలు షేర్లు
దేశీయ ఈక్విటీలపై బేర్స్‌ పట్టు గట్టిగా బిగుస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా వారు ఒక కీలకాంశాన్ని చూపుతున్నారు. నిఫ్టీ 50లోని సింహభాగం షేర్లు వాటి 200 రోజుల డీఎంఏ స్థాయిలకన్నా దిగువన ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 50 కంపెనీల్లో 64 శాతం కంపెనీలు ఈ విధంగా కీలక మద్దతు స్థాయిలకు దిగువన ఉన్నాయి. ఈ తరహా ధోరణి బేరిష్‌నెస్‌కు నిదర్శనంగా నిపుణులు చెబుతున్నారు. నిఫ్టీ సైతం తన 200 రోజుల డీఎంఏ స్థాయి మద్దతును సోమవారం కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ కీలక మద్దతుగా నిలిచిన 10160 పాయింట్ల స్థాయికి కింద నిఫ్టీ క్లోజయింది. దీంతో ఇకపై ఈ స్థాయి నిఫ్టీకి నిరోధంగా మారింది. ప్రస్తుతం చాలా తక్కువ షేర్లు తమ తమ ప్రధాన మద్దతు స్థాయిలకు పైన ట్రేడవుతున్నాయని మోతీలాల్‌ఓస్వాల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చందన్‌ తపారియా చెప్పారు. బేర్స్‌ పైచేయి సాధిస్తున్నారనేందుకు ఇది నిదర్శనమన్నారు. ప్రస్తుతం నిఫ్టీ కీలక మానసిక అవధి 10,000 పాయింట్ల దిశగా కదలుతోందని, ఇక్కడ మద్దతు లభించకుంటే బేర్స్‌ మరింత చెలరేగుతారని అభిప్రాయపడ్డారు. 



You may be interested

37,000 పాయింట్లకు సెన్సెక్స్‌: డాయిష్‌ బ్యాంక్‌

Tuesday 20th March 2018

ముంబై: ఈ ఏడాది చివరినాటికి సెన్సెక్స్‌ ప్రస్తుత స్థాయి నుంచి 12 శాతం పెరిగేందుకు అవకాశం ఉందని డాయిష్‌ బ్యాంక్‌ ఇండియా హెడ్‌ రీసెర్చ్‌ అభయ్ లీజవాలా అన్నారు. ప్రస్తుతం 32,967 వద్ద ఉన్న సెన్సెక్స్‌.. డిసెంబరు నాటికి 37,000 స్థాయికి చేరుకుంటుందని ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విశ్లేషించారు. మెరుగైన ఫండమెంటల్స్‌ కారణంగా మార్కెట్‌ అధికంగా పెరగడం, అంతర్జాతీయ అంశాలకు అనుగుణంగా దేశీయ మార్కెట్‌ కదలాడిన కారణంగా ప్రస్తుతం

ఈ స్టాకుల్లో కరెక‌్షన్‌ సిగ్నల్స్‌!!!

Tuesday 20th March 2018

సోమవారం ముగింపు చార్టుల్లో దాదాపు వందకు పైగా షేర్లు పతనానికి రెడీగా ఉన్న సంకేతాలు చూపాయి. ఇలా కరెక‌్షన్‌కు తయారుగా ఉన్న స్టాకుల్లో ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐఓసీ, ఐటీసీ, టాటా మోటర్స్‌, పీవీఆర్‌, ఇన్ఫీ, ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌, భారత్‌ గేర్స్‌, వాడిలాల్‌, మహానగర్‌ గ్యాస్‌ లాంటి దిగ్గజాలున్నాయి. వీటితోపాటు హెచ్‌పీసీఎల్‌, ఈఐఎల్‌, గేట్‌వేడిస్ట్రిపార్క్స్‌, భారతి ఇన్‌ఫ్రాటెల్‌, ఐబీఆర్‌ఎల్‌, వీగార్డ్‌, ఎస్‌జేవీఎన్‌, ఉజ్జీవన్‌, బీఎఫ్‌ యుటిలిటీస్‌ షేర్లలో సైతం నెగిటివ్‌

Most from this category