STOCKS

News


బ్యాంకుల నెత్తిన ‘గీతాంజలి’ బండ

Monday 16th April 2018
Markets_main1523860440.png-15531

  • క్యూ4లో ఎన్‌పీఏలు రూ.8,000 కోట్లు పెరిగే అవకాశం 

న్యూఢిల్లీ: కుంభకోణంలో చిక్కుకున్న గీతాంజలి జెమ్స్‌ గ్రూపునకు ఇచ్చిన రుణాలు మొండి బకాయిలుగా మారిపోవడంతో మార్చి త్రైమాసికంలో బ్యాంకుల ఎన్‌పీఏలు రూ.8,000 కోట్ల మేర పెరిగిపోనున్నాయి. గీతాంజలి జెమ్స్‌ గ్రూపునకు ఇచ్చిన వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలు రూ.8,000 కోట్లకు సంబంధించి గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఎటువంటి చెల్లింపులు జరగలేదు. దీంతో ఈ మొండి బకాయిలకు నిధులు కేటాయించాల్సి ఉంటుందని బ్యాంకింగ్‌ వర్గాలు తెలిపాయి. గత త్రైమాసికంలో ఎన్‌పీఏలుగా మారిన ఖాతాల్లో గీతాంజలి అతిపెద్దది కావడం గమనార్హం. డిసెంబర్‌ త్రైమాసికం నాటికి దేశీయ బ్యాంకుల ఎన్‌పీఏలు రూ.8,40,958 కోట్లుగా ఉన్నాయి.

పీఎన్‌బీని రూ.13,000 కోట్ల మేర మోసగించిన వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీకి గీతాంజలి జెమ్స్‌ గ్రూపు ప్రమోటర్‌ మెహుల్‌చోక్సీ దగ్గరి బంధువు కావడం గమనార్హం. ముంబైలోని సీబీఐ కోర్టు మోదీ, చోక్సీలకు వ్యతిరేకంగా నాన్‌బెయిలబుల్‌ వారంట్లు కూడా జారీ చేసింది. అలహాబాద్‌ బ్యాంకు సారథ్యంలోని 21 బ్యాంకుల కన్సార్షియం గీతాంజలి జెమ్స్‌ గ్రూపునకు వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాన్ని తొలుత 2010–11లో మంజూరు చేసింది. రూ.900 కోట్లతో ఐసీఐసీఐ బ్యాంకు ఈ రుణంలో అధిక వాటా కలిగి ఉంది. 2015లో గీతాంజలికి ఇచ్చిన రుణాలను పునరుద్ధరించగా, 2017 డిసెంబర్‌ క్వార్టర్‌ వరకు ఈ రుణాలకు సంబంధించి వడ్డీ చెల్లింపులు జరిగాయి. కానీ, ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో ఆర్‌బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా బ్యాంకులు గీతాంజలి జెమ్స్‌ గ్రూపు రుణాలను ఎన్‌పీఏలుగా ప్రకటించి నిధులు కేటాయించాల్సి ఉంటుంది.



You may be interested

బ్యాలెన్స్‌ షీట్స్‌ సరికావడానికి మరో 9 నెలలు: అసోచామ్‌

Monday 16th April 2018

న్యూఢిల్లీ: బ్యాంకులకు భారీ మొండి బకాయిలు అదే సమయంలో కార్పొరేట్లకు అధిక రుణ భారం... ఈ రెండు రకాల సమస్యలు (ట్విన్‌ బ్యాలన్స్‌ షీట్‌) పరిష్కారం అయ్యేందుకు కనీసం మరో మూడు త్రైమాసికాల సమయం పట్టొచ్చని అసోచామ్‌ పేర్కొంది. ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబీసీ) కింద రానున్న నెలల్లో కంపెనీల దివాలా పరిష్కార చర్యలు వేగం అందుకుంటాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. బ్యాంకుల విశ్వాసం పుంజుకుని మళ్లీ తాజాగా

నాబార్డ్‌ అధీకృత మూలధనం రూ.30వేల కోట్లకు

Monday 16th April 2018

న్యూఢిల్లీ: రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయాలన్న లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నాబార్డ్‌ అధీకృత మూలధనాన్ని రూ,.30,000 కోట్లకు పెంచింది. దీంతో గ్రామీణాభివృద్ధి, సాగుకు మరిన్ని రుణాలు అందించడం ద్వారా తన కార్యకలాపాలు పెంచుకునేందుకు నాబార్డ్‌కు వీలు పడనుంది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన జాతీయ బ్యాంకు (నాబార్డ్‌) అధీకృత మూలధనాన్ని రూ.5,000 కోట్ల నుంచి రూ.30,000 కోట్లకు పెంచినట్టు ప్రభుత్వం తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇందుకు సంబంధించిన

Most from this category