News


సుగర్‌, బ్యాంకు స్టాకుల హుషారు..

Wednesday 13th September 2017
Markets_main1505292941.png-8503

దేశీయ సూచీలు బుధవారం కూడా పాజిటివ్‌గా కొనసాగుతున్నాయి. ఆర్‌ఐఎల్‌, హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్‌ అండతో సూచీలు పటిష్ఠంగా ట్రేడవుతున్నాయి. మధ్యాహ్న సమయానికి సెన్సెక్స్‌ 144 పాయింట్ల లాభంతో నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ కీలకమైన 32 వేల పాయింట్లపైన, నిఫ్టీ పదివేలవంద పాయింట్ల పైన కదలాడుతున్నాయి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు సుమారు అరశాతం లాభపడ్డాయి. బుధవారం ట్రేడింగ్‌లో బ్యాంకు షేర్ల జోరు పెరిగింది. ప్రైవేట్‌బ్యాంకుల్లో యస్‌బ్యాంక్‌ మినహా మిగిలినవి లాభాల్లో ఉన్నాయి. పీఎస్‌బీలు సుమారు 3 శాతం వరకు లాభపడ్డాయి. మరోవైపు చక్కెర కంపెనీల షేర్లు తీపెక్కాయి. బజాజ్‌ హిందుస్థాన్‌, ధామ్‌పుర్‌ సుగర్‌ మిల్స్‌, శక్తి సుగర్స్‌, బలరామ్‌పూర్‌ చిని మిల్స్‌, త్రివేణి ఇంజనీరింగ్‌, శ్రీరేణుకా సుగర్స్‌, ద్వారికేశ్‌ సుగర్‌ షేరు సుమారు 2 శాతం లాభాల్లో ఉన్నాయి. ఇక సూచీల్లో హెవీవెయిట్‌ దిగ్గజం ఆర్‌ఐఎల్‌ సుమారు 4 శాతం పైగా ర్యాలీ జరపడం సూచీలకు కలిసివచ్చింది. 







You may be interested

10,500 పాయింట్లకు నిఫ్టీ!

Wednesday 13th September 2017

అరిహంత్‌ కాపిటల్‌ అంచనా దేశీయ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి నిధుల ప్రవాహం పెరగడంతో దేశీయ మార్కెట్లు జోరుమీదున్నాయి. ప్రస్తుతానికి సూచీల వాల్యూషన్స్‌ గరిష్ఠాల వద్ద ఉన్నాయని చెప్పవచ్చు. కానీ వాల్యూషన్స్‌ ఎక్కువగా ఉండడాన్ని ఇన్వెస్టర్లు పెద్దగా పట్టించుకోవడంలేదు. ఈ సంవత్సరం ఎర్నింగ్స్‌ వృద్ధి కన్నా ప్రైస్‌ ఎర్నింగ్‌ మల్టిపుల్స్‌ విస్తరణకే ఎక్కువ అవకాశాలున్నాయి. సిమెంట్‌, కన్జూమర్‌ గూడ్స్‌, ఆటో, ఎన్‌బిఎఫ్‌సీ రంగాల్లో ఈ మార్పు చూడవచ్చు. తాజా రికవరీకి సంస్కరణలు, మెరుగుపడుతున్న

అప్పర్‌ సర్క్యూట్‌ను తాకిన రిలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌

Wednesday 13th September 2017

ముంబై: గత నాలుగు సెషన్లో‍ 10శాతానికి పైగా లాభపడుతున్న రిలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ షేరు బుధవారం ట్రేడింగ్‌లో 5శాతం లాభపడి అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రిలిగేర్‌ లిమిటెడ్‌ సంస్థ తన హెల్త్ ఇన్సూరెన్సు విభాగాన్ని విక్రయించనుండటం షేరు అప్పర్‌ సర్క్యూట్‌ను తాకడానికి దోహదపడింది. ఈ విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని యాక్సిస్‌ బ్యాంక్‌లో సంస్థకున్న రూ.450 కోట్ల మొండిబకాయిలను తీర్చనుంది. హెల్త్ ఇన్సూరెన్సు విక్రయానికి ప్రమోటర్లు, బోర్డు సభ్యుల నుంచి

Most from this category