STOCKS

News


బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నష్టాలు రూ.2,341 కోట్లు

Monday 12th February 2018
news_main1518458784.png-13908

  • రెట్టింపునకు మించిన కేటాయింపులు 
  • తగ్గన నికర వడ్డీ ఆదాయం 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.2,341 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. మొండి బకాయిలకు కేటాయింపులు  రెట్టింపునకు పైగా మించడంతో పాటు, నికర వడ్డీ, ఇతర, నిర్వహణ ఆదాయాలు తగ్గడంతో ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.102 కోట్ల నికర లాభం సాధించామని పేర్కొంది. గత క్యూ3లో రూ.11,594 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 10,376 కోట్లకు తగ్గిందని తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.2,546 కోట్ల నుంచి రూ.4,373 కోట్లకు పెరిగాయని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం 18 శాతం తగ్గి రూ.2,501 కోట్లకు, ఇతర ఆదాయం 70 శాతం క్షీణించి రూ.1,041 కోట్లకు, నిర్వహణ లాభం 82 శాతం క్షీణించి రూ.1,354 కోట్లకు తగ్గాయని తెలిపింది.

పెరిగిన మొండి బకాయిలు 
స్థూల మొండి బకాయిలు 13.38 శాతం నుంచి 16.93 శాతానికి, నికర మొండి బకాయిలు 7.09 శాతం నుంచి 10.29 శాతానికి ఎగిశాయని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. సీక్వెన్షియల్‌గా చూస్తే, స్థూల మొండి బకాయిలు 30 శాతం వృద్ధితో రూ.64,249 కోట్లకు, నికర మొండి బకాయిలు 53 శాతం వృద్ధితో రూ.36,117 కోట్లకు పెరిగాయని వివరించింది. గత ఆర్థిక సంవత్సరానికి అవకతవకలు(డైవర్జెన్స్‌-ఆర్‌బీఐ మదింపు, బ్యాంక్‌ వెల్లడించిన వాటికి మధ్య గల తేడా) స్థూల మొండి బకాయిల్లో  రూ.14,000 కోట్లు, నికర మొండి బకాయిల్లో రూ.9,707 కోట్లు,  కేటాయింపుల్లో రూ.4,350 కోట్ల మేర ఉన్నాయని వివరించింది. ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో 56.96 శాతంగా ఉందని తెలిపింది. 

ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్‌ 1.6 శాతం లాభంతో రూ.145 వద్ద ముగిసింది. 



You may be interested

జనవరిలో ప్యాసింజర్‌ స్పీడ్‌..

Monday 12th February 2018

విక్రయాల్లో 7.57 శాతం వృద్ధి కార్ల అమ్మకాలు 1.25 శాతం డౌన్‌ 85,850 యూనిట్లకు యుటిలిటీ వాహన విక్రయాలు సియామ్‌ గణాంకాల వెల్లడి గ్రేటర్‌ నోయిడా: దేశీ ప్యాసింజర్‌ వాహన (పీవీ) విక్రయాల్లో వార్షిక ప్రాతిపదికన జనవరి నెలలో 7.57 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇవి 2,65,389 యూనిట్ల నుంచి 2,85,477 యూనిట్లకు పెరిగాయి. దీనికి యుటిలిటీ వాహనాల బలమైన డిమాండ్‌ ప్రధాన కారణం. అయితే కార్ల విక్రయాల్లో 1.25 శాతం క్షీణత కనిపించింది. ఇవి

ఇండియన్‌ బ్యాంక్‌  మొండి బకాయిలు తగ్గాయ్‌...

Monday 12th February 2018

30 శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం మెరుగుపడిన రుణ నాణ్యత ఇప్పటివరకే ఇవే ఉత్తమ బ్యాంక్‌ ఫలితాలు బ్యాంక్‌ సీఈఓ కిశోర్‌ కారత్‌ వెల్లడి  చెన్నై: ప్రభుత్వ రంగ ఇండియన్‌ బ్యాంక్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 19 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.373 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.303 కోట్లకు తగ్గిందని ఇండియన్‌ బ్యాంక్‌ తెలిపింది. పెట్టుబడులపై మార్క్‌ టు మార్కెట్‌

Most from this category