STOCKS

News


బజాజ్‌ అలియంజ్‌ లాభం రూ.921 కోట్లు

Friday 18th May 2018
news_main1526661978.png-16607

ముంబై: బజాజ్‌ అలియంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.921 కోట్ల నికర లాభం సాధించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో రూ.728 కోట్ల నికర లాభం వచ్చిందని, 27 శాతం వృద్ధి సాధించామని బజాజ్‌ అలియంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ తెలిపింది. అండర్‌రైటింగ్‌ లాభం రూ.64 కోట్ల నుంచి 359 శాతం వృద్ధి చెంది రూ.293 కోట్లకు పెరిగిందని  బజాజ్‌ అలియంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఎమ్‌డీ, సీఈఓ తపన్‌ సింఘాల్‌ చెప్పారు.  గ్రాస్‌ రిటెన్‌ ప్రీమియమ్‌(జీడబ్ల్యూపీ) రూ.7,687 కోట్ల నుంచి 23 శాతం వృద్ధితో రూ.9,487  కోట్లకు ఎగసిందని వివరించారు. కంబైన్డ్‌ రేషియో  96.8 శాతం నుంచి 92.3 శాతానికి మెరుగుపడిందని తెలిపారు. వినియోగదారులకు ఉన్నత స్థాయి సేవలందించడం, మంచి లాభాలు సాధించడం ద్వారా పటిష్టమైన వృద్ధిని సాధించడాన్ని కొనసాగించడంపైననే దృష్టి సారిస్తామని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో 1.3 కోట్ల పాలసీలను సర్వీస్‌ చేశామని, 11 లక్షల క్లెయిమ్‌లను పరిష్కరించామని పేర్కొన్నారు. సాల్వెన్సీ రేషియో కనీసం 150 శాతం ఉండాలని నిబంధనలున్నాయని, తమ సాల్వెన్సీ రేషియో 276 శాతమని పేర్కొన్నారు. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అలియంజ్‌ ఎస్‌ఈల జాయింట్‌ వెంచర్‌గా ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 


 



You may be interested

శ్రీలంకకు వచ్చే తెలుగు పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది

Friday 18th May 2018

 శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ ఏపీ, తెలంగాణ మేనేజర్‌ చమ్మిక ఇద్దగోడగే సాక్షి, అమరావతి: ప్రతీ ఏటా శ్రీలంకకు వచ్చే తెలుగు పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతోందని శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ ఏపీ, తెలంగాణ మేనేజర్‌ చమ్మిక ఇద్దగోడగే తెలిపారు. గతేడాది జులైలో హైదారాబాద్‌, విశాఖపట్నంల నుంచి కొలంబోకు ప్రారంభించిన డైరెక్ట్‌ విమానాలతో ప్రయాణీకుల సంఖ్య గణణీయంగా పెరిగిందని చెప్పారు. శుక్రవారం విజయవాడలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. 2016-17లో శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ ద్వారా ​‍7,000 మంది

మళ్లీ రూపాయి 68 దిగువకు...

Friday 18th May 2018

 ఒకేరోజు 30 పైసలు డౌన్‌ ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ శుక్రవారం మళ్లీ కిందకు జారింది. వివరాల్లోకి వెళితే,  ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో మంగళవారం రూపాయి విలువ 16 నెలల కనిష్టస్థాయి 68.15 స్థాయికి చేరింది. అయితే బుధ, గురు వారాల్లో తిరిగి కొంత బలపడుతూ 67.70 స్థాయికి చేరింది. కాగా శుక్రవారం అనూహ్యంగా తిరిగి 30 పైసలు కనిష్టానికి పడింది. 68 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్‌లకు డిమాండ్‌,

Most from this category