News


ఎన్‌పీఏలపై ఆర్‌బీఐకి వారం గడువు

Tuesday 18th July 2017
news_main1500320823.png-5532

  • నిపుణుల నివేదికపై స్పందన తెలియజేయాలన్న సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: మొండి బకాయిల (ఎన్‌పీఏ) సమస్య పరిష్కారానికి చర్యల్ని సూచిస్తూ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై వారం రోజుల్లోగా స్పందన తెలియజేయాలని ఆర్‌బీఐని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. బ్యాంకింగ్‌ రంగంలో ఎన్‌పీఏలు రూ.8 లక్షల కోట్లకు చేరడంతో వీటి పరిష్కారంపై చర్యల్ని సూచించేందుకు గాను ఆర్‌బీఐ ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ‍కమిటీ 12 బడా రుణ ఎగవేత కేసుల్లో చర్యలు సూచిస్తూ ఇటీవల ఆర్‌బీఐకి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై సెంటర్‌ ఫర్‌ పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ లిటిగేషన్‌ (సీపీఐఎల్‌) అనే స్వచ్చంద సంస్థ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. సీపీఐఎల్‌ తరఫున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషన్‌ ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. బ్యాంకులకు రూ.500 కోట్లకు పైబడి రుణ బకాయిలు పడిన అందరి పేర్లను బయటపెట్టాలంటూ ఆర్‌బీఐని ఆదేశించాలని కోరారు. దీన్ని ఆర్‌బీఐ తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. పేర్లను వెల్లడించాల్సిన బాధ్యత ఆర్‌బీఐపై లేదని స్పష్టం చేశారు. దీంతో నిపుణుల కమిటీ ఇటీవల ఇచ్చిన నివేదికపై స్పందన తెలియజేసేందుకు ఈ నెల 24 వరకు ఆర్‌బీఐకి గడువిస్తూ చీఫ్‌ జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. నిజానికి సీపీఐఎల్‌ ఈ విషయంలో 2003లోనే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రూ.500 కోట్ల పైబడి రుణ ఎగవేతదారుల జాబితాను వెల్లడించాలని సుప్రీంకోర్టు లోగడే ఆర్‌బీఐని కోరింది. ఆ తర్వాత పేర్లను వెల్లడించకపోయినా రుణ బకాయిలు ఎంతున్నాయన్నది బయటపెడితే చాలని వెసులుబాటు ఇచ్చింది. అయినప్పటికీ ఇది గోప్యత అధికారాల కిందకు వస్తుందంటూ ఆర్‌బీఐ దాన్ని వ్యతిరేకిస్తోంది. 







You may be interested

సత్యం వ్యవహారం... పీడబ్య్లూసీపై త్వరలో సెబీ ఉత్తర్వులు!

Tuesday 18th July 2017

న్యూఢిల్లీ: దాదాపు దశాబ్దం క్రితం నాటి సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ఆడిటింగ్ అవకతవకలకు సంబంధించి ప్రైస్‌ వాటర్‌హౌస్‌ కూపర్స్‌పై (పీడ్ల్యూసీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. తుది ఉత్తర్వులు సిద్ధమవుతున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2000 నుంచి 2008 దాకా పీడబ్ల్యూసీ.. సత్యం కంప్యూటర్స్‌కి ఆడిటింగ్ సేవలు అందించింది. సత్యం కంప్యూటర్స్ అనేక సంవత్సరాల పాటు తమ ఖాతాల్లో అవకతవకలకు పాల్పడిన కుంభకోణం 2009

'దివాలా చట్టం'పై ఎస్సార్ స్టీల్‌కు చుక్కెదురు

Tuesday 18th July 2017

 చర్యలు నిలిపివేయాలన్న అభ్యర్ధనకు కోర్టు  నో అహ్మదాబాద్: దివాలా చట్టం కింద చర్యలు నిలిపివేయాలంటూ గుజారాత్ హైకోర్టును ఆశ్రయించిన ఉక్కు తయారీ సంస్థ ఎస్సార్‌ స్టీల్‌కు చుక్కెదురైంది. కంపెనీ అభ్యర్ధనను న్యాయస్థానం కొట్టేసింది. ఎస్సార్ స్టీల్ రుణభారం రూ.42,000 కోట్ల పైచిలుకు ఉంటుంది. ఇలా మొండిబాకీల భారం పెరిగిపోయిన 12 కంపెనీలపై ఆర్‌బీఐ సూచనల మేరకు బ్యాంకులు దివాలా చట్టం కింద చర్యలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, ఆర్‌బీఐ ఆదేశాలను

Most from this category