STOCKS

News


శిఖా శర్మ వారసత్వ ఎంపిక పక్రియలోయాక్సిస్‌

Friday 20th April 2018
news_main1524245230.png-15727

ముంబై: మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ శిఖా శర్మ స్థానంలో కొత్త సారధి ఎంపిక ప్రక్రియను ప్రైవేటు రంగ బ్యాంక్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రారంభించింది. స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు బ్యాంక్‌ ఒక ఫైలింగ్‌ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది.  డిసెంబర్‌లో శిఖా శర్మ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ బాధ్యతల నుంచి వైదొలుగుతున్న సంగతి తెలిసిందే.  నిజానికి జూన్‌ 1 నుంచీ శిఖాశర్మ పదవీకాలన్ని మరో మూడేళ్లు పొడిగిస్తూ, బ్యాంక్‌ బోర్డ్‌ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి పొడిగింపు ఇది నాల్గవ విడత కావడం గమనార్హం. అయితే, మొండిబాకీలు భారీగా పేరుకుపోతున్న పరిస్థితుల్లో నాలుగో విడత కూడా శిఖా శర్మనే సీఈవోగా కొనసాగించడాన్ని ఆర్‌బీఐ ప్రశ్నించింది. దీనితో ఈ ఏడాది ఆఖరు నాటికి వైదొలిగేందుకు అనుమతించాలంటూ శిఖా శర్మ విజ్ఞప్తి చేశారు. దీనికి బోర్డ్‌ ఆమోదముద్ర వేసింది. 



You may be interested

ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ లాభం రూ.1,030 కోట్లు

Friday 20th April 2018

23 శాతం వృద్ధి ముంబై: ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.1,030 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం(రూ.840 కోట్లు)తో పోల్చితే 23 శాతం వృద్ధి సాధించామని ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తెలిపింది. రుణ వృద్ధి మెరుగుపడడం, నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండడం, ఫీజు ఆదాయం పెరగడం వల్ల లాభం ఈ

ఇన్‌వాయిస్‌లపై రుణాలు!

Friday 20th April 2018

 ఎస్‌ఎంఈలకు కలిసొస్తున్న ఇన్‌డిఫై సేవలు  తనఖా లేకుండానే రూ.50 లక్షల వరకూ లోన్స్‌  కస్టమర్లుగా హోటల్స్, ట్రావెల్, కిరాణా, ఈ-కామర్స్‌ సంస్థలు  వడ్డీ నెలకు 1.5–2 శాతం; ఇప్పటివరకు రూ.300 కోట్ల రుణాలు  ‘స్టార్టప్‌ డైరీ’తో ఇన్‌డిఫై కో–ఫౌండర్‌ సిద్దార్థ్‌ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎస్‌ఎంఈ) ఎదుర్కొనే ప్రధాన సమస్య ‘నిధులు’. ఇవి చాలవన్నట్లు ప్రభుత్వ,  ప్రైవేట్‌ సంస్థలు ఎస్‌ఎంఈలకు అందించే ఇన్‌వాయిస్‌ బిల్లులు సమయానికి క్లియర్‌ కాక మరింత ఇబ్బందులు

Most from this category