STOCKS

News


ఈ టైమ్‌లో షార్ట్స్‌ వద్దు!

Thursday 22nd March 2018
Markets_main1521700279.png-14869

ఐసీఐసీఐ డైరెక్ట్‌ సూచన
ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులతోనే ట్రేడవుతున్న నేపథ్యంలో షార్ట్‌ పొజిషన్లకు దూరంగా ఉండడం మంచిదని ఐసీఐసీఐ డైరెక్ట్‌ సూచిస్తోంది. గత రెండుమూడు సెషన్లుగా నిఫ్టీ 10వేల పాయింట్ల నుంచి పుల్‌బ్యా్‌క్‌కు యత్నిస్తోందని, పలు ఇండికేటర్లు ఓవర్‌ సోల్డ్‌ ఏరియాలో ఉన్నాయని తెలిపింది. ఇప్పటికైతే నిఫ్టీ 10వేల పాయింట్ల స్థాయి వద్ద కొంతకాలం కన్సాలిడేట్‌ కావచ్చని తెలిపింది. పరిస్థితులు అనుకూలిస్తే ఇప్పుడున్న స్థాయి నుంచి 10450 పాయింట్ల వరకు పుల్‌బ్యాక్‌ కావచ్చని అంచనా వేసింది. ఇలాంటి సంధికాలంలో భారీగా షార్ట్‌లు తీసుకోవడం మంచిది కాదని సూచించింది. పదివేల పాయింట్ల వద్ద వాల్యూ బయింగ్‌కు ఛాన్సులెక్కువని తెలిపింది.
పదివేల పాయింట్లే కీలకం
2010 నుంచి నాలుగు సందర్భాల్లో భారీ కరెక‌్షన్స్‌ వచ్చిన 7- 9 వారాల అనంతరం దాదాపు అదే స్థాయిలో పుల్‌బ్యాక్స్‌ వచ్చాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుంటే తాజా కరెక‌్షన్‌ ఆరంభమైన 7 వారాలకు నిఫ్టీ కీలక మద్దతు 10వేల పాయింట్లకు చేరుకుంది. పాత సైకిల్‌ పునరావృతం అయితే ఈ స్థాయి నుంచి మరలా నిఫ్టీ పరుగు ఉండవచ్చు. గతేడాది జరిపిన భారీ ర్యాలీకి(7900- 11000 పాయింట్లు)కు 9900-10000 పాయింట‍్ల స్థాయి 38.2 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయి. అలాగే గుజరాత్‌ ఎన్నికల ఫలితాల వేళ అనూహ్య పతనానికి సైతం 10075పాయింట్ల వద్ద ముగింపు కనిపించింది. దీర్ఘకాలిక 52 వారాల డీఎంఏ స్థాయి సైతం 9950 వద్ద ఉంది. పైస్థాయిలో 10450 వద్ద కీలక నిరోధం ఉంది. 



You may be interested

స్టార్టప్‌లను కొంటాం

Thursday 22nd March 2018

- వచ్చే ఏడాది కాలంలో మూడు నుంచి ఐదు - భారత్‌లో విస్తరణ కొనసాగుతుంది - వాల్‌మార్ట్‌ సీటీఓ జెరెమీ కింగ్‌ వెల్లడి - ఫ్లిప్‌కార్ట్‌తో డీల్‌పై మాత్రం దాటవేత న్యూఢిల్లీ: భారత మార్కెట్లో తాము ఇక ముందూ దూకుడుగా వెళతామని వాల్‌మార్ట్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ జెరెమీ కింగ్‌ చెప్పారు. తమ విస్తరణ కార్యకలాపాలు కొనసాగుతాయన్నారు. భారత్‌లో అతిపెద్ద టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేసిన వాల్‌మార్ట్‌... అమెజాన్‌కు పోటీగా దేశీయంగా అగ్రస్థానంలో ఉన్న ఈ

బ్యాంకులను ముంచేసిన మరో నగల సంస్థ!!

Thursday 22nd March 2018

- రూ.825 కోట్ల మేర మోసం చేసిన కనిష్క్‌ గోల్డ్‌.. - ఎస్‌బీఐ సహా 14 బ్యాంకులకు కుచ్చుటోపీ... - రుణ ఎగవేతపై సీబీఐకి ఫిర్యాదు చేసిన స్టేట్‌బ్యాంక్‌ చెన్నై: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ)ను నిండా ముంచేసిన నీరవ్‌ మోదీ కుంభకోణం ఘటన మరువకముందే... ఇలాంటివే మరిన్ని స్కామ్‌లు పుట్టగొడుగుల్లా వెలుగుచూస్తున్నాయి. తాజాగా చెన్నైకి చెందిన కనిష్క్‌ గోల్డ్‌ పైవేట్‌ లిమిటెడ్‌ అనే బంగారు నగల విక్రయ సంస్థ బ్యాంకులకు వందల కోట్ల రూపాయల

Most from this category