STOCKS

News


మన పెట్టుబడులతో వీటికి ధన వర్షం

Friday 8th June 2018
personal-finance_main1528460975.png-17210

ఎవరు అవునన్నా, కాదన్నా మన దేశ మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ గతంతో పోలిస్తే విస్తరించింది. మరింత మంది ఇన్వెస్టర్లకు చేరువ అయింది. ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేవారు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నారు. కాబట్టే మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.23 లక్షల కోట్లకు చేరింది. ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఈక్విటీ, డెట్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేసి వచ్చిన రాబడుల్లోంచి చార్జీల రూపంలో అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు ఆదాయాన్ని ఆర్జిస్తుంటాయి. అంటే మన పెట్టుబడులు వీటికి లాభాల గనులు. దేశ మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ వృద్ధి ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఇతర సాధనాలైన రియల్టీ, బంగారం కంటే ఫండ్స్‌ వైపు మళ్లేవారు పెరుగుతున్నారు. కనుక అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తే లాభాలు ఖాయమనే అంటున్నారు విశ్లేషకులు. ఆ వివరాలే మీకోసం... 

గడిచిన ఐదేళ్ల కాలంలో ఎడెల్వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఆదాయం వార్షికంగా 31 శాతం, ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌ ఆదాయం 7.48 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ఈ కంపెనీల నికర లాభం 39.48 శాతం, 17.44 శాతం చొప్పున పెరిగింది. మరి గత ఐదేళ్ల కాలంలో ఎడెల్వీజ్‌, ఐఐఎఫ్‌ఎల్‌ షేర్లు 400 శాతం వరకూ ర్యాలీ చేశాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో ఫండ్స్‌లోకి వచ్చిన పెట్టుబడులు రూ.1.4 లక్షల కోట్లు. మార్చి నాటికి రూ.21.36 లక్షల కోట్లుగా ఉన్న మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణ ఆస్తులు, ఏప్రిల్‌ చివరికి రూ.23.25 లక్షల కోట్లకు పెరిగాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ యాంఫి గణాంకాల ప్రకారం 42 సంస్థలు మ్యూచువల్‌ ఫండ్స్‌గా సేవలు అందిస్తున్నాయి. సిప్‌ ద్వారా నెల నెలా ఫండ్స్‌లోకి వస్తున్న పెట్టుబడులు రూ.7,000 కోట్లుగా ఉండడం గమనార్హం. ఏప్రిల్‌లో రూ.6,699 కోట్లు ఇలా సిప్‌ ద్వారా వచ్చాయి. ప్రస్తుత ట్రెండ్‌ కొనసాగుతుందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ క్రెడిట్‌ సూసే తెలిపింది. ‘‘ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌లోనూ బలమైన వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నాం. పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల విలువ వార్షికంగా 18 శాతం చొప్పున వృద్ధి చెందుతుంది’’ అని క్రెడిట్‌సూసే అంచనా వేసింది.

వృద్ధికి భారీ అవకాశాలు

‘‘మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమలో అవకాశాల పట్ల ఉత్సాహంగా ఉన్నాం. ఈక్విటీ, డెట్‌ విభాంలో వృద్ధికి భారీ అవకాశాలు ఉన్నాయని విశ్వసిస్తున్నాం. అయితే మా ఫోకస్‌ ఈక్విటీపైనే ఉంటుంది’’ అని రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ ఏఎంసీ ఈడీ, సీఈవో సుదీప్‌సిక్కా తెలిపారు. ఏఎంసీ కంపెనీలు భారీగా లబ్ధి పొందే దశకు ముందున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆల్టర్నేటివ్‌ అసెట్స్‌ ఫండ్స్‌తో ఎడెల్వీజ్‌, ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌ ఎక్కువగా లబ్ధి పొందడానికి అవకాశం ఉందని క్రెడిట్‌ సూసే అంచనా. ఈ సంస్థ ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ లిమిటెడ్‌కు అవుట్‌ పెర్‌ఫార్మ్‌ (మెరుగైన రాబడులకు అవకాశం) రేటింగ్‌ ఇచ్చింది. ఈ స్టాక్‌కు రూ.175 టార్గెట్‌ ఇచ్చింది. ఫండ్స్‌ పరిశ్రమలో ఈ కంపెనీ నిర్వహణ ఆస్తుల విలువ పరంగా మూడో స్థానంలో ఉంది. జేఎం ఫైనాన్షియల్‌కు క్రెడిట్‌ సూసే న్యూట్రల్‌ రేటింగ్‌ ఇచ్చింది. You may be interested

ఫండ్స్‌ ‘కొత్త’ పథకాల జోలికి ఇప్పుడెళ్లొద్దు

Friday 8th June 2018

సెబీ కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు చాలా వరకు తమ పథకాలను మార్పులు, చేర్పులు చేశాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ వద్దనున్న పథకాలను ఓ సారి సమీక్షించుకోవడం తప్పనిసరి. ఇందుకు అవసరమైతే అడ్వైజర్లను సంప్రదించాలి. ఈ నేపథ్యంలో నిపుణుల సూచనలు ఈ విధంగా ఉన్నాయి... ‘‘మారిన అన్ని పథకాల నుంచి మేం బయటకు రావడం లేదు. మొత్తం పోర్ట్‌ఫోలియోను చూస్తున్నాం. ఇన్వె‍స్టర్‌కు ఓ పథకం సరిపడదనుకుంటే లేదా

రేసుకు రెడీ అయిన 10 స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌..!

Friday 8th June 2018

ముంబై: గతేడాదిలో ఇన్వెస్టర్లకు కళ్లు జిగేల్‌మనిపించే రాబడిని అందించిన స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌ రంగాల షేర్లు ఈ ఏడాదిలో ఏకంగా ఆరు లక్షల కోట్ల రూపాయిల ఇన్వెస్టర్ల సంపదను హరించివేశాయి. బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.4.6 కోట్లు కరిగిపోగా.. మిడ్‌క్యాప్‌ పరంగా రూ.1.7 లక్షల కోట్లు తరిగిపోయింది. స్మాల్‌క్యాప్స్‌లో వక్రంగీ, గీతాంజలి జెమ్స్‌ లాంటి పలు షేర్లు ఈ ఏడాదిలో 90 శాతం నష్టపోగా.. మిడ్‌క్యాప్స్‌లో రిలయన్స్‌ కమ్యూనికేషన్‌,

Most from this category