STOCKS

News


ఆసియా మార్కెట్లు జూమ్‌

Tuesday 13th February 2018
Markets_main1518504316.png-13921

వారంరోజులపాటు భారీ పతనాన్ని చవిచూసిన అమెరికా, ఆసియా మార్కెట్లు మంగళవారం వరుసగా రెండోరోజు ర్యాలీ జరిపాయి. హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ ఇండెక్స్‌ 400 పాయింట్లు (1.5 శాతం) పెరగ్గా, సింగపూర్‌ స్ట్రయిట్‌టైమ్స్, చైనా షాంఘై, కొరియా కోస్పి, తైవాన్‌ వెయిటెడ్‌ ఇండెక్స్‌లు 1 శాతంపైగా ఎగిసాయి. ట్రేడింగ్‌ తొలిదశలో ఈ సూచీల 2 శాతం వరకూ పెరిగినప్పటికీ, ముగింపులో లాభాల్ని కొంతమేరకు కోల్పోయాయి. జపాన్‌ నికాయ్‌ సూచీ లాభాల నుంచి నష్టాలకు మళ్లడం, అమెరికా స్టాక్‌ ఫ్యూచర్లు నెగిటివ్‌గా ట్రేడ్‌కావడం ఇందుకు కారణాలు. గత రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు డోజోన్స్‌ ఇండస్ట్రియల్‌ ఏవరేజ్, నాస్‌డాక్, ఎస్‌ అండ్‌ పీ–500లు 1.5 శాతం వరకూ ర్యాలీ జరిపాయి. ఈ సూచీలు వరుసగా రెండు రోజుల్లో 5 శాతంపైగా ఎగిసాయి. అమెరికా సూచీలు కేవలం రెండు రోజుల్లో ఇంత పెద్ద ర్యాలీ జరపడం గత 18 నెలల్లో ఇదే ప్రధమం. గతవారం ఈ మార్కెట్లో భారీ పతనం సంభవించి, ప్రపంచ మార్కెట్లను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. శివరాత్రి పండుగ సందర్భంగా భారత్‌ మార్కెట్‌కు మంగళవారం సెలవు. 

 



You may be interested

ఈ మూడు షేర్లూ కొనొచ్చు

Tuesday 13th February 2018

సోమవారం నిఫ్టీ పాజిటివ్‌గా ముగిసింది. గతేడాది సెప్టెంబర్, డిసెంబర్‌ నెలల్లో క్షీణతను 100 డీఎంఏ రేఖ నిలిపివేసినట్లే, ఇటీవల పతనం కూడా అదే రేఖవద్ద ఆగిపోవడం సానుకూలమని సాంక్టమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ అనలిస్ట్‌ అశిష్‌ అంటున్నారు. నిఫ్టీ 10,450పైన స్థిరపడితే 10,640 పాయింట్ల వరకూ ర్యాలీ జరిపే అవకాశం వుంటుందని, అంతర్జాతీయ మార్కెట్ల మద్దతువుంటే ఈ ర్యాలీ 10,700–10740 పాయింట్ల వరకూ పెరగవచ్చని, 10450 పాయింట్ల మద్దతుపోతే మాత్రం 10,276

నేడు మార్కెట్‌కు సెలవు

Tuesday 13th February 2018

ముంబై:- మహాశివరాత్రి సందర్భంగా నేడు(మంగళవారం)స్టాక్‌ మార్కెట్‌కు సెలవు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో ట్రేడింగ్‌ మళ్లీ బుధవారం మొదలవుతుంది.  

Most from this category