STOCKS

News


‘అపోలో మైక్రో’ 248 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌

Friday 12th January 2018
Markets_main1515780903.png-13095

  •  శుక్రవారం ముగిసిన ఐపీఓ
  •  ఈ నెల 22న లిస్టింగ్‌!

న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన అపోలో మైక్రో సిస్టమ్స్‌ ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) 248 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయింది. రక్షణ, విమానయాన రంగాలకు హార్డ్‌వేర్‌ సొల్యూషన్లనందించే ఈ కంపెనీ ఐపీఓ ఈ నెల 10న మొదలై శుక్రవారం ముగిసింది. రూ.270-275 ధరల శ్రేణితో వచ్చిన ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.156 కోట్లు సమీకరిస్తోంది. ఐపీఓ కింద జారీ చేస్తున్న 41,44,955 షేర్లకు గాను 102.23 కోట్ల షేర్లకు దరఖాస్తులొచ్చాయి. కాగా ఈ కంపెనీ మంగళవారం నాడు యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.47 కోట్లు సమీకరించింది. షేర్లు ఈ నెల 22న స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నా‍యి. ఐపీఓ నిధులను చర మూలధన అవసరాలకు, సాధారణ వ్యాపార కార్యకలాపాలకు కంపెనీ వినియోగించనుంది. ఈ ఐపీఓకు ఆర్యమన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్‌గా వ్యవహరించింది. సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు కేటాయించిన షేర్ల వాటా దాదాపు వెయ్యి రెట్లు, సంస్థాగత ఇన్వెస్టర్ల వాటా 101 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా 40 రెట్లు చొప్పున ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి. ఉద్యోగులకు కేటాయించిన 20వేల షేర్లకు గాను 3.2 లక్షల షేర్లకు బిడ్‌లు వచ్చాయి. 
4వ కంపెనీ...
ఐపీఓ 200 రెట్లకు పైగా ఓవర్‌ సబ్‌స్క్రైబయిన నాలుగో కంపెనీ ఇది. గతంలో సాంఖ్య ఇన్ఫోటెక్‌ ఐపీఓ 283 రెట్లు, సలాసర్‌ టెక్నో ఇంజినీరింగ్‌ 273 రెట్లు, ఇటీవలే వచ్చిన ఆస్ట్రన్‌ పేపర్‌ అండ్‌ బోర్డ్‌ మిల్స్‌ 243 రెట్లు చొప్పున ఓవర్‌ సబ్‌స్క్రైబయ్యాయి.



You may be interested

ఈ ఆర్థిక సంవత్సరంలో 6.6 శాతం వృద్ధి

Friday 12th January 2018

సింగపూర్‌ డీబీఎస్‌ అంచనా సింగపూర్‌: భారత్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.6 శాతం వృద్ధిని సాధించగలదని సింగపూర్ బ్యాంకింగ్‌ దిగ్గజం డీబీఎస్‌ అంచనా వేసింది. ఆర్థిక వృద్ధి పుంజుకుంటుందనే ప్రోత్సాహకర సూచనలు కనిపిస్తున్నాయని, క్రమానుగత రికవరీ కొనసాగుతోందని తన తాజా నివేదికలో డీబీఎస్‌ పేర్కొంది. వచ్చే ఏడాది భారత్‌ 7 శాతం వృద్ధి సాధించగలదని చెప్పిన ఈ నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలివీ...  జీఎస్‌టీకి సంబంధించిన ప్రభుత్వ సవరణలు, బ్యాంక్‌లకు మూలధన నిధులు అందించడం,

యమహా ‘ఎఫ్‌జెడ్‌ఎస్‌-ఎఫ్‌ఐ’లో కొత్త వెర్షన్‌

Friday 12th January 2018

ధర రూ.86,042 న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ యమహా మోటార్‌ ఇండియా తాజాగా తన ‘ఎఫ్‌జెడ్‌ఎస్‌-ఎఫ్‌ఐ’లో సరికొత్త వెర్షన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఢిల్లీలో దీని ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.86,042. మెరుగైన బ్రేకింగ్‌ వ్యవస్థ, మంచి పనితీరు సామర్థ్యంతో ఈ బైక్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలియజేసింది. ఇందులో 149 సీసీ, ఎయిర్‌ కూల్డ్‌, 4 స్ట్రోక్‌ ఇంజిన్‌ను అమర్చినట్లు పేర్కొంది. 220 ఎంఎం హైడ్రాలిక్‌ సింగిల్‌ రియర్‌ డిస్క్‌

Most from this category