News


పొదుపు ఖాతాలపై ఆంధ్రాబ్యాంక్‌ రేటు కోత

Monday 11th September 2017
personal-finance_main1505150180.png-8393

న్యూఢిల్లీ: పొదుపు ఖాతాపై వడ్డీరేటు తగ్గిస్తున్న బ్యాంకుల జాబితాలో తాజాగా ఆంధ్రాబ్యాంక్‌ చేరింది. రూ.50 లక్షల దిగువన రేటును అరశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 3.5 శాతానికి తగ్గింది. రూ.50 లక్షల పైన మాత్రం రేటు యథాతథంగా కొనసాగుతుంది. సెప్టెంబర్‌ 15 నుంచీ కొత్త రేటు అమలవుతుంది. జూలై 31న ఎస్‌బీఐ పొదుపు ఖాతా రేటు కోతతో, మిగిలిన బ్యాంకులూ దీనిని అనుసరిస్తున్నాయి. డీమోనిటైజేషన్‌, రుణ వృద్ధిరేటు తగ్గడం వంటి కారణాల వల్ల బ్యాంకుల వద్ద అదనపు నిధుల లభ్యత ఉండడం దీనికి కారణం.  
పొదుపు ఖాతాలపై బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గిస్తుండడం మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఎంఎఫ్‌)కు సానుకూలంగా మారుతున్నట్లు రేటింగ్‌ ఏజెన్సీ- ఇక్రా ఇటీవలే పేర్కొంది. అంతగా రిస్క్‌లేని ప్రొడక్టులను ఫండ్స్‌ అమ్ముతూ, రిటైల్‌ సేవింగ్స్‌ను ఆకర్షించగలుగుతున్నట్లు తెలియజేసింది. పొదుపు ఖాతా రేటు తగ్గుతున్న పరిస్థితుల్లో కార్పొరేట్లు, వ్యవస్థాగత ఇన్వెస్టర్లు, వ్యాపార సంస్థలు తమ మిగులు నిధులను ‘ఫండ్స్‌ లిక్విడ్‌ స్కీమ్స్‌’ వంటి తక్కువ రిస్క్‌ ప్రొడక్టుల్లోకి స్వల్పకాలనికి  పంప్‌ చేస్తున్నట్లు ఇక్రా పేర్కొంది. బ్యాంకులు ఇచ్చే వడ్డీకన్నా కొంత ఎక్కువమొత్తం లిక్విడ్‌ స్కీమ్స్‌ ద్వారా లభించే అవకాశం ఉండడమే దీనికి కారణంగా పేర్కొంది.  గత ఏడాదిగా లిక్విడ్‌ స్కీమ్స్‌నుంచి 6.5 నుంచి 7 శాతం శ్రేణిలో రిటర్న్స్‌ అందుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.







You may be interested

యాంబీ వ్యాలీ వేలం కొనసాగించాల్సిందే: సుప్రీం

Monday 11th September 2017

న్యూఢిల్లీ: మహారాష్ట్ర పుణెలోని రూ.34,000 కోట్ల యాంబీ వ్యాలీ వేలాన్ని నిలిపివేయాలని సహారా చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. షెడ్యూల్‌ ప్రకారం, వేలం నిర్వహించడానికి అధికారిక లిక్విడేటర్‌కు అనుమతి ఇచ్చింది. యాంబీవ్యాలీలో తన 26 శాతం వాటాను రాయల్‌ పార్ట్‌నర్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌కు విక్రయించి  1.6 బిలియన్‌ డాలర్లు సమీకరించుకోడానికి అనుమతించాలని, అప్పటి వరకూ వ్యాలీ జప్తును నిలిపివేయాని అత్యున్నత న్యాయస్థానానికి సహారా విజ్ఞప్తి చేసింది. అయితే దీనిని

అమెజాన్‌లో 22,000 సీజనల్‌ ఉద్యోగాలు!!

Monday 11th September 2017

ముంబై: ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ‘అమెజాన్‌’ తాజాగా ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా 22,000 ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లు, డెలివరీ స్టేషన్స్‌, కస్టమర్‌ సర్వీస్‌ సైట్స్‌ వంటి వాటిల్లో ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొంది. ముంబై, హైదరాబాద్‌, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్‌ వంటి పలు ప్రాంతాల్లో ఈ సీజనల్‌ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని,  కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా ఈ

Most from this category