STOCKS

News


టెలినార్‌ ఉద్యోగుల కష్టాలు

Wednesday 16th May 2018
news_main1526489847.png-16531

  • ఇంటికి పంపేందుకు సిద్ధమౌతోన్న ఎయిర్‌టెల్‌

 
హైదరాబాద్‌: టెలినార్‌ ఇండియా, ఎయిర్‌టెల్‌ విలీనం టెలినార్‌ ఉద్యోగుకుల శాపంగా మారింది. కొంత మందిని ఇంటికి సాగనంపడానికి ఎయిర్‌టెల్‌ సిద్ధమౌతోంది. ఈ విషయానికి సంబంధించి భారతీ ఎయిర్‌టెల్‌ నుంచి టెలినార్‌ ఉద్యోగులకు ఈ-మెయిల్స్‌ వెళ్లినట్లు తెలుస్తోంది. విలీనం అనంతరం టెలినార్‌ ఇండియాలోని ఉద్యోగులందరూ ఎయిర్‌టెల్‌లో సరైన స్థాయి ఉద్యోగానికి పొందలేరని ఎయిర్‌టెల్‌ పేర్కొంది. కాగా టెలికం విభాగం మే 14న భారతీ ఎయిర్‌టెల్‌, టెలినార్‌ ఇండియా విలీనానికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ‘ఎయిర్‌టెల్‌ నుంచి నాకు ఒక ఈ-మెయిల్‌ వచ్చింది. ఎయిర్‌టెల్‌ హెచ్‌ఆర్‌ అధికారుల సమావేశానికి హాజరయ్యాను. విలీనం తర్వాత నా ప్రస్తుత హోదాకు వారి సంస్థలో ఖాళీ లేదని చెప్పారు. ఐదు నెలల వేతనాన్ని ఆఫర్‌ చేసి, ఉద్యోగానికి రాజనామా చేయాలని కోరారు. ఏం చేయాలో అర్థకావడం లేదు’ అని ఒక ఉద్యోగి ఆవేదన చెందాడు. ఎయిర్‌టెల్‌ ఇంటికి సాగనంపే ఉద్యోగులకు మంచి ఫైనాన్షియల్‌ ప్యాకేజ్‌, మెడికల్‌ ఇన్సూరెన్స్‌ కొనసాగింపు, ఉచిత కాల్స్‌ వంటి సౌకర్యాలను ఆఫర్‌ చేస్తున్నట్లు సమాచారం. ‘మేం ఇప్పటికే టెలినార్‌ ఇండియా నుంచి 700కుపైగా మందిని కొనసాగిస్తున్నాం. వీరి ఎదుగుదలకు ఎయిర్‌టెల్‌ ఇండియా సహా ఇతర విభాగాల్లో అవకాశాలను కల్పించాం’ అని ఎయిర్‌టెల్‌ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే టెలినార్‌ ఇండియాలో 1,400 మంది ఉద్యోగులు ఉన్నారు. ‘టెలినార్‌ ఇండియా కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌లో కలిసిపోయిందనే  విషయాన్ని మీరు తప్పక తెలుసుకోవాలి. ఈ చట్టబద్ధమైన విలీనం నేపథ్యంలో తదనంతర విషయాలు, తదుపరి చర్యల గురించి మీకు తెలియజేయడానికి మిమల్ని ఎయిర్‌టెల్‌ బృందంతో సమావేశానికి ఆహ్వానిస్తున్నాం. కింద (మెయిల్‌లో) తెలియజేసిన సమాచారం ప్రకారం సమావేశానికి అందుబాటులో ఉండండి’ అని ఎయిర్‌టెల్‌.. టెలినార్‌ ఇండియా ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్స్‌లో పేర్కొంది. కాగా టెలినార్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, బిహార్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ (తూర్పు), ఉత్తరప్రదేశ్‌ (పశ్చిమ), అస్సాం సర్కిళ్లలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 



You may be interested

జేకే లక్ష్మి సిమెంట్ 15 శాతం డివిడెండ్‌

Wednesday 16th May 2018

న్యూఢిల్లీ: జేకే లక్ష్మి సిమెంట్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.34 కోట్ల (స్టాండెలోన్‌) నికర లాభం ప్రకటించింది. అంతక్రితం క్యూ4లో నమోదైన రూ. 21 కోట్లతో పోలిస్తే ఇది 62 శాతం అధికం. తాజాగా క్యూ4లో ఆదాయం రూ. 923 కోట్లు కాగా, గత క్యూ4లో రూ. 931 కోట్లు. గతేడాది జూలై నుంచి జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ ఆదాయాలను పోల్చి చూడటానికి లేదని

జ్యోతి ల్యాబ్స్‌ 1:1 బోనస్‌

Wednesday 16th May 2018

ఒక్కో షేర్‌కు 50 పైసల డివిడెండ్‌ 29 శాతం తగ్గిన నికర లాభం  న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీ జ్యోతి ల్యాబ్స్‌ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి క్వార్టర్‌లో 29 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.107 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.76 కోట్లకు తగ్గిందని జ్యోతి ల్యాబ్స్‌ తెలిపింది. తమ కంపెనీలో విలీనమైన హెంకెల్‌ మార్కెటింగ్‌

Most from this category