News


ఏసీసీ లాభం రూ.326 కోట్లు

Tuesday 18th July 2017
Markets_main1500321638.png-5537

న్యూఢిల్లీ: మెరుగైన అమ్మకాలతో సిమెంట్‌ దిగ్గజం ఏసీసీ జూన్‌ త్రైమాసికంలో రూ.326 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో వచ్చిన రూ.246 కోట్లతో పోల్చుకుంటే తాజాగా 32 శాతం మేర వృద్ధి చెందింది. కన్సాలిడేటెడ్‌ విక్రయాలు 18 శాతం అధికమై రూ.3,818 కోట్లుగా నమోదయ్యాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు రూ.3,238 కోట్లు. సిమెంట్‌ విక్రయాలు 10 శాతం అధికంగా 6.74 మిలియన్‌ టన్నులు అమ్ముడుపోయినట్టు కంపెనీ తెలిపింది. కొత్త బ్రాండ్లు విడుదల చేయడంతోపాటు ప్లాంట్‌ సామర్థ్యాన్ని మెరుగుపరచడం వంటి చర్యలు చక్కని పనితీరుకు నిదర్శనంగా ఏసీసీ ఎండీ నీరజ్‌ అఖోరీ తెలిపారు. కాగా, ప్రతీ రూ.10 ముఖ విలువ కలిగిన షేరుకు మధ్యంతర డివిడెండ్‌ కింద రూ.11 ఇవ్వాలని బోర్డు సిఫారసు చేసింది. జనవరి-డిసెంబర్‌ను ఆర్థిక సంవత్సరంగా ఏసీసీ పాటిస్తోంది. 







You may be interested

కరెన్సీకి 'మేకిన్ ఇండియా' భద్రతా ఫీచర్లు

Tuesday 18th July 2017

న్యూఢిల్లీ: మేకిన్ ఇండియా నినాదానికి మరింతగా ఊతమిచ్చే దిశగా రిజర్వ్ బ్యాంక్‌ సోమవారం కరెన్సీ భద్రత ఫీచర్లకు సంబంధించి బిడ్లను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. గతంలో జారీ చేసిన రెండు టెండర్లను రద్దు చేస్తూ.. మేకిన్ ఇండియా ప్రమాణాలను తప్పనిసరి చేసే నిబంధనను జోడించి కొత్తగా మరో టెండర్‌ను జారీ చేసింది. దీని ప్రకారం సరఫరాదారు రెండేళ్ల వ్యవధిలో దేశీయంగా తయారీ యూనిట్ నెలకొల్పాలి. అలాగే క్రమంగా స్థానిక

రూ. 200 కోట్లు సమీకరించనున్న ఫినో పేమెంట్స్ బ్యాంక్‌

Tuesday 18th July 2017

ముంబై: బిజినెస్ కరెస్పాండెంట్స్ సంస్థ ఫినో సోమవారం చెల్లింపుల బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించింది. రాబోయే కొద్ది నెలల్లో సుమారు రూ. 200 కోట్లు మూలధనం సమీకరించనున్నట్లు ఈ సందర్భంగా ఫినో ఎండీ రిషి గుప్తా తెలిపారు. వచ్చే నాలుగేళ్లలోగా లిస్టింగ్ యోచన కూడా ఉన్నట్లు వివరించారు. "మాకు సుమారు రూ. 600 కోట్ల మేర మూలధనం అవసరం కాగా.. గత విడతలో రూ. 400 కోట్లు మాత్రమే సమీకరించాం. వచ్చే

Most from this category