News


17 ఏళ్లలో 7,000 శాతం రాబడి ఇచ్చిన షేరు ఇది

Saturday 26th August 2017
Markets_main1503726682.png-7564

ముంబై: ఏషియన్‌ పెయింట్స్‌ షేరు ధర దీర్ఘకాల ఇన్వెస్టర్ల పంటపండించింది. 17 ఏళ్లలో ఏకంగా 7,000 శాతం రిటర్న్స్‌ ఇచ్చిన షేరుగా నిలిచింది. అంటే, మీరు 2,000 సంవత్సరం జనవరి నెలలో రూ.10,000 ఈ షేరులో ఇన్వెస్ట్‌ చేసి ఉంటే.. ఇప్పుడు మీ సంపద రూ.7 లక్షలు ఉండేదన్న మాట. జనవరి 3, 2000 నాడు రూ.16.25 దగ్గర ఉన్న ఏషియన్‌ పెయింట్స్‌ ఇప్పుడు రూ.1,140 దగ్గర ట్రేడవుతోంది. ఆ సమయంలో ఈ షేరును ఒడిసిపట్టుకున్నవారి సంపదను 7,000 శాతం పెంచింది. ఇంతలా పెరిగిన ఈ షేరు కొనడం మిస్‌ అయిపోయామే అనుకునేవారికి.. మరేం ఫర్వాలేదు, ఇప్పుడైనా ఈ షేరులో ఇన్వెస్ట్‌చేసి లాభాలు గడించవచ్చని సూచిస్తున్నాయి పలు బ్రోకింగ్‌ సంస్థలు.

ఏషియన్‌ పెయింట్స్‌ షేరును కొనుగోలు చేయవచ్చని ఎడిల్‌వైజ్‌ బ్రోకింగ్‌ బై రేటింగ్‌ ఇచ్చింది. రూ.1249 టార్గెట్‌ ధరను ప్రకటించింది. ఈ షేరుకు రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ రూ,1,170 టార్గెట్‌ ధరను ఇచ్చింది. మోతీలాల్‌ ఓస్వాల్‌ రూ.1,200 టార్గెట్‌ ఇచ్చింది. 52.79 శాతం వాటా ప్రమోటర్ల చేతిలో ఉన్న ఈ కంపెనీ గడిచిన 10 ఏళ్లలో 7 సంవత్సరాలు రెండంకెల వృద్ధి రేటును ప్రకటించింది. ప్రతి ఏడాదికి క్యాపిటల్‌ ఎంప్లాయిడ్‌ 35 శాతం పెరుగుతు వచ్చింది. 







You may be interested

సోమవారం ఉదయం ఈ 3 షేర్లు చూడండి..!

Saturday 26th August 2017

ముంబై: స్వల్పకాలిక లాభాలను ఆశించేవారి కోసం టెక్నికల్‌ అనలిస్టులను పలు షేర్లను సిఫార్సు చేస్తున్నారు. కచ్చితంగా స్టాప్‌ లాస్‌ ఫాలో అయ్యేవారి కోసం 3 షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్‌ అనలిస్ట్‌ ఆశిష్ చతుర్‌మెహతా. సోమవారం (అగస్టు 28, 2017) మార్కెట్‌ ఓపెన్‌ అయిన వెంటనే ఈ షేర్లను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తున్నారు. అవేంటంటే..   1. హవెల్స్ ఇండియా లిమిటెడ్: ప్రస్తుతం ఈ షేరు ధర రూ.487 దగ్గర ఉంది. రూ.478 దగ్గర

కోల్‌ ఇండియా కొనొచ్చు- టార్గెట్‌ రూ.300

Saturday 26th August 2017

కంపెనీ: కోల్‌ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్‌) సిఫార్సు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ప్రస్తుత ధర: రూ.241 (26 అగస్టు, 2017) టార్గెట్‌ ధర: రూ.300 రెకమండేషన్‌: కొనొచ్చు 52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ. 339 /233   కోల్‌ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్‌) షేరుకు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ బై రేటింగ్‌ ఇచ్చింది. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసిక(2017-18, క్యూ1) ఆర్థిక ఫలితాల ఆధారంగా ఈ షేరును రెకమండ్‌ చేస్తున్నట్లు తెలియజేసింది. ఆక‌్షన్‌ ప్రీమియం తక్కువగా ఉండడం,

Most from this category