STOCKS

News


సోమవారం ఉదయం ఈ 3 షేర్లు చూడండి..!

Saturday 26th August 2017
Markets_main1503731566.png-7565

ముంబై: స్వల్పకాలిక లాభాలను ఆశించేవారి కోసం టెక్నికల్‌ అనలిస్టులను పలు షేర్లను సిఫార్సు చేస్తున్నారు. కచ్చితంగా స్టాప్‌ లాస్‌ ఫాలో అయ్యేవారి కోసం 3 షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్‌ అనలిస్ట్‌ ఆశిష్ చతుర్‌మెహతా. సోమవారం (అగస్టు 28, 2017) మార్కెట్‌ ఓపెన్‌ అయిన వెంటనే ఈ షేర్లను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తున్నారు. అవేంటంటే..

 

1. హవెల్స్ ఇండియా లిమిటెడ్: ప్రస్తుతం ఈ షేరు ధర రూ.487 దగ్గర ఉంది. రూ.478 దగ్గర స్టాప్‌లాస్‌ నిర్వహిస్తు సోమవారం ఈ షేరును కొనుగోలు చేయవచ్చని టెక్నికల్‌ అనలిస్ట్‌ ఆశిష్ చతుర్‌మెహతా సూచిస్తున్నారు. టార్గెట్‌ ధరను రూ.510గా నిర్ణయించినట్లు తెలియజేశారు.

 

2. సీఈఎస్‌సీ లిమిటెడ్: ప్రస్తుతం ఈ షేరు ధర రూ.958. స్ట్రాంగ్‌ వాల్యూమ్స్‌తో 950 టెక్నికల్‌ లెవెల్‌ వద్ద బ్రేకౌట్‌ వచ్చిన కారణంగా రూ.1,000 వరకు ఈ షేరు ర్యాలీ కొనసాగించే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలియజేశారు. అయితే, రూ.940 దగ్గర స్టాప్‌ లాస్‌ నిర్వహించనమని తెలిపారు.

 

3. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్: షేరు ప్రస్తుత ధర రూ.188. ఈ షేరులో కూడా స్ట్రాంగ్‌ వాల్యూమ్స్‌ నమోదైన నేపథ్యంలో షార్ట్‌ టర్మ్‌ టార్గెట్‌ రూ.200గా సూచించారు. స్టాప్‌ లాస్‌ రూ.185 దగ్గర నిర్వహించమని తెలియజేశారు.

 


గమనిక: ఇవి కేవలం టెక్నికల్‌ అనలిస్ట్‌ ఆశిష్ చతుర్‌మెహతా సిఫార్సులు మాత్రమే. ఇన్వెస్టర్లు తమ సొంత విశ్లేషణ అనంతరం మాత్రమే షేరును కొనుగోలు చేయడం మంచిదనేది సాక్షీ బిజినెస్‌ డాట్‌ కామ్‌ సూచన. 



You may be interested

ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌ను ప్రారంభించిన టాటా పవర్‌

Saturday 26th August 2017

టాటా పవర్‌ తొలి ఎలక్ట్రిక్‌ వెహికల్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌ను ప్రారంభించింది. ఎలక్ట్రిక్‌ వాహనాలను వినియోగించే వాహనదారుల సౌకర్యార్థం ఈ స్టేషన్‌ను ప్రారంభించినట్లు తెలియజేసిన టాటా పవర్‌.. విక్రోలి శివారు ప్రాంతంలో దీనిని ఏర్పాటుచేసినట్లు ప్రకటించింది. ఎలక్ట్రిక్‌ ఆధారంగా నడిచే కారు వినియోగం జోరందుకున్న నేపథ్యంలో ఈ స్టేషన్ల అవసరం పెరిగిందని కంపెనీ వెల్లడించింది. 2030 నాటికి సాధ్యమైనన్ని వాహనాలను ఎలక్ట్రిక్‌ వైపునకు మళ్లించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా.. పెరుగుతున్న

17 ఏళ్లలో 7,000 శాతం రాబడి ఇచ్చిన షేరు ఇది

Saturday 26th August 2017

ముంబై: ఏషియన్‌ పెయింట్స్‌ షేరు ధర దీర్ఘకాల ఇన్వెస్టర్ల పంటపండించింది. 17 ఏళ్లలో ఏకంగా 7,000 శాతం రిటర్న్స్‌ ఇచ్చిన షేరుగా నిలిచింది. అంటే, మీరు 2,000 సంవత్సరం జనవరి నెలలో రూ.10,000 ఈ షేరులో ఇన్వెస్ట్‌ చేసి ఉంటే.. ఇప్పుడు మీ సంపద రూ.7 లక్షలు ఉండేదన్న మాట. జనవరి 3, 2000 నాడు రూ.16.25 దగ్గర ఉన్న ఏషియన్‌ పెయింట్స్‌ ఇప్పుడు రూ.1,140 దగ్గర ట్రేడవుతోంది. ఆ

Most from this category