STOCKS

News


ఈ మూడు షేర్లలో ర్యాలీకి అవకాశం..!

Saturday 14th April 2018
Markets_main1523697071.png-15515

ముంబై: భారత ఈక్విటీ మార్కెట్లకు వచ్చేవారం చాలా కీలకమని ఈక్విటీ99 డాట్‌ కామ్‌ ఫౌండర్‌ సుమిత్ బిల్గాయన్ అన్నారు. ఇన్ఫోసిస్‌ త్రైమాసిక ఫలితాల ప్రభావం సోమవారం ట్రేడింగ్‌లో కనిపించనుండగా.. సియాంట్‌, డీసీబీ బ్యాంక్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, జై భారత్ మారుతి, 5పైసా క్యాపిటల్, క్రిసిల్, ముతూట్ క్యాపిటల్, టాటా స్పాంజ్ లాంటి మిడ్‌క్యాప్‌ కంపెనీల క్యూ4 ఫలితాలను ప్రకటించనున్నాయన్నారు. గురువారం (ఏప్పిల్‌ 19న) నిఫ్టీ కంపెనీలలోని ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టీసీఎస్‌ ఫలితాలు ప్రకటించనుండగా.. ఏప్రిల్‌ 16 నుంచి 20 వరకు ప్రధాని మోడీ స్వీడన్‌, యూకే పర్యటన మార్కెట్‌పై ప్రభావం చూపనుందని వ్యాఖ్యానించారు. భూగోళ రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ప్రపంచమార్కెట్‌లు ఈ పర్యటనను దగ్గరగా పరిశీలించనున్నాయన్నారు. త్వరలోనే చైనా జీడీపీ వెల్లడికానుండగా క్యూ1లో ఏడాది ప్రాతిపదికన 6.7 శాతం వరకు ఉండవచ్చని మార్కెట్‌ అంచనావేస్తున్నట్లు వెల్లడించారు. మార్చి ఐఐపీ వృద్ధి నెమ్మదించడానికి అవకాశం ఉందన్నారు. ఏప్రిల్‌ సమావేశంలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండోనేషియా పాలసీ రేటును 4.25 వద్దనే కొనసాగించేందుకు అవకాశం ఉందన్నారు. ఈ విషయాలన్నింటినీ పరిగణలోనికి తీసుకుని ఒక అంచనాకు వస్తే.. వచ్చే వారంలో నిఫ్టీకి దిగువస్థాయిలో 10,360 వద్ద సపోర్ట్‌ ఉండగా.. 10,600 వద్ద రెసిస్టెన్స్‌ ఉన్నట్లు సూచించారు. స్వల్పకాలంలో 18 శాతం వరకు రాబడిని అందించగల 3 షేర్లను సిఫార్సు చేశారు.

బాంబే డైయింగ్ | ప్రస్తుత ధర - రూ.249 | టార్గెట్ - రూ.295 
వాడియా గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీ పాలిస్టర్, టెక్స్‌టైల్స్‌, రియల్ ఎస్టేట్ రంగాలలో వ్యాపారాలను కొనసాగిస్తోంది. వీటిలో రియల్‌ ఎస్టేట్‌ సెగ్మెంట్‌ నుంచి కంపెనీ మంచి ప్రయోజనం పొందుతుందని అన్నారు. పాలిస్టర్ స్టెపిల్‌ ఫైబర్‌లో దేశంలోనే 4వ అతిపెద్ద కంపెనీగా ఉందన్నారు. హోమ్‌ అండ్‌ యూ బ్రాండ్‌ నుంచి ఆదాయం చెప్పుకోదగ్గస్థాయిలోనే ఉందన్నారు. గడిచిన 5 ఏళ్లలో కంపెనీ ఆదాయం 14 శాతం చక్రగతి వృద్ధిరేటును సాధించిందని వెల్లడించారు. స్వల్పకాలంతో పాటు దీర్ఘకాలంలో కూడా కంపెనీ షేరును పరిశీలించవచ్చని సూచించారు. బ్రాండెడ్‌ రిటైల్ విభాగంలోనికి ప్రవేశించడం కంపెనీకి ప్లెస్‌ పాయింట్లని అన్నారు.

ఫ్యూచర్ మార్కెట్ నెట్‌వర్క్‌ (ఎఫ్‌ఎమ్‌ఎన్‌ఎల్‌) | ప్రస్తుత ధర - రూ.136 | టార్గెట్ - రూ.147
ఎఫ్‌ఎమ్‌ఎన్‌ఎల్‌ (గతంలో ఈ కంపెనీలో పేరు అగ్రె డెవలపర్స్ లిమిటెడ్) కంపెనీ రిటైల్‌ మౌలిక వసతుల కల్పన, సరుకు రవాణా విభాగంలో సేవలందిస్తోంది. అతితక్కువ వ్యయంతో నిర్మాణాలను చేపడుతున్న ఈ కంపెనీ మోడీ ప్రభుత్వం కల్పిస్తోన్న ఇన్‌ఫ్రా ప్రయోజనాలను అందిపుచ్చుకోవడంలో ముందుంటోందని  సుమిత్ బిల్గాయన్ అన్నారు. ఇన్‌ఫ్రా, లాజిస్టిక్స్‌ రంగంలో ఉన్న గ్యాప్‌ను పూరించడంలో ఈ కంపెనీ యాక్టీవ్‌గా ఉన్నందున్న ఈ షేరుపట్ల ఫండమెంటల్‌గా పాజిటీవ్‌గా ఉన్నట్లు వెల్లడించారు.

భాగ్యనగర్ ఇండియా | ప్రస్తుత ధర - రూ.49.15 | టార్గెట్ - రూ.55
సురానా గ్రూపునకు చెందిన ఫ్లాగ్‌షిప్‌ కంపెనీలలో భాగ్యనగర్ ఇండియా లిమిటెడ్‌ (బీఐఎల్‌) కాపర్‌, విండ్‌ పవర్‌ వ్యాపారాలలో నిమగ్నమయ్యింది. సోలార్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలను డీమెర్జ్‌ చేయాలన్న కంపెనీ ప్రతిపాదన షేర్‌హోల్డర్లకు లబ్ధిచేకుర్చనుందని విశ్లేషించారు. ఈ ఏడాదిలో 10 శాతం వాల్యూమ్‌ వృద్ధిని కంపెనీ నమోదుచేసే అవకాశం ఉంది. రూ.47 స్టాప్‌లాస్‌గా నిర్వహిస్తూ కంపెనీ షేరును కొనుగోలు చేయవచ్చని సూచించారు. 

ఇవి కేవలం మార్కెట్‌ విశ్లేషకుల అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు తమ సొంత అధ్యయనం తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవడం మంచిదని సాక్షీబిజినెస్‌డాట్‌కామ్‌ సూచన.You may be interested

5:1 రేషియోలో యునైటెడ్ స్పిరిట్స్ షేరు విభజన

Saturday 14th April 2018

షేరు ప్రస్తుత ధర రూ.3,483.65 త్వరలోనే వెల్లడికానున్న ఎక్స్‌-డేట్‌  ముంబై: లిక్కర్‌ దిగ్గజం యునైటెడ్‌ స్పిరిట్స్‌ షేరు ధర వేల రూపాయిల నుంచి వందల రూపాయిల స్థాయికి విభజనకానుంది. ప్రస్తుతం ఈ కంపెనీ షేరు ధర రూ.3,483.65 (ఏప్రిల్‌ 13న) వద్ద ఉంది. ప్రస్తుతం రూ.10గా ఉన్న షేరు ముఖవిలువను రూ.2 (5:1 రేషియో)కు విభజించనున్నట్లు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ప్రకటించింది. అయితే, ఇందుకు షేర్‌హోల్డర్ల అనుమతి లభించవలసి ఉందని శుక్రవారం మార్కెట్‌

ఆణిముత్యాల్లాంటి ఆరు షేర్లు ఇవే..!

Saturday 14th April 2018

ముంబై: గడిచిన మూడు వారాలలో నిఫ్టీ షార్ప్‌ అప్‌సైడ్‌ బౌన్స్‌ నమోదుచేసినప్పటికీ ఇది కేవలం ఒక తాత్కాలిక బౌన్స్‌లానే కనిపిస్తోందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగారజ్ షెట్టీ విశ్లేషించారు. మార్కెట్‌ ఎగువస్థాయిల వద్ద బలహీనతకు ఆస్కారం ఎక్కువగా ఉన్నందున స్టాక్స్‌లో అవుట్‌పెర్ఫార్మెన్స్‌ లబ్ధిని పొందుతున్నవారు కచ్చితంగా స్టాప్‌లాస్‌లను నిర్వహించుకోవడం బెటరని సూచించారు. అతి స్వల్పకాలానికి నిఫ్టీ ట్రెండ్‌ పాజిటీవ్‌గానే ఉందన్న ఆయన 10,450-480 స్థాయి నుంచి బయటపడిన

Most from this category