STOCKS

News


డాషింగ్‌ డజన్‌ రికమండేషన్లు..

Monday 16th April 2018
Markets_main1523869464.png-15543

వివిధ బ్రోకరేజ్‌ సంస్థలు వచ్చే మూడు వారాల కోసం 12 స్టాకులను సిఫార్సు చేస్తున్నాయి.
హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సిఫార్సులు
1. సూర్యరోష్ని: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 450. స్టాప్‌లాస్‌ రూ. 405. శుక్రవారం బుల్లిష్‌ బ్రేకవుట్‌ ఇచ్చింది. అధోముఖ వాలు రేఖను పైవైపుగా ఛేదించి క్లోజయింది. ప్రస్తుతం 20, 50, 100, 200 రోజుల డీఎంఏ స్థాయిలకన్నా పైన ట్రేడవుతూ బుల్లిష్‌గా ఉంది. ఇండికేటర్లు సైతం స్టాకులో బలాన్ని సూచిస్తున్నాయి.
2. జీనస్‌ పవర్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 62. స్టాప్‌లాస్‌ రూ. 53. దిగువన రూ. 49 వద్ద డబుల్‌ బాటమ్‌ ఏర్పరిచి క్రమంగా పైకి ర్యాలీ ఆరంభించింది. శుక్రవారం క్లోజింగ్‌లో నెల గరిష్ఠాన్ని నమోదుచేసింది. ఆర్‌ఎస్‌ఐ, కేఎస్‌టీ ఇండికేటర్లు పాజిటివ్‌గా ఉన్నాయి. బేర్‌ పట్టు క్రమంగా సడలుతోంది.
ప్రభుదాస్‌ లీలాధర్‌ సిఫార్సులు
1. ఎస్కార్ట్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1050. స్టాప్‌లాస్‌ రూ. 905. గత కొన్నాళ్లుగా రూ. 922 వద్ద కన్సాలిడేట్‌ అవుతోంది. తాజాగా ఈ స్థిరీకరణను ముగించుకొని పైవైపు పాజిటివ్‌ బ్రేకవుట్‌ సాధించింది. ఆర్‌ఎస్‌ఐ ఇండికేటర్‌ ట్రెండ్‌రివర్సల్‌ను చూపుతోంది. 
2. రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 90. స్టాప్‌లాస్‌ రూ. 77. ఇటీవల గరిష్ఠస్థాయి రూ.111ని తాకిన అనంతరం కరెక‌్షన్‌కు లోనైంది. రూ. 72 వద్ద బాటమ్‌ అవుట్‌ చెందింది. అక్కడనుంచి 50 రోజుల డీఎంఏ స్థాయికి పైన క్లోజయి బలాన్ని చూపుతోంది.
నిర్మల్‌బంగ్‌ సిఫార్సులు
1. గుఫిక్‌ బయోసైన్సెస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 140. స్టాప్‌లాస్‌ రూ. 115. ఇటీవలే బహుళస్థాయి నిరోధాన్ని భారీ వాల్యూంలతో దాటేసింది. ఆర్‌ఎస్ఐ ఇండికేటర్‌ పాజిటివ్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది.
2. ఇంటలెక్ట్‌ డిజైన్‌ ఏరియా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 185. స్టాప్‌లాస్‌ రూ. 164. డైలీ చార్టుల్లో రూ. 172 వద్ద డబుల్‌ టాప్‌ బ్రేకవుట్‌ సాధించినట్లు చూపుతోంది. ఎంఎసీడీ తదితర ఇండికేటర్లు బుల్‌ట్రెండ్‌ను నిర్ధారిస్తున్నాయి.
3. జమునా ఆటో ఇండస్ట్రీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 96. స్టాప్‌లాస్‌ రూ. 82. కన్సాలిడేషన్‌ స్థాయిలను భారీ వాల్యూంలతో దాటి అప్‌ట్రెండ్‌కు సిద్ధమైంది. ఆర్‌ఎస్‌ఐ పాజిటివ్‌గా ఉంది.
చార్ట్‌వ్యూ ఇండియా సిఫార్సులు
1. అశోక్‌లేలాండ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 167. స్టాప్‌లాస్‌ రూ. 142. మార్చిలో జీవితకాల గరిష్ఠాన్ని తాకి అనంతరం కరెక‌్షన్‌కు గురైంది. బహువారాల స్థిరీకరణ అనంతరం తిరిగి పాత అప్‌ట్రెండ్‌ కొనసాగింపునకు రెడీ అయింది. రూ. 143కు పైన ఎంటర్‌ కావచ్చు.  
2. ఏసీసీ: కొనొచ్చు. టార్గెట్‌రూ. 1650. స్టాప్‌లాస్‌ రూ. 1495. దీర్ఘకాలిక చార్టుల్లో మేజర్‌ మద్దతు స్థాయిని మరోమారు తాకింది. గత ర్యాలీకి 62 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయి సైతం ఇక్కడే ఉంది. ఈ స్థాయిల్లో మంచి మద్దతు లభిస్తోంది. అప్‌ట్రెండ్‌ మరలా కొనసాగే ఛాన్సులున్నాయి.
3. గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 615. స్టాప్‌లాస్‌ రూ. 550. తొమ్మిది నెలల పాటు అధోముఖ వాలురేఖకు దిగువనే ప్రయాణిస్తూ వచ్చింది. ఇటీవలే నిరోధ స్థాయిలను బద్దలు కొట్టింది. 
ఎంఎస్‌టీఏ సిఫార్సులు
1. దాల్మియా భారత్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 2970. స్టాప్‌లాస్‌ రూ. 2780. గత డిసెంబర్‌లో గరిష్ఠాలను తాకిన అనంతరం కరెక‌్షన్‌ బాట పట్టింది. సుదీర్ఘ కన్సాలిడేషన్‌ అనంతరం పాజిటివ్‌ సంకేతాలు ఇస్తూ అప్‌ట్రెండ్‌కు రెడీ అయింది.
2. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 570. స్టాప్‌లాస్‌ రూ. 536. డబుల్‌ బాటమ్‌ స్థాయి రూ. 470- 480 వద్ద మద్దతు కూడగట్టుకుంటోంది. ఇటీవలే నిరోధ స్థాయి 200 రోజుల డీఎంఏకు పైన క్లోజయి అప్‌ట్రెండ్‌ను నిర్ధారిస్తోంది. ఆర్‌ఎస్‌ఐ, ఎంఏసీడీ బుల్లిష్‌గా ఉన్నాయి. You may be interested

ఇన్ఫోసిస్‌కు ఫలితాల షాక్‌..!

Monday 16th April 2018

6 శాతం నష్టషోయిన షేర్లు నిమిషాల్లో రూ.15 వేల కోట్ల నష్టం ముంబై:- విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా త్రైమాసిక ఫలితాలను సాధించినప్పటికీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ షేర్లు సోమవారం మార్కెట్లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. నేడు బీఎస్‌ఈ ట్రేడింగ్‌ ప్రారంభంలో 6 శాతం నష్టపోయి రూ. 1099.00 ఇంట్రాడే కనిష్టానికి పతనమయ్యాయి. గత శుక్రవారం క్రితం ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసికంలో ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉన్నప్పటికీ వృద్ధి రేటు, ఆపరేటింగ్ మార్జిన్

మ్యూచువల్‌ ఫండ్స్‌ కొన్న టాప్‌ 5 షేర్లు ఇవే..!

Monday 16th April 2018

ముంబై: దీర్ఘకాల మూలధన లాభాల పన్ను(ఎల్‌టీసీజీ) వర్తింపు లాంటి పలు ప్రతికూల అంశాల కారణంగా స్టాక్‌ సూచీలు నేలచూపులు చూస్తున్న ప్రస్తుత తరుణంలో ఎఫ్‌ఐఐలు, పలువురు దేశీయ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కితీసుకుంటుంటే.. మ్యూచువల్‌ ఫండ్స్‌ మాత్రం వాల్యూయేషన్స్‌ పక్కాగా ఉన్న షేర్లలో పెట్టుబడుల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నాయి.తాజాగా ఫండ్‌ హౌస్‌లు కొనుగోలుచేసిన టాప్‌ 5 షేర్లను ఒకసారి పరిశీలిస్తే.. ఏఐఏ ఇంజినీరింగ్ కొనుగోలు చేసిన సంస్థ: డీఎస్‌పీ బ్లాక్‌రాక్‌ మ్యూచువల్ ఫండ్ షేరు ప్రస్తుత

Most from this category