ఈ స్టాకుల్లో కరెక్షన్ సిగ్నల్స్!!!

సోమవారం ముగింపు చార్టుల్లో దాదాపు వందకు పైగా షేర్లు పతనానికి రెడీగా ఉన్న సంకేతాలు చూపాయి. ఇలా కరెక్షన్కు తయారుగా ఉన్న స్టాకుల్లో ఐసీఐసీఐ బ్యాంక్, ఐఓసీ, ఐటీసీ, టాటా మోటర్స్, పీవీఆర్, ఇన్ఫీ, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, భారత్ గేర్స్, వాడిలాల్, మహానగర్ గ్యాస్ లాంటి దిగ్గజాలున్నాయి. వీటితోపాటు హెచ్‌పీసీఎల్, ఈఐఎల్, గేట్వేడిస్ట్రిపార్క్స్, భారతి ఇన్ఫ్రాటెల్, ఐబీఆర్ఎల్, వీగార్డ్, ఎస్‌జేవీఎన్, ఉజ్జీవన్, బీఎఫ్ యుటిలిటీస్ షేర్లలో సైతం నెగిటివ్ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ ఇండికేటర్ బేరిష్ సంకేతాలు ఇచ్చింది. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్ చేసే విధానాన్ని బట్టి బేరిష్ క్రాసింగ్, బుల్లిష్ క్రాసింగ్‌గా చెబుతారు. ప్రస్తుతం ఈ షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ ఇలాంటి బేరిష్ క్రాసోవర్ ఏర్పరిచింది. అయితే కేవలం ఎంఏసీడీని మాత్రమే కాకుండా ఇన్వెస్టర్లు ఇతర ఇండికేటర్లను సైతం పరిశీలించి నిర్ణయానికి రావాలి. ప్రస్తుతం నిఫ్టీ సైతం ప్రస్తుతం బేరిష్‌గా ఉందని, త్వరలో 9700- 9800 పాయింట్లకు దిగజారే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు 24 స్టాకుల్లో ఎంఏసీడీ బుల్లిష్ క్రాసోవర్ ఏర్పరిచింది. వీటిలో హెచ్‌యూఎల్, తారా జువెల్స్, జైపీఇన్ఫ్రా, బొడాల్ కెమికల్స్, హాత్వే కేబుల్స్, శక్తి సుగర్స్ షేర్లున్నాయి.
You may be interested
బేర్ పట్టు బిగుస్తోంది!
Tuesday 20th March 2018నెగిటివ్ జోన్లోకి జారుతున్న భారత మార్కెట్లు కీలక మద్దతు స్థాయి కింద ట్రేడవుతున్న పలు షేర్లు దేశీయ ఈక్విటీలపై బేర్స్ పట్టు గట్టిగా బిగుస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా వారు ఒక కీలకాంశాన్ని చూపుతున్నారు. నిఫ్టీ 50లోని సింహభాగం షేర్లు వాటి 200 రోజుల డీఎంఏ స్థాయిలకన్నా దిగువన ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 50 కంపెనీల్లో 64 శాతం కంపెనీలు ఈ విధంగా కీలక మద్దతు స్థాయిలకు దిగువన ఉన్నాయి. ఈ తరహా
ఏప్రిల్ 1లోపు ఈ షేర్లలో లాభాల స్వీకరణ.!
Tuesday 20th March 2018ముంబై: స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆర్జించిన మొత్తంపై ఇకనుంచి దీర్ఘకాలిక మూలధన రాబడి పన్ను (ఎల్టీసీజీ) చెల్లించాల్సిన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు నెమ్మదిగా తమ హోల్డింగ్స్‌ను తగ్గించుకునే పనిలోపడ్డారని మై ఫైనాన్షియల్ అడ్వైజర్ (ప్రైవేట్ వెల్త్ మేనేజ్మెంట్ సంస్థ) ఫౌండర్ అమర్ పండిట్ విశ్లేషించారు. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్, లిస్టెడ్ ఈక్విటీ షేర్లును విక్రయించడం ద్వారా పొందిన రూ.లక్షకు మించిన మూలధన లాభాలపై 10