STOCKS

News


సీఎల్‌ఎస్‌ఏ సిఫార్సు చేస్తున్న 10 మిడ్‌క్యాప్స్‌ ఇవే..!

Monday 18th June 2018
Markets_main1529321264.png-17490

దీర్ధకాలిక ఇన్వెస్టర్ల కోసం గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ సీఎల్ఎస్ఏ 10 మిడ్‌ క్యాప్‌ షేర్లను సిఫార్సుచేసింది. వీటిలో ఎనిమిది షేర్లకు బై రేటింగ్‌ ఇచ్చిన సీఎల్ఎస్ఏ.. 2 సెల్‌ సిఫార్సులను సూచించింది. అవేంటంటే..

అపోలో హాస్పిటల్స్ | రేటింగ్‌ : కొనొచ్చు | టార్గెట్‌ ధర రూ.1,500
గడిచిన 36 నెలల్లో 20 శాతం ఆసుపత్రులను పెంచిన ఈ సంస్థ గడిచిన కొంతకాలంగా లాభదాయకంగా కొనసాగుతున్నట్లు వెల్లడించింది. 

అరవింద్ | రేటింగ్‌ : కొనొచ్చు | టార్గెట్‌ ధర రూ.557
మూలధన వ్యయం రూ.500 కోట్ల ద్వారా టెక్స్‌టైల్స్‌ రంగంలో సామర్థ్య పెంపునకు వినియోగించనుందని వివరించింది.

గోద్రెజ్ ప్రొపర్టీస్‌ | రేటింగ్‌ : కొనొచ్చు | టార్గెట్‌ ధర రూ.1097
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నూతన ప్రాజెక్టులను ఆవిష్కరించనున్నట్లు వెల్లడించింది. ప్రధాన నగరాలకు చెందిన ప్రాజెక్టులను లాంచ్‌ చేయనున్నట్లు వివరించింది. వాల్యూమ్స్‌ పెంచడం ద్వారా లాభాలను ఆర్జించడం లాంటి స్ట్రాటజీలను కంపెనీ తీసుకోవడంతో పాటు అందుబాటు గృహాలపై దృష్టిసారించడం వల్ల కంపెనీ షేరు ఆకర్షణీయంగా ఉన్నట్లు వివరించింది. 

హవెల్స్‌ | రేటింగ్‌ : కొనొచ్చు | టార్గెట్‌ ధర రూ.655
ఫ్యాన్లు, వాటర్‌ హీటర్ల విభాగంలో శరవేగంగా మార్కెట్‌ వాటాను పెంచుకుంటున్న కంపెనీగా వివరించింది. 2019 నిర్ణయాత్మక ఆర్థిక సంవత్సరంగా విశ్లేషించింది.

జూబ్లెంట్ ఫుడ్‌వర్క్స్‌ | రేటింగ్‌ : కొనొచ్చు | టార్గెట్‌ ధర రూ.3,150
గడిచిన 12 నెలలకాలంలో నూతన యాజమాన్యం ప్రకటించిన పలు అంశాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నట్లు తెలిపిన సీఎల్‌ఎస్‌ఏ.. 2018-20 కాలంలో ఎర్నింగ్‌ పర్‌ షేర్‌ 40 శాతం వృద్ధిని నమోదుచేసేందుకు అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

లెమెన్‌ ట్రీ హోటల్స్ | రేటింగ్‌ : కొనొచ్చు | టార్గెట్‌ ధర రూ.90
2018-21 కాలంలో 8,152 రూమ్‌లను పెంచడం ద్వారా పోర్టిఫోలియోను 67 శాతం పెంచనుండడం ఆధారంగా షేరును సిఫార్సు చేస్తున్నట్లు తెలిపింది.

రామ్కో సిమెంట్స్ | రేటింగ్‌ : కొనొచ్చు | టార్గెట్‌ ధర రూ.960
గ్రైండింగ్‌ సామర్థ్యాన్ని 3.5 మిలియన్‌ టన్నులు పెంచడం ద్వారా 2020 నాటికి 20 ఎంటీలకు చేర్చాలని కంపెనీ లక్ష్యంగా తెలిపిన సీఎల్‌ఎస్‌ఏ.. తమిళనాడు లాంటి ప్రాంతాలలో డిమాండ్‌ పెరుగుతుందని వివరించింది.

ప్రెస్టీజ్ ఎస్టేట్స్  | రేటింగ్‌ : కొనొచ్చు | టార్గెట్‌ ధర రూ.395
నూతన ఆవిష్కరణల ద్వారా అమ్మకాలలో వృద్ధి సాధించనున్నట్లు కంపెనీ గైడెన్స్‌ ఇచ్చింది. 


పిడిలైట్‌  | రేటింగ్‌ : సెల్ | టార్గెట్‌ ధర రూ.920
ముడి పదార్థాల ధరలు గణనీయంగా పెరగడం వల్ల  2018-20 కాలంలో ఎర్నింగ్‌ పర్‌ షేర్‌ వృద్ధి 10 శాతానికే పరిమితం అయినట్లు వివరించింది. 

వోల్టాస్ | రేటింగ్‌ : సెల్ | టార్గెట్‌ ధర రూ.460
ఇన్వర్టర్‌ ఏసీ రంగంలోకి మారిన తరువాత అమ్మకాలలో పెద్దగా వృద్ధిరేటును నమోదుచేయలేకపోయింది. ఈ విభాగంలోనికి వచ్చిన తరువాత షేరు ధర తగ్గుదల బాటపట్టింది.

ఇవి కేవలం సీఎల్‌ఎస్‌ఏ సిఫార్సులు మాత్రమే. ఇన్వెస్టర్లు తమ సొంత అధ్యయనం తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవడం మంచిదని సాక్షీబిజినెస్‌డాట్‌కామ్‌ సూచన.You may be interested

ఎఫ్‌పీఐలు వెళ్ళిపోతున్నాయ్‌!

Monday 18th June 2018

2008 తర్వాత ఈ స్థాయిలో ఇదే తొలిసారి వర్దమాన ఆసియా మార్కెట్ల నుంచి స్పీడుగా వైదొలుగుతున్న విదేశీ ఫండ్లు ఆసియా ప్రాంతంలోని ఆరు ప్రధాన వర్దమాన దేశాల ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ నిధులు వేగంగా వెనక్కు తరలిపోతున్నాయి. 2008 తర్వాత ఇంత వేగంగా విదేశీ నిధుల ఉపసంహరణ జరగడం ఇదే తొలిసారి. దీంతో ఆయా ఈక్విటీలన్నీ డీలా పడుతుండగా, మరోవైపు స్థిరంగా, బలంగా ఉన్న ఇతర ఆసియామార్కెట్లపై కూడా ఈ ప్రభావం

వాణిజ్య యుద్ధ భయాలు - నష్టాల్లో ముగిసిన మార్కెట్‌

Monday 18th June 2018

ముంబై:- అగ్ర రాజ్యాలైన అమెరికా - చైనా దేశాల మధ్య సుంకాల సమరం మళ్లీ మొదలవడంతో మార్కెట్‌ సోమవారం నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 74 పాయింట్లు నష్టపోయి 35,548 వద్ద, నిఫ్టీ 18 పాయింట్ల పతనంతో 10800 పాయింట్ల వద్ద ముగిసింది. కీలకమైన నిఫ్టీ బ్యాంక్‌ 8 పాయింట్లు స్వల్ప నష్టంతో 26,409 వద్ద స్థిరపడింది. చైనాపై తాజాగా అమెరికా 50 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను

Most from this category