STOCKS

News


యస్‌ బ్యాంకును ‘నో’ అనుకున్నాం..

Thursday 14th February 2019
Markets_main1550136264.png-24198

బ్రోకరేజ్‌ల అభిప్రాయం
దాదాపు 14 సంవత్సరాల తర్వాత యస్‌ బ్యాంకు షేరు అత్యధిక ఇంట్రాడే లాభాలు చవిచూసింది. ఒకదశలో దాదాపు 30 శాతం వరకు షేరు దూసుకుపోయింది. బ్యాంకు అసెట్స్‌ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్న వార్తలు షేరు కౌంటర్లో జోరు నింపాయి. దీంతో ఇప్పటివరకు షేరుపై నెగిటివ్‌ భావనతో ఉన్న బ్రోకింగ్‌ సంస్థలు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నాయి. యస్‌బ్యాంకును తప్పుగా అర్ధం చేసుకున్నామని బ్రోకింగ్‌ సంస్థలు భావిస్తున్నాయి. దీంతో షేరు రేటింగ్‌ను, టార్గెట్‌ ధరను పెంచుతూ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అసెట్స్‌ విషయంలో అవకతవకలున్నాయని భావించే ఆర్‌బీఐ బ్యాంకు చైర్మన్‌ను మార్చాలని పట్టుబట్టింది. కానీ ఇప్పుడు ఈ ఇబ్బందులు తొలగిపోవడంతో షేరులో దాదాపు 86 శాతం అప్‌సైడ్‌ ఉండొచ్చని బ్రోకింగ్‌ సంస్థలు భావిస్తున్నాయి. 
వివిధ బ్రోకింగ్‌ సంస్థలు, టార్గెట్‌ ధరలు...


ఇప్పుడున్నట్లుండి అంతా బాగుందని చెబుతున్నా, రాణాకపూర్‌ తొలగింపు విషయంలో ఎందుకు ఆర్‌బీఐ గట్టిగా వ్యవహరించిందన్న అంశానికి సమాధానం దొరకాల్సిఉందని జెఫర్రీస్‌ అభిప్రాయపడింది. ఇకపైన ఇలాంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునేముందు ఆర్‌బీఐ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, మైనార్టీ షేర్‌ హోల్డర్లను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలని బ్రోకింగ్‌ నిపుణులు సూచిస్తున్నారు. 



You may be interested

నష్టాల్లోంచి.. లాభాల్లోకి డీహెచ్‌ఎఫ్‌ఎల్‌

Thursday 14th February 2019

దీవాన్ హౌజింగ్ ఫైనాన్స్ కార్పోరేష‌న్ (డీహెచ్ఎఫ్ఎల్‌) షేరు గురువారం ట్రేడింగ్‌లో నష్టాల్లోంచి భారీ లాభాల్లోకి మళ్లింది. జాయింట్‌ ఎండీ, సీఈవో పదవులకు రాజీనామా చేశారనే వార్తలతో నేడు డీహెచ్ఎఫ్ఎల్‌ షేరు 5శాతం నష్టంతో రూ.105.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇం‍ట్రాడేలో మరొక శాతం(మొత్తం 6శాతం) క్షీణించి రూ.104.00ల కనిష్టానికి చేరుకుంది. కంపెనీ బోర్డు హర్షిల్‌ రాజీనామాకు వెంటనే ఆమోదం తెలిపినట్లు వార్తలు తెరపైకి రావడంతో షేరు తిరిగి లాభాల్లోకి మళ్లింది.

భారత్‌ ఫోర్జ్‌ డౌన్‌గ్రేడ్‌

Thursday 14th February 2019

2.50శాతం నష్టపోయిన షేరు బ్రోకరేజ్‌ సంస్థలు షేరు టార్గెట్‌ ధరను తగ్గించడంతో ఆటో విడిభాగాల కంపెనీ భారత్‌ ఫోర్జ్‌ షేరు గురువారం 2.50శాతం నష్టపోయింది. నేడు బీఎస్‌ఈలో కంపెనీ షేరు రూ.475.10ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారభించింది. వచ్చే ఏడాదిలో కమర్షియల్‌ వాహన అమ్మకాలు క్షీణించడంతో కంపెనీ మార్జిన్లు మార్జిన్లు తగ్గవచ్చనే అంచనాలతో పాటు రాబోయే రోజుల్లో కంపెనీ వృద్ధి అంచనాలు అధికంగా ఉండటంతో షేరు టార్గెట్‌ ధరును తగ్గిస్తున్నట్లు బ్రోకరేజ్‌ సంస్థలు

Most from this category