News


13 శాతం నష్టపోయిన యస్‌ బ్యాంక్‌

Thursday 13th June 2019
Markets_main1560422398.png-26273

యస్‌ బ్యాంక్‌ షేరు విలువ గురువారం ఇంట్రాడేలో 12.96 శాతం నష్టపోయింది. ఫారిన్‌ బ్రోకరేజి సంస్థ యూబీఎస్‌ ఈ షేరు టార్గట్‌ విలువను రూ.170 నుంచి రూ.90 కి తగ్గించింది.    టార్గెట్‌ ధరను 47శాతం మేర తగ్గించడంతో  షేరు గురువారం నాలుగు సంవత్సరాల కనిష్ఠ స్థాయికిపడిపోయింది.   2015 అగష్ట్టు 24 తర్వాత యస్‌బ్యాంకుకు ఇదే కనిష్ఠ స్థాయి. యూబీఎస్‌ ప్రకారం ఈ రేటు నుంచి కూడా 20 శాతం పైన క్షీణించే అవకాశం ఉంది. ఈ ఏడాది లో ప్రస్తుత తేది వరకు సెన్సెక్స్‌ 9.9 శాతం పెరిగినప్పటికి యస్‌ బ్యాంక్‌ షేరు విలువ మాత్రం 33శాతం మేర పడిపోయింది.  ఆర్థికవ్యవస్థలోని మందగమనం ఫైనాన్స్‌ సెక్టార్‌పై ప్రభావం చూపుతోంది.  అప్పులు, నిరార్థక ఆస్తులు.. నెట్‌ ఇంట్రస్ట్‌ మార్జిన్‌(ఎన్‌ఐఎమ్‌)పై ప్రభావం చూపనున్నాయి. ‘మానేజ్‌మెంట్‌  షేర్‌ హోల్డర్ల నమ్మకాన్ని కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ప్రమాదాల నివారణ, నిర్వహణపై దృష్ఠి పెట్టి బ్యాంక్‌ పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చేందుకు మేనేజ్‌మెంట్‌ పనిచేస్తుంది’ అని యస్‌ బ్యాంక్‌ సీఈఓ రావనీత్‌ గిల్‌ అన్నారు.  



You may be interested

చినుకు పడకపోతే చిక్కులే!

Thursday 13th June 2019

(SAKSHI BUSINESS EXCLUSIVE) థాంప్సన్‌ టీవీ ఇండియా సీఈఓ అవనీత్‌ సింగ్‌ న్యూఢిల్లీ, సాక్షి బిజినెస్‌: ఈ ఏడాది రుతుపవనాలు సరిగా వర్షించకపోతే అన్ని రంగాలకు గడ్డుకాలం వస్తుందని ఎస్‌పీపీఎల్‌ సీఈఓ అవనీత్‌ సింగ్‌ మార్వా హెచ్చరించారు. ఎకానమీ, ముఖ్యంగా రూరల్‌ ఎకానమీ మందగమన కోరల్లో ఉందని, సరైన వర్షపాతమే ఈ ఆపద నుంచి గట్టెక్కిస్తుందని చెప్పారు. స్వాతంత్రానంతరం ఇన్నేళ్లు గడిచినా, రుతుపవనాల కోసం ఎదురుచూడాల్సి రావడం బాధాకరమని, నదుల అనుసంధానమే ఇందుకు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13500 స్థాయికి నిఫ్టీ!

Thursday 13th June 2019

రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ అంచనా నిఫ్టీ సూచీ ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరపు వాస్తవ ఆదాయాలతో పోలిస్తే 18.2 రెట్లు అధికంగా ట్రేడ్‌ అవుతోంది. బడ్జెట్లో మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచే దిశగా ప్రభుత్వం అడుగులు పడాలని మార్కెట్‌ వర్గాలు కోరుకుంటున్నాయి. ఈ ఏడాది రెండో భాగంలో కంపెనీ ఎర్నింగ్స్‌ 15 శాతం వృద్ధి చెందుతాయన్న అంచనాలున్నాయి. ఇదే నిజమైతే ఈ ఆర్థిక సంవత్సరం చివరకల్లా నిఫ్టీ ఖచ్చితంగా 13,000-13,500 లకు చేరుకుంటుంది.

Most from this category