STOCKS

News


యస్ బ్యాంక్ చీఫ్ రేసులో ఇద్దరు..

Saturday 12th January 2019
news_main1547272985.png-23548

 లిస్టులో రజత్ మోంగా, విదేశీ బ్యాంక్ సీఈవో పేర్లు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ యస్ ‍బ్యాంక్ ఎండీ, సీఈవో రాణా కపూర్ వారసుడిని ఎంపిక చేసేందుకు రూపొందించిన షార్ట్‌ లిస్ట్‌లో ఇద్దరి పేర్లు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరిలో ఒకరు యస్ బ్యాంక్‌లో ప్రస్తుతం సీనియర్ గ్రూప్ ప్రెసిడెంట్‌గా ఉన్న రజత్ మోంగా కాగా మరొక పేరు విదేశీ బ్యాంక్ సీఈవోది ఉన్నట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. 2004లో యస్‌ బ్యాంక్ ప్రారంభమైనప్పట్నుంచి రజత్‌ మోంగా వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రుణాల విషయంలో అవకతవకలు జరిగాయన్న కారణంగా యస్ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ని మరో విడత ఎండీ, సీఈవోగా కొనసాగించే ప్రతిపాదనను ఆర్‌బీఐ తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో జనవరి 31న ఆయన తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే షార్ట్‌ లిస్ట్ చేసిన పేర్లను యస్ బ్యాంక్ ఈ వారం తొలినాళ్లలో రిజర్వ్ బ్యాంక్‌కు పంపింది.
కియా మోటార్స్‌తో ఒప్పందం..
ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్‌కి ఫైనాన్స్, బ్యాంకింగ్‌ సేవలు అందించేందుకు యస్ బ్యాంక్ అవగాహన ప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం టర్మ్ లోన్స్‌, క్యాష్ క్రెడిట్‌ తదితర సాధనాల రూపంలో కియా కార్ డీలర్లకు యస్ బ్యాంక్ సర్వీసులు అందించనుంది. ‍అలాగే అటు కొనుగోలుదారులకు కూడా రుణ సేవలు అందించనుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో కియా మోటార్స్ భారత మార్కెట్లో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ)ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.



You may be interested

పారిశ్రామిక వృద్ధి అరశాతమే

Saturday 12th January 2019

- నవంబర్‌లో తీవ్ర నిరాశాకర ఫలితం - 17 నెలల కనిష్ట స్థాయి ఇది... - తయారీ, వినియోగంలో అసలు నమోదుకాని​వృద్ధి - భారీ యంత్రాల డిమాండ్‌ను సూచించే క్యాపిటల్‌ గూడ్స్‌దీ ఇదే ధోరణి న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం నవంబర్‌లో పేలవ పనితీరును ప్రదర్శించింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ఈ నెలల్లో కేవలం 0.5 శాతంగా (2017 ఇదే నెలతో​ పోల్చి) నమోదయ్యింది. సూచీలోని తయారీ, వినియోగ రంగాల్లో అసలు వృద్ధి నమోదుకాకపోగా, క్షీణ రేటు నమోదయ్యింది.

61శాతం పెరిగిన కర్ణాటక బ్యాంక్‌ లాభం

Saturday 12th January 2019

దన్నుగా నిలిచిన నిర్వహణ, ఇతర ఆదాయాలు న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగంలోని కర్ణాటక బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.140 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.87 కోట్ల నికర లాభం వచ్చిందని, 61 శాతం వృద్ధి సాధించామని కర్ణాటక బ్యాంక్‌ తెలిపింది. నిర్వహణ, ఇతర  ఆదాయాలు బాగా పెరగడంతో ఈ స్థాయిలో నికర లాభం పెరిగిందని తెలియజేసింది. నికర వడ్డీ ఆదాయం రూ.451

Most from this category