యస్ బ్యాంక్ చీఫ్ అప్డేట్.. షేరు 4%అప్
By Sakshi

ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ చీఫ్ వెతుకులాటలో ఒక అప్డేట్ వెలువడింది. బ్యాంక్ కొత్త ఎండీ, సీఈవో ఎంపికలో సెర్చ్ అండ్ సెలెక్షన్ కమిటీకి సాయమందించేందుకు యస్ బ్యాంక్ తాజాగా అమెరికాకు చెందిన అడ్వైజరీ సంస్థ ‘కార్న్ ఫెర్రీ’ను నియమించుకుంది. యస్ బ్యాంక్‌కు నాలుగు గ్లోబల్ లీడర్షిప్ అడ్వైజరీ సంస్థల నుంచి ప్రతిపాదనలు అందాయి. గురువారం జరిగిన సమావేశంలో బ్యాంక్ వీటిల్లోంచి కార్న్ ఫెర్రీని ఎంపిక చేసుకుంది. కాగా ఆర్బీఐ.. యస్ బ్యాంక్ చీఫ్ రాణా కపూర్ పదవీ కాలాన్ని పొడిగించడాన్ని నిరాకరిచింది. 2019 జనవరిలో బాధ్యతల నుంచి వైదొలగాలని పేర్కొంది. అందువల్ల ఆలోపు యస్ బ్యాంక్ కొత్త చీఫ్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంది.
కార్న్ ఫెర్నీ నియామకం నేపథ్యంలో యస్ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో ఉదయం 11:27 సమయంలో 4.45 శాతం పెరుగుదలతో 250 వద్ద ట్రేడవుతోంది. మార్నింగ్ సెషన్లో ఒకానొక సమయంలో 6 శాతంమేర ఎగసింది. కాగా యస్ బ్యాంక్ షేరు గత ఐదురోజుల్లో 21 శాతంమేర పెరిగింది.
You may be interested
బ్యాంక్ నిఫ్టీ 3శాతం అప్
Friday 12th October 2018మార్కెట్ రికవరీలో భాగంగా గురువారం బ్యాకింగ్ షేర్లు భారీగా లాభాపడ్డాయి. ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ ఇంట్రాడేలో 3శాతం లాభపడింది. నేడు నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ 25000ల పైన ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో పలు బ్యాంకింగ్ షేర్ల ర్యాలీ కారణంగా నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ 3శాతం లాభపడి 25,484 గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.11:30ని.లకు ఇండెక్స్ గత ముగింపు(24,784)తో పోలిస్తే 2.66శాతం లాభంతో 25,443.25
సెన్సెక్స్ 600 పాయింట్లు జంప్..
Friday 12th October 2018ఇండియన్ స్టాక్ మార్కెట్ శుక్రవారం జోరుమీదుంది. గ్యాప్‌అప్‌తో ప్రారంభమైన ఇండెక్స్‌లు అదే ఊపును కొనసాగిస్తున్నాయి. ఉదయం 10:53 సమయంలో సెన్సెక్స్ 651 పాయింట్ల లాభంతో 34,652 వద్ద, నిఫ్టీ 198 పాయింట్ల లాభంతో 10,432 వద్ద ట్రేడవుతున్నాయి. క్రూడ్ ధరలు తగ్గడం, రూపాయి బలోపేతమవ్వడం వంటి అంశాలు సానుకూల ప్రభావం చూపాయని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 34,702 పాయింట్ల గరిష్ట స్థాయిని, 34,279 పాయింట్ల కనిష్ట స్థాయిని