News


8నెలల కనిష్టానికి డబ్ల్యూపీఐ గణాంకాలు

Monday 14th January 2019
news_main1547455701.png-23575

ఆహార పదార్థాలు, చమురు ధరలు శాంతించడంతో డిసెంబర్‌ టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) 8నెలల కనిష్టానికి దిగివచ్చింది. నవంబర్‌లో 4.64 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం రేటు డిసెంబర్‌లో భారీ తగ్గి 3.80 శాతానికి పరిమితమైంది. గతేడాది డిసెంబర్‌లో 3.58 శాతంగా నమోదయ్యింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన  గణాంకాల వివరాలు ఇలా ఉన్నాయి.

  • మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్రొడెక్టుల ద్రవ్యోల్బణం నవంబర్‌లో 4.21 శాతంగా నమోదు కాగా, డిసెంబర్‌ నాటికి 3.59 శాతానికి దిగివచ్చింది.
  • డీజీల్‌, పెట్రోల్‌ ధరలు తగ్గడంతో విద్యుత్‌ విభాగానికి చెందిన ద్రవ్యోల్బణం 8.38 శాతంగా నమోదయ్యింది. ఇది నవంబర్‌లో 6.28 శాతంగా ఉంది.
  • ఇక ఆహార ఉత్పత్తుల విభాగంలో డిసెంబర్‌ ప్రతిద్రవ్యోల్బణం 0.07 శాతంగా ఉంది. నవంబర్‌లో ప్రతిద్రవ్యోల్బణం 3.31 శాతంగా నమోదయ్యింది.



You may be interested

ఎర్నింగ్స్‌ గ్రోత్‌ ఆదుకుంటుంది!

Monday 14th January 2019

ఈక్విటీలపై గ్లోబల్‌ బ్రోకరేజ్‌ల అంచనా దేశీయ ఈక్విటీల్లో వాల్యూషన్లు ఇప్పటికీ అధికంగానే ఉన్నాయి.అయితే స్థూల ఆర్థికాంశాలు , కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ మెరుగుపడడంతో ఈక్విటీలకు ఇబ్బంది ఉండదని విదేశీ బ్రోకరేజ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది ఈక్విటీలు లాభాల్లోనే ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి. ఎన్నికల వేళ కాస్త ఒడిదుడుకులు కనిపించినా, లాంగ్‌టర్మ్‌లో లాభాలే ఉంటాయని తెలిపాయి. ఇందుకు దారి తీసే కారణాలను వివరించాయి. 1. ఎర్నింగ్స్‌ వృద్ధి: గత కొన్నేళ్లుగా కొంతమేర ఎర్నింగ్స్‌

యాక్సిస్‌, ఐటీసీలో షేర్ల విక్రయం

Monday 14th January 2019

- 'సూటీ' వాటాలపై కేంద్రం యోచన న్యూఢిల్లీ: స్పెసిఫైడ్ అండర్‌టేకింగ్ ఆఫ్ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (సూటీ) ద్వారా యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీల్లో తనకున్న వాటాల్లో కొంత భాగాన్ని విక్రయించడంపై కేంద్ర ఆర్థిక శాఖ దృష్టి పెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బల్క్ లేదా బ్లాక్ డీల్స్‌ రూపంలో ఇది ఉండొచ్చని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గతేడాది సెప్టెంబర్ 30 నాటికి సూటీకి యాక్సిస్ బ్యాంక్‌లో

Most from this category