STOCKS

News


22 నెలల కనిష్టానికి డబ్ల్యూపీఐ గణాంకాలు

Friday 14th June 2019
news_main1560500637.png-26298

ఆహార పదార్థాలు, ఇంధన, విద్యుత్‌ ధరలు దిగిరావడంతో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) మే నెలలో 22 నెలల కనిష్టానికి దిగివచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మే నెలలో 2.45శాతంగా నమోదైంది. ఏప్రిల్‌లో ఇది 3.07శాతంగా ఉండగా, గతేడాది(2018) ఇదే మేలో 4.78శాతంగా నమోదైంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల వివరాలు ఇలా ఉన్నాయి.
1. ఆహార పదార్థాల ద్రవ్యోల్బం మేలో 6.99శాతానికి పరిమితమైంది. ఏప్రిల్‌ ఇది 7.37శాతంగా ఉంది. కూరగాయల ధరల విభాగపు ద్రవ్యోల్బణం 40.65 శాతం నుంచి 33.15శాతానికి దిగివచ్చింది. మేలో ఉల్లిపాయల ధరలు పెరగడంతో ప్రతి ద్రవ్యోల్బణం 15.89శాతంగానూ. బంగాళదుంప ప్రతి ద్రవ్యోల్బణం 23.36శాతంగా నమోదైంది. 
2. డీజీల్‌, పెట్రోల్‌, విద్యుత్‌ ధరలు చల్లబడటంతో ఈ విభాగపు ద్రవోల్బణం 3.84 శాతం నుంచి 0.98 శాతానికి దిగివచ్చింది.
3. మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్రొడెక్టుల ద్రవ్యోల్బణం ఏప్రిలో 1.72 శాతంగా నమోదు కాగా, మే నాటికి 1.28 శాతానికి పరిమితమైంది.



You may be interested

మరో 2-3 ఏళ్ల పాటు మార్కెట్లో ర్యాలీ

Friday 14th June 2019

దేశీయ ఈక్విటీ మార్కెట్లో మరో 2-3 ఏళ్ల ర్యాలీ కొనసాగుతుందని ఆనంద్‌ రాఠి షేర్స్‌, స్టాక్‌ బ్రోకర్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సిద్ధార్థ్‌ సేదాని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే గత ఐదేళ్ల ఎన్‌డీఏ పాలనకాలంలో ఆర్థిక వ్యవస్థ ప్రక్షాళన, జీఎస్టీ అమలు, మౌలికరంగ సదుపాయాల అభివృద్ది కార్యకలాపాలతో పాటు వ్యవస్థలో కీలకమైన పాలసీలను ప్రవేశపెట్టడం ద్వారా దీర్ఘకాలిక వృద్ధికి పునాది పడిందని సేదాని అంటున్నారు. ఎన్నికల సందర్భంగా ఎన్‌డీఏ మానిఫెస్టోలో ప్రకటించిన కొత్త పథకాలు

ఆర్‌ క్యాప్‌ షేర్లను వదిలించుకోనున్న ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌

Friday 14th June 2019

అనిల్‌ అంబాని రిలయన్స్‌ క్యాపిటల్‌ షేర్లను ఇప్పటి వరకు కవర్‌ చేస్తూ వస్తున్న ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌  తాజాగా ఈ షేర్లను వదిలించుకోవటానికి సిద్ధపడింది.  దీనితో షేరును కవర్‌ చేస్తున్న ఏకైక  బ్రోకరేజీ కంపెనీ కూడా ఆర్‌ క్యాప్‌ను వదిలించుకున్నట్లు కానుంది.  పీడబ్యుసీ విరమించుకున్న తర్వాత ఏర్పడిన పరిణామాల వలన ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఈ నిర్ణయం తీసుకుంది. తక్కువ రేటింగ్‌లు, ఆడిటర్‌ విరమణ, ఒత్తిడిలో ఉన్న బ్యాలెన్స్‌ సీట్లు... కారణంగా ఈ సమయంలో

Most from this category