STOCKS

News


ఎన్నికల వేళ ఫోకస్‌లో రియల్‌ ఎస్టేట్‌, ఆటో రంగాలు

Friday 9th November 2018
Markets_main1541757017.png-21826

బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో ర్యాలీ చేశాయి. అయితే తర్వాత కరెక‌్షన్‌కు గురయ్యాయి. తొలి ఆరు నెలల కాలంలో పొందిన లాభాలను సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో కోల్పోయాయి. ఇండియన్‌ మార్కెట్‌ ప్రస్తుతం కీలక స్థాయికి చేరుకుంది. ఇప్పుడు చోటుచేసుకునే అంశాలు మార్కెట్‌ తర్వాతి ఏడాది గమనాన్ని, దిశను నిర్దేశిస్తాయి. జెరోధా కో-ఫౌండర్‌ నిఖిల్‌ కామత్‌ ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. ‘మార్కెట్‌లో ఈ ఏడాది ఔట్‌పర్ఫార్మెన్స్‌ చూశాం. అలాగే అండర్‌పర్ఫార్మెన్స్‌ గమనించాం. ఇది ఎక్కువగా రంగాల వారీగా ఉంది. అయితే ఇదివరకు బుల్‌ లేదా బేర్‌ మార్కెట్‌లలో వృద్ధి సమ్మిళితంగా ఉంది. మిడ్‌ క్యాప్స్‌, స్మాల్స్‌ క్యాప్స్‌ ఎక్కువగా అండర్‌పర్ఫార్మ్‌ చేశాయి. ఇవి ఒకానొక సమయంలో 20-30 శాతంమేర కరెక‌్షన్‌కు గురయ్యాయి’ అని వివరించారు. పండుగ సీజన్‌ చివరకు వచ్చేసిందని, అయినా కూడా వివిధ రంగాల్లో డిమాండ్‌ మాత్రం ఊపందుకోలేదని తెలిపారు. ఆటో రంగం కావొచ్చు.. టెక్స్‌టైల్‌ విభాగం కావొచ్చు.. ఈ రంగాలకు చెందిన కంపెనీలు ఈ ఏడాది డిమాండ్‌ పేలవంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నాయని పేర్కొన్నారు.
స్థూల ఆర్థికాంశాల పరంగా చూస్తే.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూర్చవచ్చని నిఖిల్‌ కామత్‌ తెలిపారు. అయితే స్వల్ప కాలంలో చూస్తే చాలా పరిశ్రమలకు గడ్డు పరిస్థితులను తలెత్తాయని పేర్కొన్నారు. క్రూడ్‌ ధరల పెరుగుదల, రూపాయి క్షీణత వంటి అంశాల వల్ల భారత్‌ ఆర్థిక వ్యవస్థకు ఎల్లప్పుడూ ముప్పు పొంచి ఉంటుందని తెలిపారు.  
ఎన్నికల వేళ రియల్‌ ఎస్టేట్‌, ఆటోమొబైల్‌ రంగాలు ఫోకస్‌లో వుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయా రంగాల పట్ల కామత్‌ ఇలా విశ్లేషించారు. 

రియల్‌ ఎస్టేట్‌
భారత్‌లో రియల్‌ ఎస్టేట్‌ ఓవర్‌వ్యాల్యుడ్‌ అని చెప్పొచ్చు. సొంతిల్లు కలిగి ఉండాలనే ఆలోచన, ధరలు ఎప్పటికైనా పెరుగుతాయనే ధీమా, అద్దె వంటి పలు అంశాలు ఇందుకు కారణం. అయితే రియల్టీ రంగంలో పెద్ద కరెక‌్షన్‌ మిగిలి ఉంది. రానున్న కాలంలో అండర్‌పర్ఫార్మ్‌ చేయవచ్చు. దీర్ఘకాలంలో చూస్తే.. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనం, ఇతర వాటితో పోటీలో ఉండొచ్చు. రెరా, కొత్త నిబంధనల కారణంగా ఈ రంగంలో ధరలు ఆమోదయోగ్యంగా మారతాయి. 

వాహన రంగం
ఇన్వెస్టర్‌, కన్సూమర్‌ సెంటిమెంట్‌ బలహీనంగా ఉంది. అందువల్ల అక్టోబర్‌ నెలలో ఆటోమొబైల్‌ కంపెనీల పండుగ సీజన్‌ లాభాలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. వాహన విక్రయాలు కూడా అలాగే ఉన్నాయి. మార్కెట్‌ లీడర్‌ మారుతీ సుజుకీ దేశీ వాహన అమ్మకాలు వార్షికంగా చూస్తే స్వల్పంగా 1.5 శాతం వృద్ధితో 1,38,100 యూనిట్లుగా నమోదయ్యాయి. హ్యుందాయ్‌ దేశీ వాహన విక్రయాలు 4.9 శాతం వృద్ధితో 52,001 యూనిట్లుగా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను అంచనా వేయడానికి ఉపయోగపడే రంగాల్లో ఆటోమొబైల్‌ ముందంజలో ఉంటుంది. ఆటో డిమాండ్‌ నెమ్మదించడమనేది ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని సూచిస్తోంది. వాణిజ్య వాహన విభాగంలో బలహీనమైన డిమాండ్‌ అనేది వచ్చే ఏడాది ఆర్థిక వ్యవస్థ బలహీనతను తెలియజేస్తోంది. 

ఐటీ, ఫార్మా
రూపాయి క్షీణత ఈ రంగాలకు ప్రయోజనం కలిగించింది. ఈ రంగాలు ఎక్కువగా ఎగుమతులపై ఆధారపడతాయి. రూపాయిలో 5 శాతం కరెక‌్షన్‌ వల్ల ఈ రంగాలకు చెందిన కంపెనీల మార్జిన్లు పెరుగుతాయి. ఈ ప్రయోజనం కొంత కాలం మాత్రమే ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. స్థూల ఆర్థికాంశాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మెరుగుపడతాయి.  

మొత్తంగా చూస్తే చాలా రంగాలు నెమ్మదించే అంచనాలున్నాయి. వచ్చే 12 నెలల కాలానికి తటస్థ అంచనాలతో ఉన్నాం. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు ఇంకా అధిక వ్యాల్యుయేషన్స్‌తో ట్రేడ్‌ అవుతున్నాయి. అందువల్ల కరెక‌్షన్‌ ఇంకా మిగిలే ఉంది. You may be interested

50-70 డాలర్ల శ్రేణిలో క్రూడ్‌: మూడీస్‌

Friday 9th November 2018

అంతర్జాతీయ వృద్ధిరేటు నెమ్మదిస్తున్న నేపథ్యంలో ముడిచమురు ధరలు మరింత చతికలపడే అవకాశం ఉందని అంచనా వచ్చే ఏడాది భారత జీడీపీ 7.3 శాతంగా ఉండవచ్చు మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ మేనేజింగ్ డైరెక్టర్ మేరీ డిరోన్ వ్యాఖ్య అభివృద్ధి చెందుతున్న దేశాలతో కలిపి మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించవచ్చు. గడిచిన రెండు ఏళ్ల నుంచి 3.3 శాతం కొనసాగుతున్న పూర్తి ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత వృద్ధిరేటు.. వచ్చే ఏడాదిలో 3 శాతానికి తగ్గిపోయే అవకాశం

ఆయిల్‌ మార్కెటింగ్‌ షేర్ల ర్యాలీ

Friday 9th November 2018

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు దిగిరావడంతో శుక్రవారం మిడ్‌సెషన్‌ అనంతరం ఆయిల్‌ మార్కెటింగ్‌ షేర్లు భారీ ర్యాలీని చేస్తున్నాయి. ప్రపంచమార్కెట్లో బ్యారెల్‌ చమురు ధర  70.65 డాలర్ల కనిష్టానికి పతనమయ్యాయి. చమురు ధర పతనంతో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు మార్జిన్లు పెరుగుతాయని అంచనాలతో ఇన్వెస్టర్లు ఓఎంసీ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపారు. పలితంగా ఆయిల్‌ కంపెనీ మార్కెట్‌ షేర్లు ర్యాలీ చేశాయి.  అత్యధికంగా హెచ్‌పీసీఎల్‌ 5శాతం లాభపడింది. ఇండియన్‌ ఆయిల్‌ 3శాతం,

Most from this category