STOCKS

News


‘డీజిల్ కార్లు’ కొనసాగుతాయి: మారుతి

Wednesday 17th April 2019
news_main1555478183.png-25171

న్యూఢిల్లీ: సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండే డీజిల్ కార్ల ఉత్పత్తి ఇక మీదట కూడా కొనసాగుతుందని దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా మంగళవారం ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి బీఎస్‌-6 ఉద్గార నిబంధనలు అమలుకానున్న నేపథ్యంలో ఈ తరహా కార్ల ఉత్పత్తిని కంపెనీ నిలిపివేయనుందనే అనుమానాలకు సమాధానంగా సంస్థ చైర్మన్‌ ఆర్.సి భార్గవ ఈ మేరకు ప్రకటనచేశారు. ఉత్పత్తి నిలిపివేత అంశంపై బదులిచ్చిన ఆయన.. ‘డీజిల్‌ కార్ల ఉత్పత్తి ఆపేస్తామని ఎన్నడూ చెప్పలేదు. రానున్న రోజుల్లో చిన్నపాటి డీజిల్‌ ఇంజిన్‌ కార్ల ధరలు గణనీయంగా పెరుగుతాయి కానుక.. ఎంట్రీ లెవెల్‌ విభాగంలో వినియోగదారులు కొనుగోలు చేయదగిన వాటిని మాత్రమే అందుబాటులో ఉంచాలని ప్రణాళిక రూపొందించాం. ఈ క్యాటగిరీలో మార్కెట్‌ సీఎన్‌జీ వైపు మారుతోంది. ప్రస్తుతం దేశీ ప్యాసింజర్‌ వాహన మార్కెట్లో 51 శాతం వాటా ఉన్న మా సంస్థ.. ఉత్పత్తి పూర్తిగా ఆపివేస్తే వాటా తగ్గిపోతుంది. కేవలం మా సంస్థ కార్లు మాత్రమే కాకుండా.. అన్ని కంపెనీలకు ఇది వర్తిస్తుంది’ అని వివరించారు.



You may be interested

ఇక నుంచి కొత్త ఫామ్‌-16

Wednesday 17th April 2019

మరింత సమాచారం ఉండేలా మార్పులు న్యూఢిల్లీ: యాజమాన్యాలు ఉద్యోగుల టీడీఎస్‌ (మూలం వద్ద పన్ను కోత) వివరాలకు సంబంధించి జారీచేసే ఫామ్‌ -16 సర్టిఫికేట్‌ ఫార్మాట్‌ను ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ సవరించింది. హౌస్‌ ప్రాపర్టీ నుంచి ఆదాయాలు, ఇతర యాజమాన్యాల నుంచి పారితోషికాలు సహా విస్తృత ప్రాతిపదికన సమాచారం అందుబాటులో ఉండేలా ఫామ్‌-16ను సవరించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పన్ను ఎగవేతల నిరోధమే లక్ష్యంగా సమగ్రంగా ఈ ఫార్మాట్‌ను రూపొందించినట్లు

నేడు స్టాక్‌ మార్కెట్‌ సెలవు

Wednesday 17th April 2019

మహావీర్‌ జయంతి సందర్భంగా నేడు (బుధవారం) మార్కెట్‌కు సెలవు. కావున ఈక్విటీ, బాండ్‌, ఫారెక్స్‌ మార్కెట్లు పనిచేయవు. ట్రేడింగ్‌ తిరిగి రేపు (గురువారం) జరుగుతుంది. అయితే శుక్రవారం గుడ్‌ఫ్రైడ్‌ కారణంగా కూడా మార్కెట్‌ పనిచేయదు. క్రితం రోజు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 370 పాయింట్ల లాభంతో 39,276 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 97 పాయింట్ల లాభంతో 11,787 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 39,364 పాయింట్లను, నిఫ్టీ 11,811

Most from this category