STOCKS

News


కరూర్‌ షేరు క్రాష్‌

Thursday 14th February 2019
news_main1550140350.png-24202

గురువారం ఇంట్రాడేలో కరూర్‌ వైశ్యాబ్యాంక్‌ షేరు దాదాపు 18శాతం వరకు  పతనమైంది. ఆరంభ ట్రేడింగ్‌లో రూ. 63.20 కనిష్ఠస్థాయిని చూసింది. అనంతరం కోలుకొని 15 శాతం నష్టంతో 67. 15 రూపాయల వద్ద ముగిసింది. ఈ రోజు కనిష్ఠం 52 వారాల కనిష్ఠ ధర కావడం గమనార్హం. క్యు3 ఫలితాల సందర్భంగా మేనేజ్‌మెంట్‌ చేసిన గైడెన్స్‌ ప్రకటన షేరుపై తీవ్ర ప్రభావం చూపింది. గత ఐదు త్రైమాసికాల్లో రూ.1000 కోట్ల ఎస్‌ఎంఈ స్లిపేజ్‌లున్నట్లు బ్యాంకు తెలిపింది. అంటే ఒక్కో త్రైమాసికానికి సుమారు 200 కోట్ల రూపాయల స్లిపేజ్‌లున్నట్లు తెలిపింది. క్యు3లో ప్రకటించిన రూ. 158 కోట్ల రూపాయల స్లిపేజ్‌ల కన్నా ఇది ఎక్కువ కావడంతో ఇన్వెస్టర్లు నెగిటివ్‌గా రియాక్టయ్యారు.

క్యు3లో బ్యాంకు లాభం 70 శాతం పతనమైంది. ప్రొవిజన్స్‌ పెరగడం, ఎన్‌ఐఐ పేలవంగా ఉండడంతో ఫలితాలు ఉసూరుమన్నాయి. ఎన్‌ఐఐ గతేడాదితో పోలిస్తే 3.4 శాతం పెరిగినా ఇన్వెస్టర్లు ఆశించినంత పెరుగుదల కనిపించలేదు. ఆస్తుల నాణ్యత సైతం ఈ త్రైమాసికంలో మరింత బలహీన పడింది. జీఎన్‌పీఏలు 7.7 శాతం నుంచి 8.49 శాతానికి, ఎన్‌ఎన్‌పీఏలు 4.41 శాతం నుంచి 4.99 శాతానికి పెరిగాయి. దీంతో షేరు కౌంటర్లో అమ్మకాల ఒత్తిడి పెరిగి పతనమైంది. 



You may be interested

పీఎస్‌యూ కంపెనీలపై మ్యూచువల్‌ ఫండ్స్‌ ‘లవ్‌’

Friday 15th February 2019

దేశంలో టాప్‌ -3 మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు (ఏఎంసీలు) జనవరిలో పలు పీఎస్‌యూ కంపెనీల షేర్లను కొనుగోలు చేశాయి. ఈ మూడు సంస్థల నిర్వహణలో ఉన్న ఈక్విటీ, డెట్‌ ఆస్తులు విలువ రూ.9 లక్షల కోట్లు. మరి ఉన్నట్టుండి ప్రభుత్వరంగ కంపెనీల్లో షాపింగ్‌ ఎందుకు చేసినట్టు? అన్న సందేహం ఇన్వెస్టర్లకు రావడం సహజం. పీఎస్‌యూ షేర్ల వ్యాల్యూషన్లు చాలా తక్కువ స్థాయికి అందుబాటులోకి రావడాన్ని ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవాల్సి

36000 దిగువన సెన్సెక్స్‌

Thursday 14th February 2019

10750 దిగువకు నిఫ్టీ సూచీ ఆరోరోజూ అమ్మకాలే..! అధిక పరిమాణం కలిగిన షేర్ల పతనంతో మార్కెట్‌ ఆరో రోజూ నష్టపోయింది.  ఇన్వెస్టర్ల అమ్మకాల పరంపర మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10750 మార్కును కోల్పోయి 47 పాయింట్లు నష్టంతో 10,746 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 158 పాయింట్లను కోల్పోయి 36వేల దిగువన 35,876 వద్ద ముగిసింది. ఈ 6రోజుల్లో సెన్సెక్స్‌ మొత్తం 1099 పాయింట్లను పోగొట్టుకుంది. మరోవైపు బ్యాంక్‌

Most from this category