STOCKS

News


కొత్త ఇన్వెస్టర్లు... స్టాక్‌ ఇన్వెస్టింగ్‌ ఎలా?

Saturday 12th January 2019
Markets_main1547231794.png-23538

ఈ ప్రశ్న... కొత్తగా స్టాక్‌ మార్కెట్లలోకి అడుగు పెట్టే ప్రతీ ఇన్వెస్టర్‌ నుంచి ఎదురయ్యేదే. స్టాక్‌ మార్కెట్లో స్వల్ప కాలంలోనే భారీ లాభాలు, నష్టాలు వస్తాయని తెలుసు. కానీ, లాభాలు ఎలా, నష్టాలు ఎలా అన్నది వివరంగా తెలిసిన వారు కొద్ది మందే ఉంటారు. ‘స్టాక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ను నేను ఎక్కడ ఆరంభించాలి...? నాకు ఏ మాత్రం విషయ జ్ఞానం లేదు...’ అంటూ ఓ ఔత్సాహిక ఇన్వెస్టర్‌ వేసిన ప్రశ్నకు... చార్టర్డ్‌ అకౌంటెంట్‌ నిపుణురాలు ప్రాకృతి  ఓ ఆన్‌లైన్‌ ఫోరమ్‌లో ఇచ్చిన సూచనలు ఇలా ఉన్నాయి...

 

స్టాక్‌ మార్కెట్‌ గురించి తెలియజేసే ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లు, బ్రోకరేజీ కంపెనీలు కూడా ఈ తరహా సమాచారం ఇస్తున్నాయి. స్టాక్‌ మార్కెట్లో విజయం సాధించేందుకు అధ్యయనం తోడ్పడుతుంది. కానీ, అదే సమయంలో వాస్తవిక పరిజ్ఞానం కీలకం అవుతుంది. స్టాక్స్‌లో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకుని ఉంటాయి. తగిన విచారణల తర్వాత పెట్టుబడి నిర్ణయం తీసుకుంటే లాభాలు వస్తాయి. కనీస విషయాలు, స్టాక్స్‌లో రకాలు, స్టాక్‌ మార్కెట్‌ ఎలా పనిచేస్తుంది, ఏం చేయవచ్చు, ఏం చేయకూడదన్నది ముందుగా తెలుసుకోవాలి. 

 

చేయాల్సినవి...

  • వర్చువల్‌ ట్రేడింగ్‌ యాప్‌ అన్నది ఉచితంగా మార్కెట్‌ను అధ్యయనం చేసేందుకు ఉపయోగపడుతుంది. చాలా ఉచిత యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. నేరుగా ఇన్వెస్టింగ్‌ ప్రారంభించే ముందు వీటిపై సాధన చేయాలి. 
  • విస్తృత పరిశోధన అవసరం. ఆర్టికల్స్‌ చదవడం, బిజినెస్‌ చానళ్లు నిర్వహించే కార్యక్రమాలను చూడడం చేయాలి. ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి.
  • ఒకదానితో మరొకటి సంబంధం లేని భిన్న రంగాల్లో పెట్టుబడులు పెట్టాలి. పెట్టుబడి మొత్తాన్ని ఒకే చోట ఇన్వెస్ట్‌ చేయరాదు. మీకు తెలిసిన 3-5 రంగాల్లోని స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. అంతర్జాతీయ పరిణామాలు లేదా దేశీయ పరిణామాలతో కొన్ని రంగాలు నష్టపోతుంటాయి. కొంత కాలానికి తిరిగి ఆయా రంగాల స్టాక్స్‌ కచ్చితంగా పెరుగుతాయి. కనుక తక్కువ ధరల వద్ద అమ్మడం కంటే, అదనపు పెట్టుబడులు పెట్టడం సరైనది. 
  • ట్రేడింగ్‌ ఫీజులు భారీగా లేని సంస్థను ఎంచుకోవాలి. 

 

చేయకూడనవి...

  • స్టాక్‌ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సరైన సమయం కోసం వేచి చూడొద్దు. కచ్చితమైన సమయమంటూ ఉండదు.
  • ఆవేశంతో స్టాక్స్‌ను ఎంచుకోవద్దు. తగిన పరిశోధన, అధ్యయనం తర్వాతే... మెరుగైన కంపెనీ అని తేలిన దానిలోనే ఇన్వెస్ట్‌ చేయాలి. మీరు ఇష్టపడ్డ కంపెనీలో కాదు. కొనుగోలుకు వాస్తవ సమాచారమే ఆధారం కావాలి. 
  • అతిగా ఇన్వెస్ట్‌ చేయవద్దు. అంటే మీ ఆర్థిక పరిస్థితులు తారుమారు కానంత వరకే ఇన్వెస్ట్‌ చేయాలి. అందుకే ఎంత మొత్తం ఇన్వెస్ట్‌ చేయాలన్నది పక్కన పెట్టుకోవాలి. 
  • ఫలానా స్టాక్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే... ఇంత కాలంలో ఇంత మేర రాబడులు ఇస్తుందంటూ ఇతరులు ఇచ్చే సూచనలను పట్టించుకోవద్దు. దీనికి బదులు స్వీయ అధ్యయనం, ఆర్థిక నిపుణుల సలహాల మేరకే నడుచుకోవాలి. 
  • సానుకూల వార్తల ఆధారంగా... అసాధారణ అంచనాలతో లేదా స్వల్ప కాల రాబడుల ఆకాంక్షలతో ఇన్వెస్ట్‌ చేయవద్దు. అలాగే, ప్రతికూల వార్తలను చూసి తొందరపాటుతో అమ్మేయడం కాకుండా, పూర్తి అధ్యయనం తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.You may be interested

ఈక్విటీల కంటే ఈ ఎన్‌సీడీలు మెరుగా...?!

Saturday 12th January 2019

ఈక్విటీల్లో రాబడుల అవకాశాలు దీర్ఘకాలంలో మెరుగ్గా ఉంటాయనే విషయంలో ఎక్కువ మందికి సందేహం లేదు. కానీ, స్వల్ప కాలం, మధ్య కాలానికి రాబడుల విషయంలో రిస్క్‌ చాలా ఎక్కువగా ఉంటుందని తెలిసిందే. ఏడాది, మూడేళ్ల కాలం కోసం కాస్త అధిక రాబడులు ఆశించే వారు కూడా మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. మరి వీరికి ప్రత్యామ్నాయంగా మెరుగైన రాబడి ఇచ్చే సాధనాలు ఏమున్నాయి? అని పరిశీలిస్తే... తాజాగా ఇష్యూ

ఈ ఏడాది చిన్నస్టాకులదే రాజ్యం!

Friday 11th January 2019

అనలిస్టుల అంచనా గతేడాది పలువురు ఇన్వెస్టర్లకు చుక‍్కలు చూపిన స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ ఈ సంవత్సరం కోలుకుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత గణాంకాల ఆధారంగా చూస్తే ఒక ఏడాది పేలవ ప్రదర్శన అనంతరం తరువాత సంవత్సరం మంచి రాబడులను చిన్న స్టాకులు అందించినట్లు తెలుస్తోందన్నారు. ఉదాహరణకు 2013లో మిడ్‌, స్మాల్‌క్యాప్స్‌ సూచీలు వరుసగా 6, 11 శాతం మేర నష్టపోయాయి. ఆ ఏడాది ప్రధాన సూచీలు 9 శాతం లాభపడ్డాయి.

Most from this category