STOCKS

News


మిడ్‌క్యాప్స్‌ పతనంలో ఫండ్స్‌ ఎంచుకొన్న షేర్లివి

Friday 13th July 2018
Markets_main1531422025.png-18270

ఈ ఏడాది మిడ్‌క్యాప్‌ సూచీ 18 శాతం, స్మాల్‌ క్యాప్‌ సూచీ 24 శాతం వరకు పతనమయ్యాయి. దీంతో కొందరు విశ్లేషకులు మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ కంటే లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ రిస్క్‌, రాబడుల పరంగా నయమంటూ సూచనలు కూడా ఇస్తున్నారు. కానీ, ఇదే సమయంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్లు కొన్ని మిడ్‌, స్మాల్‌ స్టాక్స్‌లో కొనుగోళ్లు చేయడం విశేషం. జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి 1,000 కంపెనీల వాటాదారుల వివరాలు బయటకు రాగా, ఇందులో 20 స్టాక్స్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ తమ వాటాలను చెప్పుకోతగ్గ స్థాయిలో పెంచుకోవడం గమనార్హం. ఈ 20 స్టాక్స్‌లో మూడింట రెండొంతులు మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ విభాగంలోనివే.

 

పెరిగిన వాటా
యాన్సిలరీ కంపెనీ సంధార్‌ టెక్నాలజీస్‌లో ఫండ్స్‌ వాటా 3.8 శాతం మేర పెరిగింది. మార్చి క్వార్టర్‌లో 6.6 శాతంగా ఉంటే, జూన్‌ త్రైమాసికంలో 10.4 శాతానికి చేరింది. ఈ కంపెనీ అధిక వృద్ధి దశలోకి అడుగు పెట్టిందని, అమ్మకాలు 19.4 శాతం, లాభాలు 54.4 శాతం మేర మరో రెండేళ్ల పాటు కొనసాగుతాయని కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ అంచనా వేసింది. ఇక, పీవీఆర్‌లోనూ మ్యూచువల్‌ ఫండ్స్‌ వాటా మార్చి త్రైమాసికం నుంచి జూన్‌ త్రైమాసికానికి గమనిస్తే 9.9 శాతం నుంచి 13.2 శాతానికి పెరిగింది. వర్ధమాన్‌ టెక్నాలజీస్‌లో 14.2 శాతం నుంచి 17.5 శాతానికి చేరాయి. వర్ధమాన్‌ టెక్నాలజీస్‌కు ఫ్యాబ్రిక్‌ డివిజన్‌ నుంచి వచ్చే ఆదాయం పెరుగుతుందని అనలిస్టుల అంచనా. అహ్లువాలియా కాంట్రాక్ట్స్‌లో 3 శాతం, మెక్‌లయడ్‌ రస్సెల్‌ ఇండియా, టీవీ టుడే నెట్‌వర్క్‌లో 2.4 శాతం చొప్పున జూన్‌ క్వార్టర్లో మ్యూచువల్‌ ఫండ్స్‌ వాటా పెరిగింది.

 

అహ్లువాలియా కాంట్రాక్ట్స్‌ జూన్‌ క్వార్టర్లో అమ్మకాల పరంగా క్షీణత నమోదు చేయవచ్చని, అయినప్పటికీ కంపెనీ ఎబిటా మార్జిన్‌ 2 శాతానికి పైగా పెరిగి 12.8 శాతానికి చేరుకుంటుందని, లాభం కూడా 11 శాతం మేర పెరగొచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. మెక్‌లయడ్‌ రస్సెల్‌ ఇండియా 8-10 టీతోటలను అమ్మేసి రుణ భారం తగ్గించుకోవాలనుకుటోంది. టీవీ టుడే నెట్‌వర్క్స్‌ 2020 నాటికి ప్రింట్‌ విభాగంలో బ్రేక్‌ ఈవెన్‌ సాధిస్తుందని ఐఐఎఫ్‌ఎల్‌ అంచనా. కర్ణాటక బ్యాంకులో 1.4 శాతం, స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌లో 2.1 శాతం, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ నెట్‌వర్క్‌, మహానగర్‌ గ్యాస్‌, ఐఎఫ్‌జీఎల్‌ రిఫ్రాక్టరీస్‌, కంట్రోల్‌ ప్రింట్‌, జీనస్‌ పవర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లోనూ ఫండ్స్‌ వాటా పెరిగింది. 

 

‘బాటమ్‌అప్‌’కు మంచి సమయం
ఎంపిక చేసిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కంపెనీలు విలువను సంతరించుకుంటున్నాయని యాష్‌మోర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కు చెందిన అశ్వని అగర్వాల్‌ పేర్కొన్నారు. ‘‘టాప్‌డౌన్‌ ఇన్వెస్టింగ్‌ కంటే బాటమ్‌ అప్‌ (విడిగా కంపెనీ ఆర్థిక మూలాలను విశ్లేషించి చేసే ఇన్వెస్ట్‌మెంట్‌)కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్‌కు ముందు కంపెనీలను గమనించినప్పుడు చాలా తక్కువ విలువే మార్కెట్లలో మిగిలి ఉందనిపించింది. కానీ, ఈ రోజు బాటమ్‌ అప్‌ విధానానికి చాలా ఆశాజనక అవకాశాలు ఉన్నాయి’’ అని ఆమె తెలిపారు.



You may be interested

18 ఏళ్లు రాగానే తెలుసుకోవాల్సిన ఆర్థిక అంశాలు

Friday 13th July 2018

తల్లిదండ్రుల్లో కొందరు తమ పిల్లల పేరిట ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. దీంతో వారి మైనర్‌ పిల్లల పేరిట బ్యాంకు ఖాతాలు, పలు రకాల సాధనాల్లో పెట్టుబడులు ఉంటాయి. అయితే, వారికి 18 ఏళ్లు వచ్చిన వెంటనే వాటికి హక్కుదారులుగా, నిర్వాహకులుగా మారిపోతారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణ సంస్థలు మైనారిటీ తీరిన వారి పేరిట ఉన్న పెట్టుబడులను ఫ్రీజ్‌ చేసేస్తాయి. మేజర్‌ అయిన వెంటనే పూర్తి వివరాలతో, డాక్యుమెంట్లతో, తమ సంతకంతో రికార్డులను

పీఎస్‌యూ కన్నా.. ప్రైవేట్ మిన్న..

Thursday 12th July 2018

ముంబై: ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలతో పోలిస్తే ప్రైవేట్‌ బీమా సంస్థలు గణనీయ స్థాయిలో వృద్ధి సాధిస్తున్నాయి. 2017–18లో 22 శాతం మేర వృద్ధి నమోదు చేశాయి. అదే సమయంలో ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) సాధారణ బీమా సంస్థలు 13 శాతమే వృద్ధి సాధించాయి. రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం సాధారణ బీమా రంగం 17 శాతం మేర వృద్ధి చెందింది.

Most from this category