News


ఫండ్స్‌ ఎక్స్‌పెన్స్‌ రేషియోలో ఏముంది..?

Thursday 13th June 2019
personal-finance_main1560448622.png-26277

మ్యూచువల్‌ ఫండ్స్‌ సేవలు ఉచితం కాదు. ఇన్వెస్టర్ల తరఫున పెట్టుబడుల వ్యవహారాలను చూస్తున్నందుకు గాను అవి ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ ఫీజు, ఏజెంట్‌ కమీషన్లు, రిజిస్ట్రార్‌ ఫీజులు, సెల్లింగ్‌ చార్జీలు, ప్రచార చార్జీలు, ఇలా సమస్త చార్జీలు అన్నింటినీ కూడా ఇన్వెస్టర్ల నుంచే వసూలు చేసుకుంటుంటాయి. ఇవన్నీ కలసి ఎక్స్‌పెన్స్‌ రేషియోగా ఆయా పథకాల సమాచారంలో కనిపిస్తుంది. వార్షికంగా ఇంత శాతం చొప్పున పెట్టుబడుల విలువపై ఎక్స్‌పెన్స్‌ రేషియోను చార్జ్‌ చేస్తుంటాయి. ఈ చార్జీని రోజుకు ఎంతో లెక్కించి ఏ రోజుకారోజు ఫండ్స్‌ యూనిట్ల నుంచి మినహాయించుకుంటుంటాయి. 

 

ఏటా మీ పెట్టుబడులను నిర్వహిస్తున్నందుకు గాను ఏఎంసీకి ఎంత చెల్లిస్తున్నారన్నది ఈ ఎక్స్‌పెన్స్‌ రేషియో చెబుతుంది. ఉదాహరణకు ఓ పథకంలో రూ.10,000 ఇన్వెస్ట్‌ చేశారనుకుంటే, ఎక్స్‌పెన్స్‌ రేషియో 1.5 శాతం అయితే, అప్పుడు ఏడాదికి రూ.10వేలపై రూ.150ను ఫీజుగా చెల్లిస్తు‍న్నట్టు. దీని ప్రకారం ఓ పథకంలో వాస్తవ రాబడులు 10 శాతం అయినప్పటికీ ఎక్స్‌పెన్స్‌ రేషియో 1.5 శాతం మినహాయిస్తే ఇన్వెస్టర్‌ రాబడులు 8.5శాతమే అవుతుంది. రోజువారీ కనిపించే ఫండ్స్‌ యూనిట్ల ఎన్‌ఏవీ అన్నది ఆయా ఫీజులన్నింటినీ ఏరోజు కారోజు మినహాయించుకోగా మిలిగినదేనని అర్థం చేసుకోవాలి. ఏఎంసీ వెబ్‌సైట్‌లో డిస్‌క్లోజర్స్‌ ట్యాబ్‌లో ఓ పథకంలో ఎక్స్‌పెన్స్‌ రేషియో ఎంతన్నది ఉంటుంది. వ్యాల్యూ రీసెర్చ్‌ వంటి వెబ్‌సైట్లలోనూ సమగ్ర సమాచారం లభిస్తుంది. 

 

ఈ ఎక్స్‌పెన్స్‌ రేషియో ఎక్కువగా ఉంటే, దీర్ఘకాలంలో ఇన్వెస్టర్‌ రాబడుల్లో చాలా వ్యత్యాసమే వస్తుంది. కాంపౌడింగ్‌ పవర్‌తో ఇన్వెస్టర్‌ చాలా నష్టపోవాల్సి ఉంటుంది కూడా. ఉదాహరణకు రూ.లక్ష పెట్టుబడి పదేళ్ల కాలలో 15 శాతం రాబడి రేటు ప్రకారం రూ.4.05 లక్షలు అవుతుంది. ఎక్స్‌పెన్స్‌ రేషియో 1.5శాతం ఉందనుకుంటే, ఇన్వెస్టర్‌కు వచ్చే వాస్తవ రాబడులు రూ.3.55 లక్షలే అవుతాయి. అంటే అసలు వచ్చిన రాబడుల కంటే ఇన్వెస్టర్‌కు వచ్చింది 14 శాతం తక్కువ. ఒక్క ఎక్స్‌పెన్స్‌ రేషియో ఇంత మేర తినేసింది. భిన్న పథకాలకు భిన్నమైన ఎక్స్‌పెన్స్‌ రేషియోలు ఉంటుంటాయి. ఈక్విటీ పథకాలపై గరిష్టంగా 2.25 శాతం, డెట్‌ ఫండ్స్‌పై 2 శాతం గరిష్ట పరిమితిని సెబీ విధించింది. డెట్‌ ఫండ్స్‌ విషయంలో ఎక్స్‌పెన్స్‌ రేషియో రాబడులను చాలా ప్రభావితం చేస్తుంది. డెట్‌ ఫండ్స్‌ సాధారణంగా 7-9 శాతం మధ్యలో రాబడులను ఇస్తుంటాయి. తక్కువ రాబడులు కావడంతో ప్రతీ పైసా కీలకమే అవుతుంది. యాక్టివ్ ఫండ్స్‌ విషయంలోనూ రెండు పథకాల మధ్య ఎక్స్‌పెన్స్‌ రేషియో భిన్నంగా ఉండడాన్ని గమనించొచ్చు. పైగా ఆయా ఫండ్స్‌ పథకాలు సానుకూల రాబడులను ఇచ్చినా, ప్రతికూల రాబడులను ఇచ్చినా కానీ ఎక్స్‌పెన్స్‌ రేషియో రూపంలో అవి చార్జీలను బాదేస్తూనే ఉంటాయి. కనుక సానుకూల రాబడులను ఇచ్చే ఈక్విటీ పథకాల్లో కొనసాగడమే ఇన్వెస్టర్‌కు రాబడుల పరంగా ప్రయోజనం. రెగ్యులర్‌ ప్లాన్లతో పోలిస్తే డైరెక్ట్‌ ప్లాన్లలో ఎక్స్‌పెన్స్‌ రేషియో తక్కువగా ఉంటుంది. కనుక అవగాహన కలిగిన ఇన్వెస్టర్లు డైరెక్ట్‌ ప్లాన్లను ఎంచుకోవచ్చు.



You may be interested

ఫ్లాట్‌గా ప్రారంభమైన నిఫ్టీ

Friday 14th June 2019

ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 56 పాయింట్ల లాభంతో 39,797.00 వద్ద, నిఫ్టీ 4 పాయింట్ల స్వల్ప నష్టంతో 11,910.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీరేట్లపై కోత అంచనాలతో పాటు, ఇంధన షేర్ల ర్యాలీ కారణంగా నిన్నరాత్రి అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఇక నేడు ఆసియాలో ఒక్క జపాన్‌ తప్ప మిగిలిన

ఇవి... సూపర్‌ సిక్స్‌

Thursday 13th June 2019

ఈ ఏడాది ఇప్పటి వరకు సెన్సెక్స్‌ 10 శాతం రాబడులను ఇచ్చింది. అంతేకాదు ప్రతీ నెలలోనూ జనవరి నుంచి మే వరకు సానుకూల రాబడులను ఇవ్వడం గమనార్హం. మరి బీఎస్‌ఈ-500లో ఎన్ని ప్రధాన సూచీలను మించి రాబడులను ఇచ్చి ఉంటాయన్నది ఆలోచించండి. కేవలం ఆరు స్టాక్స్‌ మాత్రమే అని చెప్పక తప్పదు. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ప్రతీ నెలలోనూ ఈ ఆరు స్టాక్స్‌ బెంచ్‌ మార్క్‌ను

Most from this category