STOCKS

News


టీసీఎస్‌ షేరును ఏం చేద్దాం?

Friday 12th October 2018
news_main1539327825.png-21085

సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం టీసీఎస్‌ క్యు2 ఫలితాలు ప్రకటించింది. అంచనాలకు అనుగుణంగానే ఫలితాలున్నా షేరు మాత్రం శుక్రవారం ట్రేడింగ్‌లో దాదాపు 3 శాతం నష్టంలో ట్రేడవుతోంది. ఈ నెల్లో టీసీఎస్‌ షేరు దాదాపు 15 శాతం మేర క్షీణించింది. ఫలితాలు బాగున్నా షేరులో పాజిటివ్‌ కదలికలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో టీసీఎస్‌ ఫలితాలు, షేరుపై ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు ఎలాంటి సలహా ఇస్తున్నాయో చూద్దాం...
పాజిటివ్‌ అంచనాలు ఇచ్చిన సంస్థలు
- సీఎల్‌ఎస్‌ఏ:  రేటింగ్‌- కొనొచ్చు. టార్గెట్‌ రూ. 2600. షేరుపై బాగా బుల్లిష్‌గా ఉన్నట్లు తెలిపింది. క్యు2లో బలమైన వృద్ధి నమోదు చేసిందని, ఇదే తరహా కొనసాగుతుందని అంచనా వేసింది. అయితే మార్జిన్ల విస్తరణ మాత్రం అనుకున్నదానికన్నా కాస్త తక్కువగా ఉందని తెలిపింది.
- మాక్కై‍్వరీ: రేటింగ్‌- అవుట్‌పెర్ఫామ్‌. టార్గెట్‌ రూ. 2345. బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో వృద్ధి బాగా ఊపందుకుంటోందని తెలిపింది. ఇతర ఆదాయాలు తగ్గుతున్నాయని అభిప్రాయపడింది.
- జెఫర్రీస్‌: రేటింగ్‌- కొనొచ్చు. టార్గెట్‌ రూ. 2300. ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. కంపెనీ గైడెన్స్‌ పాజిటివ్‌గా ఉందని తెలిపింది. బీఎఫ్‌ఎస్‌ఐ, రిటైల్‌, అమెరికా విభాగాల్లో మంచి వృద్ధి ఉంటుందని తెలిపింది. 
- బీఎన్‌పీ పారిబా: రేటింగ్‌- కొనొచ్చు. టార్గెట్‌ రూ. 2500. ఫారెక్స్‌ లాభాలతో 100 బీపీఎస్‌ మేర ‍ప్రయోజనం ఉంటుందని, మార్జిన్లు 28 శాతం వరకు పెరగవచ్చని అభిప్రాయపడింది.


నెగిటివ్‌ అంచనాలున్న సంస్థలు
- నోమురా:  రేటింగ్‌- రెడ్యూస్‌. టార్గెట్‌ రూ. 1950. ఫలితాలు అంచనాల కన్నా తక్కువగా ఉన్నాయి. మార్జిన్లు మాత్రం బాగున్నాయి. రాబోయే రోజుల్లో వృద్ధి కాస్త నెమ్మదించవచ్చని అంచనా వేసింది. ఈ షేరు కన్నా హెచ్‌సీఎల్‌ టెక్‌ షేరును ఎంచుకోవచ్చని సూచించింది.
- క్రెడిట్‌ సూసీ: రేటింగ్‌- న్యూట్రల్‌. టార్గెట్‌ రూ. 1775. ఫలితాలు బాగున్నా టార్గెట్‌ను పెంచేంత సత్తా ఉన్నట్లు కనిపించడం లేదని తెలిపింది. ట్రేడ్‌వార్‌, బ్రెక్సి్‌ట్‌ ప్రభావం ఇప్పటికైతే కనిపించలేదని తెలిపింది. డిజిటల్‌ టెక్‌ విభాగంపై పాజిటివ్‌గా ఉన్నట్లు తెలిపింది.
- డాయిష్‌ బ్యాంక్‌: రేటింగ్‌- హోల్డ్‌. టార్గెట్‌ రూ. 1740. వాల్యూషన్లు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.
- సిటి: రేటింగ్‌- అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 1885. ఫలితాలు అంచనాలకన్నా కాస్త తక్కువగానే ఉన్నాయి. వాల్యూషన్లు 23 రెట్ల వద్ద ఉన్నాయి. భారీ డీల్స్‌ కొనసాగకుంటే వచ్చే ఏడాది ఇబ్బందులుండవచ్చని తెలిపింది. 


TCS

You may be interested

ఐటీ ఎర్నింగ్స్‌.. ఎలా ఉండొచ్చు?

Friday 12th October 2018

ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసికంలో (క్యూ, జూలై-సెప్టెంబర్‌) ఐటీ కంపెనీల ఎర్నింగ్స్‌ ఎలా ఉండొచ్చొ తెలియజేస్తూ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం.. ♦ ఐటీ కంపెనీల ఎర్నింగ్స్‌లో మంచి వృద్ధి నమోదు కావొచ్చు. రెవెన్యూ వృద్ధి వార్షికంగా 7.9 శాతం, త్రైమాసికంగా 2.1 శాతంగా ఉండొచ్చు. టైర్‌-1 ఐటీ వృద్ధి 1.9 శాతం (క్వార్టర్ పరంగా), 6.7 శాతం (వార్షికంగా).. మిడ్‌క్యాప్‌ ఐటీలో వృద్ధి 3.4

మార్కెట్లో ముందే ‘దీపావళి’

Friday 12th October 2018

ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్‌.. ఇన్వెస్టర్ల కోసం దీపావళిని ముందే తీసుకువచ్చిందంటున్నారు మోర్గాన్‌ స్టాన్లీ ఇండియా ఎండీ రిధమ్‌ దేశాయ్‌. ఖరీదైన స్టాక్స్‌ చౌకగా లభ్యమౌతున్నాయని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్‌లోని ఒడిదుడుకులు దీర్ఘకాల ఇన్వెస్టర్లకు మంచి అవకాశాలను అందిస్తున్నాయని తెలిపారు. కాగా ఆగస్ట్‌ నుంచి చూస్తే సెన్సెక్స్‌, నిఫ్టీ ఇండెక్స్‌లు 12 శాతానికిపైగా పతనమయ్యాయి. రూపాయి క్షీణత, క్రూడ్‌

Most from this category