STOCKS

News


సెల్లింగ్‌కు సరైన సమయం ఎప్పుడు?

Wednesday 13th February 2019
Markets_main1550042855.png-24176

మీరు కొన్న స్టాకు బాగా లాభాలను ఆర్జించినప్పుడు అమ్ముతారా, అట్టిపెట్టుకుంటారా? మీరు కొన్న స్టాకు ఆల్‌టైమ్‌ హైకి చేరినప్పుడు అమ్ముతారా, అట్టిపెట్టుకుంటారా?.... ఈ ప్రశ్నలకు చాలామంది అమ్మేస్తామనే సమాధానం ఇస్తారు. కానీ దిగ్గజ ఇన్వెస్టర్లు మాత్రం రివర్సులో సమాధానం ఇస్తారు. తాము కొన్న స్టాకులు 100 శాతం లాభాల్లో ఉన్నప్పుడు, ఆల్‌టైమ్‌ హైకి చేరినప్పుడు తాము విక్రయించమని చెబుతారు.

ఇండియన్‌ వారెన్‌ బఫెట్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా ఇందుకు సంబంధించి రెండు ఉదాహరణలు చూపుతున్నారు..


‘‘ టైటాన్‌ షేరు నేను కొన్నతర్వాత మూడేళ్లలో 100 శాతం రాబడినిచ్చింది. కానీ నేను ఇంకా ఈ షేర్లను హోల్డ్‌ చేస్తూనే ఉన్నాను. ప్రతిసారి ఇంత తక్కువ వ్యవధిలో ఇంత రాబడిఇవ్వడం అన్ని స్టాకులకు సాధ్యం కాదు. కానీ టైటాన్‌ దీన్ని సాధ్యం చేసి చూపింది. అందువల్ల ఇంత మంచి షేరును వదులుకోవడానికి నేను ఇష్టపడలేదు. వంద శాతం ర్యాలీ తర్వాత స్టాకు ధర 15, 20 శాతం పడిపోవచ్చు. దానికి నేనేమీ బాధపడడం లేదు. అంతమాత్రానికే టైటాన్‌ షేర్లను వదిలించుకోవాలనుకోవడం లేదు. చేతిలో ఉన్న మంచి స్టాకును వదులుకొని కాబోయే మల్టీబ్యాగర్‌ కోసం ఎదురుచూడడానికి నేను ఇష్టపడలేదు.’’


‘‘ లుపిన్‌ను నేను కొనుగోలు చేసినతర్వాత భారీగా దూసుకుపోయి మూడేళ్లలో రూ. 2200కు చేరింది. కానీ నేను ఊహించని విధంగా ఒక్కమారుగా ఈ షేరు రూ. 820కి పడిపోయింది. నిజానికి ఈ షేరు రూ. 1400కు మించి పడిపోదని నేను భావించాను. కానీ నా అంచనాలు తారుమారయ్యాయి. కానీ నేను ఇప్పటికీ ఈ షేరు వదిలించుకోలేదు. ఎందుకంటే మొత్తంమీద ఫార్మా రంగంపై నేను పాజిటివ్‌గా ఉన్నాను. ఈ రంగంలో లుపిన్‌ మంచి షేరు. అందుకే లుపిన్‌ షేరు హోల్డింగ్‌ను కొనసాగిస్తున్నాను.’’


‘‘ ప్రతిఒక్కరు సక్సెస్‌ స్టోరీల గురించే మాట్లాడతారు. కానీ తప్పుల గురించి ఎవరూ మాట్లాడరు. చాలామంది నేను మేధావిననుకుంటారు, కానీ నేను ఎంత మూర్ఖున్నో నాకు మాత్రమే తెలుసు. ఇదే జీవిత సత్యం. అలాగని జీవితంలో తప్పుల గురించి ఆలోచిస్తూ బాధపడాల్సిన అవసరం లేదు. వాటిని పాఠాలుగా మార్చుకుంటే చాలు.’’
 You may be interested

స్వల్పంగా పెరిగిన పసిడి

Wednesday 13th February 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర బుధవారం స్వల్పంగా పెరిగింది. అమెరికా - చైనా వాణిజ్య చర్చలపై ఇన్వెస్టర్లకు ఎలాంటి స్పష్టమైన సమాచారం అందకపోవడంతో పాటు డాలర్‌ ఇండెక్స్‌ ఒడిదుడుకుల ట్రేడింగ్‌  పసిడికి బలానిస్తున్నాయి. ఆసియా ట్రేడింగ్‌లో బుధవారం ఔన్స్‌ పసిడి ధర 3.50డాలర్ల మేర బలపడి 1,317.55 డాలర్లకు చేరుకుంది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ దాదాపు 0.10శాతం క్షీణించి 96.442 కనిష్టాన్ని తాకింది. వ్యయాల బిల్లుకు కాంగ్రెస్‌

15 శాతం ఎర్నింగ్స్‌ గ్రోత్‌ ఖాయం!

Wednesday 13th February 2019

రాబోయే మూడు ఆర్థిక సంవత్సరాల పాటు దేశీయ ఈక్విటీలు రెండంకెల ఎర్నింగ్స్‌ వృద్ది నమోదు చేస్తాయని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. పన్నులు, మొండిపద్దులకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, విధాన నిర్ణయాల ఫలితంగా ఎకానమీలోకి నగదు ప్రవాహం పెరుగుతుందని అభిప్రాయపడింది. మొండిపద్దుల వసూళ్లు, జీఎస్‌టీ కారణంగా కంపెనీలకు మూలధన వ్యయాలు దిగివస్తాయని, ప్రజల్లో పొదుపు పెరుగుతుందని, దీంతో ఎర్నింగ్స్‌ 10- 15 శాతం వరకు

Most from this category