STOCKS

News


రెండోరోజూ రికార్డు ముగింపే..

Saturday 13th July 2019
news_main1563000686.png-27041

ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు మరింత బలపడటంతో అమెరికా మార్కెట్లు శుక్రవారం వరుసగా రెండోరోజూ రికార్డు గరిష్ట స్థాయిలోనే ముగిశాయి. రెండురోజుల కిత్రం అమెరికా కాంగ్రెస్‌ ఎదుట ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ ప్రసంగిస్తూ ‘‘తయారీ రంగ మందగమనం, ద్రవ్యోల్బణం, వాణిజ్య యుద్ధాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇంకా ముప్పు పొంచి ఉం‍ది. సెంట్రల్ బ్యాంక్ పరిస్థితులకు అనుగుణంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంది’’ అన్నారు. రానున్న రోజుల్లో ఫెడ్‌రిజర్వ్‌ వడ్డీరేట్ల తగ్గింపు వైఖరికి పావెల్‌ ప్రసంగం స్పష్టమైన సంకేతం ఇచ్చినట్లు అర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో గత రెండురోజులుగా అమెరికా మార్కెట్లు కొత్త రికార్డు స్థాయిలను అందుకొని సరికొత్త రికార్డు స్థాయిల వద్ద ముగిస్తున్నాయి. ఇండస్ట్రీయల్‌, కన్జూ‍్యమర్‌, మెటల్‌ రంగాలకు చెందిన షేర్లు రాణించడంతో ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌ 14 పాయింట్లు లాభంతో 3000స్థాయి పైన 3,013.77 వద్ద ముగిసింది. వారం మొత్తం మీద ఈ ఇండెక్స్‌ 0.8శాతం బలపడింది. డౌ జోన్స్‌ ఇండస్ట్రీయల్‌ ఏవరేజ్‌ ఇండెక్స్‌ 244 పాయింట్లు పెరిగి 27,332.03 వద్ద స్థిరపడింది. నాస్‌డాక్‌ కాంపోసైట్‌ 49 పాయింట్లు 8,244.14 వద్ద ముగిసింది. ఎలక్ట్రానిక్స్‌ కార్ల తయారీకి వోక్స్‌వేగాన్‌ కంపెనీతో కలిసి పనిచేస్తున్నట్ల్లు కంపెనీ ప్రకటించడంతో ఫోర్డ్‌ మోటర్స్‌ షేర్లు 2.50శాతం ర్యాలీ చేశాయి. కాన్సర్‌ కారకానికి సంబంధించిన సమ్మేళనాన్ని టాల్కమ్‌ పౌడర్లో వాడిందనే ఆరోపణ కేసు దర్యాప్తును అమెరికా జస్టిస్‌ విభాగం మరింత వేగవంతం చేయడంతో  జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ షేర్లు 4.1శాతం నష్టపోయాయి.
ఇన్వెస్టర్లు వచ్చే వారం నుంచి విడుదల కానున్న రెండో త్రైమాసికపు కార్పోరేటు ఫలితాలపై దృష్టిసారించారు. అమెరికాలో అతిపెద్ద బ్యాంకులైన సిటీ గ్రూప్‌, జేపీమోర్గాన్‌ లు తమ క్యూ2 ఫలితాలను విడుదల చేయనున్నాయి.



You may be interested

ప్రతికూలంగా ఉన్నా.. ఈ స్టాకులు రాణిస్తాయి

Saturday 13th July 2019

బడ్జెట్‌లో పబ్లిక్‌ హోల్డింగ్‌, సర్‌చార్జీలను పెంచడంతో బెంచ్‌మార్క్‌ నిఫ్టీ గత వారం నుంచి నష్టాల్లో ముగుస్తోంది. జులై 9 న 11,461  కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఇప్పటికి కూడా ఆ స్థాయి దగ్గర్లోనే ట్రేడవుతోంది. 11,600  స్థాయిని పొందేందుకు బలహీనమైన ప్రయత్నాలను చేస్తుంది. బడ్జెట్‌ ఆందోళనల నేపథ్యంలో  వచ్చే వారం కూడా మార్కెట్లు నెగిటివ్‌గానే ట్రేడయ్యే అవకాశం ఉంది.      సాంకేతికంగా చెప్పాలంటే నిఫ్టీ 50  ఇండెక్స్‌ రోజువారి చార్ట్‌లలో

అవన్నీ నిరాధార ఆరోపణలే

Saturday 13th July 2019

గంగ్వాల్‌పై భాటియా గ్రూప్ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌లో గవర్నెన్స్‌ పరమైన లొసుగులున్నాయంటూ సహ ప్రమోటరు రాకేష్ గంగ్వాల్ చేసిన ఆరోపణలను మరో ప్రమోటరు రాహుల్ భాటియాకు చెందిన ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజేస్‌ (ఐజీఈ) ఖండించింది. ఇవన్నీ పసలేని ఆరోపణలేనని వ్యాఖ్యానించింది. ఇండిగో 'పాన్‌షాపు' కన్నా అధ్వాన్నంగా తయారైందంటూ గంగ్వాల్ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. 'పాన్‌షాపు' సమర్ధులైన అధికారుల సారథ్యంలో చక్కగానే పనిచేస్తోందని, ఆర్థికంగా పటిష్టంగానే

Most from this category